శ్రుతి కడుపుతో ఉన్నందుకు తులసి ఇంట్లో అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పాటలు పెట్టుకుని డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా శ్రుతి కాలు జారి కిందపడిపోతుంది. అటు నందుకి లాస్య బాగా ఎక్కించి తులసి ఇంటికి వెళ్తుంటారు. శ్రుతి పొట్ట పట్టుకుని నొప్పి అని అల్లాడిపోతూ ఉంటుంది. వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళిపోతారు. లాస్య తులసి ఇంట్లోకి వెళ్తు పిల్లల్ని ఏమి అనకు అంతా తులసిదే తప్పు అని ఎక్కిస్తుంది. ఇంట్లోకి వచ్చిన నందు ఆవేశంగా తులసిని పిలుస్తాడు. ఇప్పటి దాకా పార్టీ చేసుకుని లంచ్ కోసం లొకేషన్ మార్చి ఉంటారని మరింత నూరిపోస్తుంది. శ్రుతిని డాక్టర్లు పరిశీలిస్తారు. తులసితో సహా అందరూ బాధపడుతూ ఉంటారు.


పొద్దున్నే హారతి ఇచ్చేటప్పుడు హారతి పళ్ళెం కిందపడింది అప్పుడే అపశకునం అనిపించింది కానీ శ్రుతి ఫోన్ చేసి ప్రెగ్నెంట్ విషయం చెప్పింది. ఇప్పుడు ఇలా జరిగింది. నేను దురదృష్టజాతకురాలిని ఎందుకు నా దగ్గరకి తీసుకొచ్చావ్ అని తులసి తనని తాను నిందించుకుంటుంది. నువ్వు దోషివి కాదు అలా ఆలోచించకు అని ప్రేమ్, అభి ధైర్యం చెప్పేందుకు చూస్తారు. నందు తులసికి ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చెయ్యదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి, అభికి ఫోన్ చెయ్యి మనకి విషయం చెప్తాడని లాస్య అంటుంది. నందు అభికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. అభి విషయం మొత్తం చెప్పడంతో నందు కోపంగా హాస్పిటల్ కి బయల్దేరతాడు.


శ్రుతి పరిస్థితి గురించి నందుకి చెప్పినట్టు అభి తులసి వాళ్ళతో చెప్తాడు. ఎందుకు చెప్పావ్ లాస్య ఆంటీ ఇక్కడికి కూడా వచ్చి గొడవపెడుతుంది కదా అని దివ్య అంటుంది. అక్కడి నుంచి తులసి వెళ్లబోతుంటే నందు ఎదురుపడి నోటికి వచ్చినట్టు తిడతాడు.


నందు: నేను నా వాళ్ళు మాత్రమే పండగ చేసుకోవాల్సిన విషయం. ఇది మా ఫ్యామిలీ విషయం నువ్వు ఎందుకు జోక్యం చేసుకున్నావ్. నా వారసుడి వేడుక నా ఇంట్లో జరగాలి. నా వాళ్ళందరిని నీ ఇంటికి పిలిపించుకుని ఇదంతా చేశావ్ అసలు నిన్ను వదిలిపెట్టను అని తులసి మీదకి వెళ్లబోతుంటే సామ్రాట్ అడ్డుపడతాడు. పక్కకి తప్పుకో అని నందు ఎంత చెప్పినా కూడా సామ్రాట్ వినడు.


Also Read: షాకిచ్చిన భ్రమరాంబిక, బిక్కమొహం వేసిన అభిమన్యు- ప్రేమపక్షుల విహారయాత్ర అధ్బుతం


సామ్రాట్: ఇది హాస్పిటల్ పబ్లిక్ ప్లేస్


నందు: నువ్వు ఎవడ్రా నన్ను ఆపడానికి


సామ్రాట్: నోరు అదుపులో పెట్టుకో, ఏ హక్కుతో మీదకి వస్తున్నావ్ 


నందు: తను నా మాజీ భార్య


సామ్రాట్: మాజీ భార్య, నీ ఫ్యామిలీని డిస్ట్రబ్ చేసి రోడ్డు మీదకి లాగుతుంది నీ భార్య తనకి చెప్పుకో నోరు లేని తులసి మీద కాదు


లాస్య: నోరు లేనిది తులసికా.. శ్రుతి విషయంలో తులసి తప్పు చేసింది నిలదీసే హక్కు నందుకి ఉంది. సమాధానం చెప్పాల్సిన అవసరం తులసికి ఉంది. నీ హీరోయిజం ఇక్కడ కాదు మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు చూపించుకో


ప్రేమ్: సామ్రాట్ తో అలాగేనా మాట్లాడేది ముందు మర్యాద నేర్చుకో


నందు: ఏ అధికారంతో తులసికి అండగా ఉంటున్నాడో అది అడుగు మా మీద అరవడం కాదు


తులసి: ఇది వాదించుకునే సమయం కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం


Also Read: తులసి కోసం చెయ్యి కాల్చుకున్న సామ్రాట్- శ్రుతి కడుపు పోతుందా?


అయినా కూడా నందు మాత్రం తులసినే నిందిస్తాడు. శ్రుతికి ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం అని అరుస్తాడు. తను కారణం కాదని అరుస్తుంది. తనకి తెలియకుండా పిల్లల్ని ఇంటికి పిలిపించుకుని పార్టీ చేస్తావ్, వాళ్ళకి నచ్చజెప్పి ఇంటికి పంపించొచ్చు కదా అని అరుస్తాడు. నచ్చజెప్పింది కానీ మేమే వినలేదని ప్రేమ్ అంటాడు.