తనకి బోర్ కొడుతుందని బయటకి వెళ్దామని లాస్య నందుని అడుగుతుంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కేఫేలు విజిత్ చేయడానికి తులసితో కలిసి బయటకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకుని వస్తాడు. అవన్నీ తనకోసమే అని లాస్య అనుకుంటుంది కానీ నందు మాత్రం కాదని ఇంట్లో వాళ్లకని చెప్తాడు. దీంతో లాస్య మొహం మాడిపోతుంది. అందరితో పాటు తులసికి కూడా చీర ఇస్తాడు. పాతికేళ్ళ కాపురంలో ఒక్క చీర కూడా తనకి తాను కొనివ్వలేదు ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత కొనిస్తున్నాడని తులసి మనసులో అనుకుంటుంది. లాస్యకి తీసుకురాలేదా అని పరంధామయ్య అడుగుతాడు. తనకి నేను సెలెక్ట్ చేసినవి నచ్చవు అందుకే డబ్బులు ఇస్తున్నా అనడంతో లాస్య మొహం వెలిగిపోతుంది.


కేఫ్ బిజినెస్ బాగా జరుగుతుందని సిటీలో మరొక రెండు బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నట్టు తులసి చెప్తుంది. ఆ మాటకి అందరూ సంతోషిస్తారు. ప్రాఫిట్ గా వచ్చిన డబ్బు ఏం చేయాలో మీరే చెప్పండని నందు అడగ్గా లాస్య నెక్లెస్ కావాలని అడుగుతుంది. తులసి మాత్రం బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన కారు విడిపించుకుని తెచ్చుకోమని చెప్తుంది. తులసి మాటకి నందు సరే అంటాడు. నందుని కలవడానికి తన ఫ్రెండ్ వస్తాడు. ఇద్దరూ కాఫీ తాగుతూ ఉంటే కాఫీ బాగుందని తన ఫ్రెండ్ చెప్తాడు. తన వాళ్ళందరూ తన సక్సెస్ అవడానికి కారణం కుటుంబమని చెప్తాడు. కాఫీ మేకర్ తన మాజీ భార్య తులసి అని అంటాడు. జాబ్ దొరకదేమో అని నిరాశలో కూరుకుపోయా కానీ తను నా ఆశలకి ప్రాణం పోసిందని తులసి గురించి గొప్పగా చెప్తాడు.


Also Read: స్వప్నకి డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన రాహుల్- రాజ్ జీవితం నాశనం చేసేందుకు రుద్రాణి కుట్ర


మాజీ భార్య మామూలుగా అయితే పగ తీర్చుకోవాలని చూస్తుంది కానీ నీ విషయంలో అలా జరగలేదని తన ఫ్రెండ్ అంటాడు. అదృష్టవంతుడువి కాబట్టే పాతికేళ్ళ క్రితం తులసిలాంటి మంచి భార్య దొరికిందని అతను అంటాడు. కాదు దూరదృష్టవంతుడిని అందుకే పాతికేళ్ళలో తులసి విలువ తెలుసుకోలేకపోయాను అందుకు పెద్ద శిక్షే వేసింది, దగ్గరుండి లాస్యకిచ్చి పెళ్లి చేసిందని నందు అనేస్తాడు. తులసి నాకు అండగా నిలబడింది అందుకు తనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.. తనకి ఈ నెక్లెస్ తీసుకున్నా అని చూపిస్తాడు. మీ పాతికేళ్ళ కాపురంలో ఇలాంటివి ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని, తులసిని ఎప్పుడు హర్ట్ చేయొద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు.


తులసి కేఫ్ ని స్పెషల్ గా డెకరేట్ చేయమని ఎవరికో ఫోన్లో చెప్తుంది. వాలంటైన్స్ డే వస్తుంది అందుకే అందంగా రెడీ చేయాలని చెప్తారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా నందు వచ్చి అన్నీ వినేశానని అంటాడు. కేఫ్ విషయంలో నీకు ఫ్రీ హ్యాండ్ ఉందని ఏదైనా చేయొచ్చని నందు అంటాడు. కానీ లాస్య మాత్రం పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంది. ప్రేమ్ మాత్రం కేఫ్ క్రెడిట్ అంత అమ్మదేనని అంటాడు. ప్రతిదానికి అడ్డుపడటం తప్ప ఏంటి నీ గొప్ప అని ప్రేమ్ నిలదీస్తాడు. ఆటలో అరటిపండు చేద్దామని అనుకుంటున్నారని లాస్య నందుకి ఎక్కించేందుకు చూస్తుంది. కానీ నందు మాత్రం ప్రేమ్ చెప్పినట్టు కేఫ్ అంటే తులసి.. మనలో ఎవరు ఏం చేయాలన్నా తులసికి చెప్పి చేయాలి తన పర్మిషన్ కావాలి తను ఏం చేయాలన్న తన ఇష్టం ఎవరికీ చెప్పాల్సిన పని లేదని నందు తెగేసి చెప్పేసరికి లాస్య బిత్తరపోతుంది. 


Also Read: పొగరుని ఊసరవెల్లి అనేసిన రిషి- జగతి మీద కస్సుబుస్సులాడిన వసు!


నందుకి నెక్లెస్ ప్రజెంట్ చేయాలని అనుకుంటాడు. కానీ అందరి ముందు ఇస్తే లాస్య గొడవ చేస్తుందని ఒంటరిగా ఉన్నప్పుడు ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. అభి తన అత్త గాయత్రితో ఫోన్లో మాట్లాడటం తులసి వింటుంది. నీ డబ్బుతో అమెరికా తీసుకెళ్తున్నావని అంకితకి అబద్ధం చెప్పావ్ అని నిలదిస్తుంది. మీ అత్త నీకు భిక్షగా వేస్తుంది సంతలో గేదెలాగా కొంటుందని తిడుతుంది.