యష్, వేదని ఒక్కటి చేసేందుకు అందరూ కలిసి వాళ్ళని అగ్రహారం పంపించేందుకు ఒప్పిస్తారు. ఈ టూర్ ని ఏమని అంటారు ప్రేమ యాత్ర అనా అనుకుని వేద తెగ సిగ్గుపడిపోతుంది. అటు యష్ కూడా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ కోసం సులోచన, మాలిని అన్నీ రెడీ చేసి తెగ హడావుడి చేస్తారు. వేద, యష్ ఇద్దరు బ్యాగ్ లు పట్టుకుని బయటకి వస్తారు. ఆఫీసు గొడవలు పక్కన పెట్టి ఎంజాయ్ చెయ్యమని మాలిని చెప్తుంది. పాత గొడవలు మర్చిపోయి కొత్తగా లైఫ్ మొదలుపెట్టమని సులోచన వేదకి జాగ్రత్తలు చెప్తుంది. మనసులో నుంచి అన్నీ తీసేసి హాయిగా గడపమని అంటారు. ఖుషి వచ్చి లేట్ అవుతుంది మీరు బయల్దేరమని అంటుంది. అదేంటి నువ్వు రావడం లేదా అని వేద అడుగుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేనని ఖుషి చెప్తుంది.
రెండు కుటుంబాలు సంతోషంగా వాళ్ళని వెకేషన్ కి పంపిస్తారు. అభిమన్యు హడావుడిగా ఇంట్లో అందరికీ పనులు చెప్పి చేయిస్తూ ఉంటాడు. ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారా అని ఖైలాష్, మాళవిక అడుగుతారు. అవును లేడి లయన్ మిసెస్ భ్రమరాంబిక దేవి వస్తుందని చెప్తాడు. మా అక్క యూఎస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది.
మాళవిక: మీ అక్కకి మన విషయం తెలియదు కదా తెలిస్తే ఎలా ఒప్పుకుంటుందా
అభి: నువ్వే ఒప్పించాలి, నిన్ను చూసి మా అమ్మ ఇంప్రెస్ అయిపోవాలి. మన పెళ్ళికి మనకంటే అక్కే తొందరపడాలి
మాళవిక: వచ్చేది మీ అక్క కాదు నా ఆడపడుచు, మా ఇద్దరి అనుబంధం చూసి ఆశ్చర్యపోయేలా చేస్తా
అభి: మన పెళ్ళికి నువ్వే మా అక్కని ఒప్పిస్తావ్, నీ మీద నాకు నమ్మకం ఉంది బంగారం
సరే రెడీ అయిపోతానని మాళవిక అంటుంది. ఖైలాష్ తన పరిస్థితి ఏంటని అడుగుతాడు. తన అక్కవి స్కానింగ్ కళ్ళు అని చూడగానే మనిషి ఎలాంటి వాడో చెప్పేస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఊరికి వెళ్తునందుకు వేద చాలా హ్యపీగా ఉంటుంది. తనతో కలిసి ఊరికి వెళ్తునందుకు హ్యపీగా ఫీల్ అవుతున్నావా అని యష్ అడుగుతాడు. వేద కావాలని మీతో వస్తున్నందుకు కాదని చెప్పేసరికి యష్ బుంగమూతి పెడతాడు. ఇద్దరు అలుగుతారు. మళ్ళీ కాసేపటికే సరదాగా మాట్లాడుకుంటారు. వేద కారులో చాలా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఊరు గురించి చాలా సంతోషంగా చెప్తుంది. వేద చిన్నప్పుడు చేసిన చిలిపి అల్లరి గురించి చెప్పి ఆనందంగా ఉంటుంది.
వేద మాట్లాడుతూ ఉంటుంటే తనని తాను మైమరిపోయి చూస్తూ ఉంటాడు. కారు ఆపి మరీ వేదని చూస్తూ ఉంటాడు. నువ్వు గలగలా కబుర్లు చెప్తుంటే వినాలని అనిపిస్తుంది, చూసే కొద్ది చూడాలని అనిపిస్తుందని యష్ మనసులో అనుకుంటాడు. ఏంటి తన వైపు కొత్తగా చూస్తున్నాడని వేద అనుకుంటుంది. కన్ను ఆర్పకుండా వేదని చూస్తూనే ఉంటాడు.