తానేమీ అబద్ధాలు చెప్పడం లేదని మురారీ అంటాడు. 474.. ఈ మూడు నాలుగు రోజులుగా మీరు నాకు చెప్పిన అబద్ధాలని కృష్ణ అనేసరికి మురారీ బాధపడతాడు. సోరి కృష్ణ ఇంకెప్పుడు నీకు అబద్ధాలు చెప్పనని అనుకుంటాడు. ఈ డైరీ అమ్మాయి గురించి ఏసీపీ సర్ చాలా డిస్ట్రబ్ అవుతున్నారు తను ఎవరో గీతికని అడిగితే తెలుస్తుందని అనుకుని తనకి కాల్ చేస్తుంది. కలవమని అడిగితే సరేనని చెప్తుంది. ఒక చోట కృష్ణ గీతికని కలుసుకుంటుంది. వాళ్ళని ముకుంద దూరం నుంచి గమనిస్తుంది. ఈ కృష్ణ ఎప్పుడు ఎవరి పక్కలో బాంబ్ పేలుస్తుందో అర్థం కావడం లేదు ఇంత అర్జెంట్ గా గీతికని ఎందుకు కలుస్తుందోనని టెన్షన్ పడుతుంది.


కృష్ణ: ఏసీపీ సర్ గతంలో ఒక అమ్మాయిని లవ్ చేశారు తను ఎవరో నీకు తెలుసా?


ముకుంద: హమ్మయ్య మా ప్రేమ గురించి నిజం తెలుసుకుని మమ్మల్ని కలపాలని అనుకుంటుంది


గీతిక: తెలియదు కృష్ణ


కృష్ణ: నిజంగా తెలియదా


Also Read: మాళవిక తొలి విజయం- హాల్లోకి చేరిన యష్ పెళ్లి ఫోటో, మౌనంగా చూస్తూ ఉండిపోయిన వేద


గీతిక: నాకు ఎలా తెలుస్తుంది. మురారీ కేవలం నా బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న వాళ్ళ బ్రదర్ అంతే కదా. అయినా మురారీ ఎప్పుడో ఎవరినో ప్రేమిస్తే నీకు ఎందుకు? మీరు ఎలాగూ భార్యాభర్తలు కదా


కృష్ణ: అవును కానీ తన మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిస్తే నాకు ఎలా ఉంటుందో చెప్పు. ఈ విషయం ఇంట్లో చెప్పలేక నాలో దాచుకోలేక ఎంత బాధగా ఉందో


గీతిక: ముకుందకి చెప్పొచ్చు కదా. తను నీకు మంచి సలహా ఇస్తుంది


కృష్ణ: అవును పెళ్లికి ముందు తను కూడా లవ్ చేసింది కదా


గీతిక: ఎవరిని?


కృష్ణ: ఎవరినో అయినా తను లేనప్పుడు తన గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు


గీతిక: ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావ్. మురారీ మనసులో నువ్వు లేవని తెలుసుకుని తన మనసులో ఉన్న అమ్మాయిని ఒకటి చేయాలని అనుకుంటున్నావా?


కృష్ణ: కాదు ఏసీపీ సర్ నన్ను పెళ్లి చేసుకున్నాకే బ్రేకప్ చెప్పారా? అనేది తెలుసుకోవాలి


గీతిక: అంటే నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా?


కృష్ణ: అవును ఆయన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. దేవుడి కన్నా ఎక్కువగా ఆరాధిస్తున్నా


Also Read: కావ్య తప్పేం లేదన్న రాజ్- కోడలికి థాంక్స్ చెప్పిన అపర్ణ, అప్పుని జైలుకి వెళ్ళకుండా కాపాడేదేవరు?


గీతిక: ఎవరు ఆయన


కృష్ణ: ఇంకెవరు మా ఆయనే


ఆ మాటలు విని ముకుంద గుండె ముక్కలైపోతుంది. శ్రీనివాస్ కూతురి జీవితం ఇలా అయిపోయింది ఏంటని బాధపడుతుంటే భవానీ వస్తుంది. ఆదర్శ్ ఎక్కడఉన్నా తిరిగి తీసుకొస్తానని భవానీ మాట ఇస్తుంది. తను రాకపోవడానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయ్ ఆదర్శ్ కి ఏదైనా జరగరానిది ఏదో జరిగి ఉంటుంది. రెండోది తనకి ఇంటికి రావడం ఇష్టం లేదని అర్థమని చెప్తాడు. ఇంతకాలంగా మీరు వెతికిస్తున్నా కూడా ఎందుకు సమాచారం తెలియలేదని ప్రశ్నిస్తాడు.


భవానీ: నువ్వు అన్నట్టుగా ఆదర్శ్ కి ఏదైనా జరిగితే నీ కూతురు దీర్ఘసుమంగళిగా ఉంటుంది. నీ కూతురికి అద్భుతమైన సంబంధం తీసుకొచ్చి ఆ అబ్బాయిని నేను దత్తత తీసుకుని నా ఇంటి పేరు ఇచ్చి పెళ్లి చేస్తాను. మాట ఇస్తున్నాను


శ్రీనివాస్: మాట ఇచ్చారు అసలు జరిగింది ఏంటో ఆవిడకి చెప్పేయాలి


ముకుంద జరిగింది అంతా తలచుకుని ఏడుస్తుంది. ఇప్పటి వరకు కృష్ణ మురారీని ప్రేమించలేదు అగ్రిమెంట్ అయిపోగానే వెళ్ళిపోతుంది అనుకున్నా. కానీ అది జరగేలా లేదు. ఇప్పుడు వీళ్ళ ప్రేమని చూసి నేను త్యాగం చేయాలా? అది జరగదు. తొందరపడు ముకుంద లేకపోతే కృష్ణ తొందరపడితే నీ జీవితం మోడుబారిపోతుందని అనుకుంటుంది.