తన సొంత ఊరుకి వెళ్లాలని చీటీ రాయడం చదివిన సామ్రాట్ దాన్ని తీర్చాలని అనుకుంటాడు. ఆఫీసు పని ఉందని ఒక గ్రామానికి వెళ్లాలని చెప్పి కారులో తీసుకెళ్తాడు. తులసి పుట్టిన ఊరు గుర్తు పట్టకపోవడంతో ఖచ్చితంగా ఊరి పేరు బోర్డు దగ్గర కారు చెడిపోయి ఆగిపోయినట్టు డ్రామా ఆడతాడు. తులసి కారు దిగి ఆ ఊరి పేరు రామచంద్రపురం అని చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది. అది చూసి సామ్రాట్ మురిసిపోతాడు. మనం సంతోషంగా ఉండటం కంటే ఎదుటి వాళ్ళని సంతోషాపడేలా చేయడంలో చాలా థ్రిల్ ఉందా. అసలు తీరదు అనే ఆశ తిరితే ఇంత సంతోషంగా ఉంటుందా అని మనసులో అనుకుంటాడు.


తులసి పెరిగెత్తుకుంటూ వెళ్ళి సామ్రాట్ కి ఇది తన ఊరని చెప్తాడు. ఏమి తెలియని వాడిలా సామ్రాట్ ఏమైందని అంత పట్టరాని ఆనందం ఎందుకని అడుగుతాడు. అది తన సొంత ఊరని చెప్పేసరికి సామ్రాట్ తెలియనట్టు నిజమా అని డ్రామా మొదలెట్టేస్తాడు. ఎప్పటికైనా చిన్ననాటి ఊరు చూడాలని నా ఆశ, కోరిక అమ్మవారు దయచూపించారని సంతోషంగా చెప్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఇక్కడే ఉండాలని ఉందని తులసి చెప్పేసరికి సామ్రాట్ అలాగే అని అంటాడు. తనకి సేవలు చేస్తూ ఇక్కడే ఉంటామని చెప్తాడు. దగ్గరుండి మీ ఊరంతా చూపించమని సామ్రాట్ అడుగుతాడు. ఇద్దరు కలిసి పూల తోటలోకి వెళ్ళి నడుస్తూ సంతోషంగా ఉంటారు.


Also read: 'ప్రేమయాత్ర'కి బయల్దేరిన వేద, యష్- ఫుల్ ఖుషీగా రెండు కుటుంబాలు


ఇద్దరు పేషెంట్స్ అంకిత కోసం ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి లాస్య హేళనగా మాట్లాడుతుంది. డాక్టర్ ని పిలవమని లాస్యని బతిమలాడుతారు. అయితే రూ.500 ఇవ్వండి అప్పుడు పిలుస్తానని నీచంగా మాట్లాడుతుంది. దీంతో వాళ్ళు చేసేది లేక తమ దగ్గర ఉన్న చిల్లర అంతా పోగుచేసి ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకుని లాస్య వాళ్ళని లోపలికి వచ్చి కూర్చోమని అంటుంది. లోపలికి వచ్చిన వాళ్ళని కింద కూర్చోమని చెప్పి చీదరించుకుని వెళ్తుంది. తులసి చిన్న పిల్ల అయిపోతుంది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు చెట్టెక్కి మామిడి కాయలు కోసి అక్కడి నుంచి పారిపోయిన సంగతి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటుంది.


పల్లెటూరి అందం ఎక్కడ ఉండదని అంటుంది. డబ్బులో పుట్టి పెరిగాను, అదే జీవితం సంతోషం అనుకున్నా. అసలైన సంతోషం ఇలాంటి పల్లెటూరిలో ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా అని సామ్రాట్ అంటాడు. అందుకే ఎప్పటికీ ఇక్కడికే వచ్చి ఉండిపోవాలని అనుకుంటున్నా, ఈ ఆశ కూడా అమ్మవారు నిజం చేస్తారని తులసి అనుకుంటుంది. తులసి ఇల్లు కోర్టు కేసులో ఉంది కదా ఇక దాన్ని కూడా సామ్రాట్ ఇచ్చేస్తాడన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక ముసలాయన మీరు ఎవరు అని అడుగుతాడు. మామిడికాయలు దొంగతనం చేసిన తులసిని పట్టిద్దామని తీసుకొచ్చా వీరయ్య అంటే ఎవరని సామ్రాట్ అడుగుతాడు. నేనే వీరయ్యని అని ముసలాయన అనేసరికి తులసి తెగ సంబరపడిపోతూ మాట్లాడుతుంది. చిన్నప్పుడు దొంగతనం చేసిన మామిడికాయలకి తులసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది.


Also Read: రామా, జానకికి షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్- జెస్సీకి సీమంతం, సంతోషంలో జ్ఞానంబ







తరువాయి భాగంలో..






తులసి వాళ్ళ కారుకి ముగ్గురు ఆడవాళ్ళు అడ్డుగా ఉంటారు. వాళ్ళు తులసి ఫ్రెండ్స్ అంట. సామ్రాట్, తులసిని చూసి లవ్ మ్యారేజ్ కదా ఈడు జోడు సూపర్ ఉన్నారు, సినిమా హీరోలా ఉన్నాడని తెగ పొగిడేస్తారు.