తన సొంత ఊరుకి వెళ్లాలని చీటీ రాయడం చదివిన సామ్రాట్ దాన్ని తీర్చాలని అనుకుంటాడు. ఆఫీసు పని ఉందని ఒక గ్రామానికి వెళ్లాలని చెప్పి కారులో తీసుకెళ్తాడు. తులసి పుట్టిన ఊరు గుర్తు పట్టకపోవడంతో ఖచ్చితంగా ఊరి పేరు బోర్డు దగ్గర కారు చెడిపోయి ఆగిపోయినట్టు డ్రామా ఆడతాడు. తులసి కారు దిగి ఆ ఊరి పేరు రామచంద్రపురం అని చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది. అది చూసి సామ్రాట్ మురిసిపోతాడు. అక్కడ చిన్న పిల్లలా మారి తులసి బాగా ఎంజాయ్ చేస్తుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తు ఒక ఇంటిని చూసి ఎమోషనల్ అవుతుంది. అది తన పుట్టిన ఇల్లని సామ్రాట్ చెప్తుంది. ఆ ఇంటికి సీల్ వేసి ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. ‘ఇల్లు లిటిగేషన్ లో ఉంది, కోర్టు కేసు నడుస్తుంది, తమ్ముడు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అందుకే ఈ ఊరికి రావడం మానేశాం. చిన్న నాటి జ్ఞాపకాలు కొన్ని సంతోషం తెప్పిస్తే మరికొన్ని కన్నీళ్ళు మిగులుస్తాయి. నా చిన్న నాటి వస్తువులు ఈ ఇంట్లో ఉన్నాయ్, వాటిని చూసుకోవాలని ఉంది కానీ కోర్టు కేసు వల్ల ఇంట్లో అడుగుపెట్టకూడదు’ అని తులసి చెప్తుంది. అంతే ఇక మన హీరో గారు వెంటనే పక్కనే ఉన్న రాయి తీసుకుని దాన్ని పగలగొట్టేస్తాడు.


Also Read: వేదని మాటలకి మురిసిపోతున్న యష్- అభిమన్యు అక్క ఎంట్రీ, మాళవికకి ఇక చుక్కలే


తులసి టెన్షన్ పడుతూ ఉంటే సామ్రాట్ మాత్రం ఏం కాదు అన్ని తనే చూసుకుంటానని చెప్తాడు. ఇంట్లోకి వెళ్ళి చిన్ననాటి వస్తువులు తీసుకోమని అంటాడు. అంకిత బయటకి వచ్చి కింద కూర్చున్న ఆ పేద దంపతులని చూస్తుంది. వెంటనే సోఫాలో కూర్చోబెట్టి వైద్యం చేస్తుంది. ట్యాబ్లెట్స్ ఇచ్చి మూడు రోజుల తర్వాత రమ్మని చెప్తుంది. ఎప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు తీసుకున్నారు కదా ఎంత అయిందో చెప్తే పాతది కూడా తీర్చేస్తామని అతని భార్య అంకితని అడుగుతుంది. డబ్బులు ఎప్పుడు తీసుకున్నా నేను అడగలేదు కదా అని అంకిత అనుమానంగా అడుగుతుంది. నల్ల చీర కట్టుకున్న ఒకావిడ డబ్బులు తీసుకున్న తర్వాత ఇంట్లోకి రానిచ్చిందని ఆమె చెప్పడంతో లాస్యనే అని అంకిత అర్థం చేసుకుంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మీలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకొనని చెప్పి అంకిత వాళ్ళకి డబ్బులు ఇస్తుంది.


Also read: చెట్టెక్కి మామిడి కాయలు కోసిన తులసి- లాస్య కక్కుర్తి


ఇంకెప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వొద్దని చెప్తుంది. తులసి ఇంటి గుమ్మం ముందు ఉన్న తులసి కోట శుభ్రం చేస్తుంది. చిన్నప్పుడు ఇంట్లో అలా చేశాం, ఇలా చేశాం అని తులసి తన జ్ఞాపకాలు అన్ని చెప్తుంది. వాటికి తందాన కొడుతూ సామ్రాట్ ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఇంట్లోకి వెళ్ళడానికి అక్కడ కూడా హీరో గారు తాళం పగలగొట్టేస్తారు.