దివ్య తల్లిదండ్రులకి ఫోన్ చేసి అర్జెంట్ గా చూడాలని అనిపిస్తుందని వెంటనే ఇంటికి రమ్మని చెప్తుంది. అక్కడ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ఏంటోనని తులసి కంగారుపడుతుంది. తులసి వాళ్ళు ఇంటికి రాగానే ఎవరూ చూడకుండా హడావుడిగా కంగారుపడుతూ లోపలికి తీసుకుని వెళ్తుంది. అదంతా చాటుగా లాస్య, రాజ్యలక్ష్మి చూస్తూ ఉంటారు. నందు కుక్కపిల్లలా నా దగ్గరకి వచ్చేలా చేస్తాను. తులసి, దివ్యది ఒకటే మెంటాలిటీ. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వెంటనే ఆదుకుంటారు. అది వాళ్ళ వీక్ నెస్. వాళ్ళ నాన్న కష్టాల్లో ఉన్నాడని హింట్ ఇస్తే వెంటనే వాళ్ళని పిలిపించింది. మరి మనం అనుకున్నది ఏం చేశావని లాస్య అడుగుతుంది. రాజ్యలక్ష్మి బసవయ్యని పిలిచి ఏదో చెప్తుంది. అలాగే అంటూ బసవయ్య విక్రమ్ ని తీసుకెళ్ళి దివ్య తులసి వాళ్ళతో మాట్లాడటం చాటుగా చూపిస్తాడు. సరిగా అప్పుడే దివ్య డబ్బులు తీసుకొచ్చి తులసి వాళ్ళకి ఇస్తూ ఉండటం చూస్తాడు.
Also Read: కావ్య మీద బెట్టుతో కూడిన ప్రేమ చూపించిన రాజ్- అప్పుని విడిపించిన కళ్యాణ్
ఇందులో ఏముంది దివ్య వాళ్ళ అమ్మానాన్నకే కదా ఇస్తుంది అందులో తప్పేముందని చిరాకు పడి వెళ్ళిపోతాడు. కేఫ్ కి పెట్టుబడిగా ఉపయోగించమని దివ్య తులసి చేతిలో డబ్బులు పెడుతుంది. ఈ డబ్బులు ఇలా ఇస్తున్నట్టు విక్రమ్ కి, మీ అత్తకి చెప్పావా? ఇది కరెక్ట్ కాదు. మా అవసరం మీ ఇంట్లో సమస్యలు తీసుకురాకూడదని తులసి చెప్తుంది. కానీ దివ్య మాత్రం ఇది తన డబ్బని విక్రమ్ కి తర్వాత చెప్తానని అంటుంది. కానీ తులసి వాళ్ళు మాత్రం ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి వెళ్లిపోతారు. రేపు ఇంట్లో కురుక్షేత్రం జరగబోతుందని లాస్య సంబరపడుతుంది. తెల్లారి లాస్య డబ్బుల కోసం విక్రమ్ దగ్గరకి వస్తుంది. నిన్న ఇచ్చిన క్యాష్ తీసుకుని రమ్మని దివ్యని పిలుస్తాడు. లాస్య లెక్కపెట్టుకుంటానని సేఫ్టీ కోసమని అడుగుతుంది. రెండు నోట్ల కట్టలే ఉన్నాయి మూడు ఉండాలి కదా అంటుంది. అప్పుడే రాజ్యలక్ష్మి వచ్చి ఏమైందని అడిగితే ఒక కట్ట మిస్ అయ్యిందని చెప్తాడు. దివ్యకి అలవాటు లేదు హ్యాండిల్ చేయలేదని చెప్తే నువ్వే వినిపించుకోలేదని అంటాడు.
దివ్య ఎంత వెతికినా కూడా డబ్బు కనిపించదు. ఖాళీ చేతులతో వస్తుంది. ఎవరో దొంగతనం చేశారని దివ్య చెప్తుంది. మాట చెప్తే నమ్మేట్టు ఉండాలి ఎవరైనా దొంగతనం చేస్తే మొత్తం కొట్టేస్తాడు కానీ కొంచెం తీసుకుంటాడా అని బసవయ్య అంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని దివ్య అనేసరికి బసవయ్య బిత్తరపోతాడు. తప్పు దివ్యదే అన్నట్టు బసవయ్య మాట్లాడతాడు. విక్రమ్ తులసి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. దివ్య తన పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే విక్రమ్ కళ్ళారా చూశాడు. అయినా ఏం మాట్లాడటం లేదు. అందుకే ఆ డబ్బులు కట్టేస్తామని బసవయ్య నటిస్తాడు. లాస్య ఆంటీ ఇచ్చిన డబ్బులు రూపాయి కూడా ముట్టుకోలేదు నేను దాచుకున్న డబ్బులో నుంచి ఇచ్చాను. అది కూడా వాళ్ళు తీసుకోలేదు ఆడపిల్ల సంపాదన ముట్టుకోలేమని వెళ్లిపోయారని దివ్య చెప్తుంది. కానీ బసవయ్య మాత్రం దివ్యని దోషిని చేసేలా మాట్లాడతాడు.
Also Read: గీతిక ముందు తన ప్రేమని బయటపెట్టిన కృష్ణ- ముకుందకి ఇంకొక పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన భవానీ
విక్రమ్ కూడా దివ్యని అపార్థం చేసుకుంటాడు. ముందుగా మాట చెప్తే నేనే వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని నా మీద కూడా నమ్మకం లేకపోతే ఏం చేయలేను. పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినందుకు నేనేమీ తప్పు పట్టడం లేదు. కానీ డబ్బు ఇవ్వలేదు వాళ్ళు తీసుకోవడం లేదని చెప్పడాన్ని తప్పు పడుతున్నానని అంటాడు. చేయని తప్పుని ఒప్పుకునే ప్రసక్తే లేదని దివ్య తెగేసి చెప్తుంది. లాస్య తులసి వాళ్ళ ఇంటికి వస్తుంది.