తులసి సరుకులు తీసుకుని ఇంటికి రావడంతో లాస్య బండారం బయటపడుతుంది. వంటింట్లో అన్నింటికీ లాస్య తాళం వేసుకుందని, ఆవిడ పర్మిషన్ లేకుండా ఎవరూ కప్పు కాఫీ కూడా తాగలేరని అంకిత, శ్రుతి నందుకి చెప్తారు. లాస్య ఆంటీ పెట్టిన రూల్స్ వల్ల పాలు లేకుండా డికాషన్ తాగాల్సి వచ్చింది, ఆ పాపాన్ని నేనే చేశాను అని శ్రుతి చెప్తుంది.


దివ్య: సొంత ఇంట్లోనే జైల్లో బతుకుతున్నట్టు బతుకుతున్నాం


అంకిత: తాతయ్యకి షుగర్ డౌన్ అయి చక్కెర కావాలన్నా తాళాలు ఇవ్వలేదు


తులసి: అంతకన్నా విషాదం ఏంటంటే అని చెప్పకుండానే చెప్పాలంటే సంస్కారం అడ్డు వస్తుంది. తప్పు మీవైపు పెట్టుకుని లాస్యని చూస్తే ఏం ప్రయోజనం


నందు: ఎవరి దగ్గర నుంచి ఏం కంప్లైంట్ రాకపోయేసరికి అంతా బాగుంది అనుకున్నా


ప్రేమ్: మిమ్మల్ని బాధపెట్టకూడదని తాతయ్య మాట తీసుకున్నారు


Also Read: 'ఐ లవ్యూ శ్రీవారు' అని ప్రేమలేఖ రాసిన వేద- యష్ తనని భార్యగా అంగీకరిస్తాడా?


తులసి: అది మీ మీద వాళ్ళకి ఉన్న ప్రేమ. ఈ విషయం కూడా వాళ్ళు ఎవరూ చెప్పలేదు నేనే తెలుసుకున్నా. అందుకే ఈ సరుకులు తీసుకొచ్చా. ఇవి ర్యాక్ లో పెడితే ఊరుకోను. ఇంటి పెద్దగా మీరు మీ బాధ్యతలు తెలుసుకునే వరకు మీ చేతకానితనం గుర్తు చేస్తూనే ఉంటాను. నా వాళ్ళని కష్టపెడితే చూస్తూ ఊరుకోను. ఈరోజు నుంచి ఈ ఇంట్లో నావాళ్లేవారు బాధపడతానికి వీల్లేదు అని శ్రుతి కి మామిడి కాయలు ఇస్తుంది.


నందు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వెనుకాలే లాస్య వెళ్తుంది. తను చెప్పేది వినమని లాస్య అంటుంది.


నందు: ఏంటి వినేది అందరి ముందు నన్ను చేతకాని వాడిలా చూశావ్. చివరకి తులసి ముందు కూడా చేతులు కట్టుకున్నా, నా వాళ్ళని కాపాడుకుంటా అని మాట ఇచ్చాను. కానీ నువ్వు నా వెనుకే గోతులు తవ్వావు. రోజుకి రెండు సార్లు కాఫీ టీ తాగాలని రూల్స్ పెట్టావా లేదా. మానాన్నకి అమ్మకి తిండి లేకుండా చెయ్యడానికి నీకు ఎన్ని గుండెలు


లాస్య: నేను ఇవన్నీ ఎందుకు చేశానో చెప్పుకునే అవకాశం ఇవ్వు


నందు: నిన్ను గదిలో పెట్టి వారం రోజుల పాటు తిండి పెట్టకుండా ఉంచేస్తాను, నువ్వు మారావు అనుకుని భ్రమపడ్డా. నా ఇంట్లో తులసి సరుకులు తెచ్చి ఇస్తుంది. చేతకాని వాడిని అని అన్నది, ఇంట్లో వాళ్ళ ముందు మొహం ఎలా చూపించాలి


లాస్య: మనకి సంపాదన లేదు పిల్లల సంపాదన మీద బతుకుతున్నాం, ఎక్కువ ఖర్చు పెడితే ఇబ్బంది పడతాం అని ఇలా చేశాను మన ఫ్యామిలీ కోసమే ఇలా చేశాను. అనుకున్నదే జరిగింది అందరూ కలిసి నామీద దాడి చేశారు. చివరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఉండేసరికి బాధగా ఉందని మొసలి కన్నీళ్ళు పెడుతుంది. మనం అప్పుల పాలు కాకూడదని ఇలా చేశాను


Also Read: బెనర్జీతో చేతులు కలిపిన లాస్య- కళ్ళు తిరిగి పడిపోయిన తులసి, పరిస్థితి విషమం


తులసి పరంధామయ్య వాళ్ళకి కూడా క్లాస్ పీకుతుంది. మా కష్టాలు చెప్పి వాడికి చెప్పి వాడి కాపురంలో నిప్పులు పోయడం ఎందుకు బాధపెట్టడం అని సైలెంట్ గా ఉన్నామని అనసూయ అంటుంది. గుడిలో ప్రసాదం తిని కడుపు నింపుకుందామని చూస్తారా? మిమ్మల్ని అలా చూసి నా గుండె తరుక్కుపోయిందని అంటుంది. తులసికి సామ్రాట్ ఫోన్ చేసి బెనర్జీ ప్రాజెక్ట్ లాస్య, నందు టేకప్ చేయబోతున్నారని చెప్తాడు. వాళ్ళు అలా చేస్తే తన కుటుంబం రోడ్డున పడిపోతుందని తులసి టెన్షన్ పడుతుంది. నందుకి లాస్య బెనర్జీ ఆఫర్ గురించి చెప్తుంది. ప్రాజెక్ట్ టేకప్ చెయ్యడానికి నందుని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే తులసి ఇంటికి వస్తుంది.