నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.


దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగానూ యూజీ కోర్సుల్లో చేరొచ్చు. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం అడ్మిషన్ల కోసం సీయూఈటీ స్కోరును ఆధారంగా చేసుకోవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తెలిపింది. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపిం మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.


పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఈ పరీక్ష ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇగ్నో, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వంటి మరెన్నో ప్రముఖ విద్యాసంస్థల్లో సీటు సంపాదించవచ్చు. మేలో ప్రవేశ పరీక్ష జరుగనుంది.


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు ఈ ఏడాది మే 21 నుంచి మే 31 వరకు జరగనున్నాయి. జూన్ మూడో వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. గతేడాది మాదిరిగానే 13 భాషల్లో సీయూఈటీ యూజీ 2023 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.


వివరాలు..


* కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2023


అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఫీజు:  జనరల్- మూడు సబ్జెక్టులకు రూ.750; ఏడు సబ్జెక్టులకు రూ.1500; పది సబ్జెక్టులకు రూ.1750, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్- మూడు సబ్జెక్టులకు రూ.700; ఏడు సబ్జెక్టులకు రూ.1400; పది సబ్జెక్టులకు రూ.1600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్ జెండర్ మూడు సబ్జెక్టులకు రూ.650; ఏడు సబ్జెక్టులకు రూ.1300; పది సబ్జెక్టులకు రూ.1550.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


పరీక్ష మాధ్యమం: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు ఈ ఏడాది మే 21 నుంచి మే 31 వరకు జరగనున్నాయి. జూన్ మూడో వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. గతేడాది మాదిరిగానే 13 భాషల్లో సీయూఈటీ యూజీ 2023 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.


పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లో 45 లేదా50 ప్రశ్నలకు గానూ 35 లేదా 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.


* 1000 పరీక్షా కేంద్రాలు
ఈ ఏడాది మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్యను 1000కి పెంచారు. ఫలితంగా పరీక్షలు సాఫీగా సాగేందుకు ఆస్కారముంటుంది. గతేడాది ప్రతి సబ్జెక్టుకు 450 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు సీయూఈటీ యూజీ 2022 పరీక్షను నిర్వహించారు. మొత్తంగా 14.9లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.


ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లి, విజయనగరం, తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం.


తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.


* సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు
సీయూఈటీ యూజీ 2023 పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ప్రముఖ కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.


ముఖ్యమైన తేదీలు


➸ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.02.2023.


➸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.03.2023 (రాత్రి 09:00 వరకు)


➸ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 12.03.2023 (రాత్రి 11:50 వరకు)


➸ అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్: 15.03. 2023 - 18.03.2023 (రాత్రి 11:50 వరకు)


➸ పరీక్ష కేంద్రాల ప్రకటన: 30.04.2023.


➸ అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్: మే రెండో వారం, 2023.


➸ పరీక్ష ప్రారంభతేదీ: మే 21 నుండి మే 31, 2023 వరకు


➸ ఫలితాల ప్రకటన: తర్వాత ప్రకటిస్తారు.


Public Notice


Notification 


Online Application


Website


Also Read:


బిట్‌శాట్‌- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2  పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ ప్రకటన, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..