దివ్య వాళ్ళు పెళ్లి షాపింగ్ కి వెళతారు. అక్కడికి విక్రమ్ కూడా వచ్చి పక్కకి రా ప్లీజ్ అని పిలుస్తూ సైగలు చేస్తాడు. దివ్య ఒక డ్రెస్ తీసుకుని ట్రయల్ చేస్తానని వంకతో ట్రయల్ రూమ్ కి వెళ్తుంటే తులసి వచ్చి చీర చూపిస్తాను రా భలే ఉందని వెనక్కి తీసుకెళ్తుంది. ట్రయల్ రూమ్ లో విక్రమ్ దివ్య వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి డ్రెస్ చూస్తూ అక్కడ ఉంటుంది. విక్రమ్ ఉన్న ట్రయల్ రూమ్ లోకి బండ అమ్మాయి వెళ్తుంటే వచ్చింది దివ్య అనుకుని వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు అబ్బాయిలు ఎవరూ నన్ను చూడలేదు ఇప్పటికైనా ఒక్కడు దొరికాడని ఆ అమ్మాయి తెగ సంబరపడిపోతుంది. కాసేపటికి హగ్ చేసుకున్న అమ్మాయి దివ్య కాదనుకుని పారిపోతుంటే ఆ అమ్మాయి విక్రమ్ కాలు పట్టుకుని వదలకుండా ఉంటుంది. అది చూసి దివ్య పగలబడి నవ్వుతుంది. చివరకి ఎలాగో తన దగ్గర నుంచి తప్పించుకుని విక్రమ్ పారిపోతాడు. ఆ అమ్మాయి విక్రమ్ కోసం ప్రియా ఓ ప్రియా అనుకుంటూ తిరుగుతుంది.
Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర
తులసి ఫ్యామిలీ మొత్తం చీరలు చూస్తూ ఉంటారు. అక్కడ విక్రమ్ ఉండటం నందు గమనించి మిగతా వాళ్ళకి కూడా చెప్తాడు. రెండు చీరలు పట్టుకుని ఏ చీర నచ్చిందంటే అని విక్రమ్ కి సైగ చేయడం గమనించి ఫుల్ గా ఆట పట్టిస్తారు. మళ్ళీ దివ్యని పక్కకి పిలుస్తాడు. దివ్య డ్రెస్ ట్రయల్ అని చెప్పి రూమ్ లోకి వెళ్ళగానే వెనుకాలే విక్రమ్ కూడా దూరిపోతాడు. అది నందు ఫ్యామిలీ మొత్తం చూసేస్తుంది. అందరూ వెల్లి ట్రయల్ రూమ్ బయట చెవులు పెట్టి వింటారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం వింటూ ఉంటారు. ఇందాక నిన్ను పిలుద్దామని పువ్వు విసిరితే మీ తాతయ్య, నానమ్మ భలే సరదాగా ఉన్నారు రొమాంటిక్ జంట అని మెచ్చుకుంటాడు. ఉండు వాళ్ళని ఆట పట్టిస్తానని అనసూయ పిల్లిలాగా అరుస్తుంది. భయపడిపోయిన దివ్య వెళ్లిపోదామని అంటే అయితే ముద్దు పెట్టు వెళ్లిపోదామని అంటాడు. ఇద్దరి మధ్య కాసేపు రొమాన్స్ జరుగుతుంది.
Also Read: పెళ్ళైన తర్వాత తొలిసారి పుట్టింటికి వెళ్ళిన కావ్య- అపర్ణని రెచ్చగొట్టి పైశాచికానందం పొందిన రుద్రాణి
మళ్ళీ పిల్లి అరుపు వినేసరికి దివ్య పరుగున బయటకి వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళని చూసి దివ్య సిగ్గు పడుతుంది. బాబు మీరు ఇక తమరు బయటకి రావచ్చని అనేసరికి విక్రమ్ కూడా సిగ్గు పడుతూ వస్తాడు. లైఫ్ అన్నాక థ్రిల్ ఉండాలని నందు అంటాడు. పెళ్లై వరకు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండటమే అందరికీ మంచిదని తులసి ఖరాఖండీగా చెప్తుంది. అంతగా చెప్పినా కూడా దివ్య, విక్రమ్ మళ్ళీ చేతులు పట్టుకుని ఉంటే ఆట పట్టిస్తారు. పెళ్లి బట్టల షాపింగ్ బిల్లు నందు కడతాడు. మళ్ళీ సిల్క్ సుందరం ఎంట్రీ ఇస్తాడు. పిచ్చి పట్టిన వాడిలా చొక్కా విప్పేసి తిక్క తిక్కగా మాట్లాడతాడు. దివ్యకి ఎలాంటి భర్త దొరుకుతాడో అని భయంగా ఉండేది విక్రమ్ ను చూస్తే ఆ భయం పోయింది అత్తారింట్లో అది సంతోషంగా ఉంటుందని నమ్మకం కుదురిందని తులసి అంటుంది.
రాజ్యలక్ష్మి తులసికి ఫోన్ చేసి ఒక విషయంలో మీ పద్ధతి నచ్చలేదని చెప్తుంది. తనని రాజ్యలక్ష్మి గారు అనడం నచ్చలేదని అంటుంది. దివ్య ఇక నుంచి నా కూతురితో సమానం, మేం తనని నెత్తిన పెట్టుకుని చూస్తామని అబద్ధాలు చెప్తుంది. రాజ్యలక్ష్మి ఫోన్ లో మాట్లాడుతుంటే పక్కనే ప్రియ తన కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. తులసిని నమ్మించేలా మాట్లాడుతుంది. దివ్య తనలాగే ముక్కుసూటితనం వచ్చిందని తులసి అంటుంది.