కావ్య బొమ్మకి రంగు వేసుకుంటుంటే రాజ్ వచ్చి తనని నానామాటలు అంటాడు. కళ్ళలో ఎర్ర రంగు వేసుకున్నావా అంత ఎర్రగా మారాయని అంటాడు. మీ అక్కని ఎక్కడ దాచి పెట్టావని ప్రశ్నిస్తాడు. మా అక్కని నేనే అక్కడ నుంచి తప్పించాను కానీ ఎక్కడ ఉంచానో చెప్పనని కావ్య ఎదురు సమాధానం చెప్తుంది. మీరు అనుమానంతో అవమానంతో నన్ను అందరి ముందు కింద పడేశారు నా జోలికి రావొద్దని కావ్య దణ్ణం పెడుతుంది. స్వప్నని ఎలాగైనా పట్టుకుని తీరతానని రాజ్ చెప్తాడు. శుభాష్ సంతోషంగా స్వీట్స్ పట్టుకుని ఇంటికి వచ్చి అందరినీ పిలుస్తాడు. స్వరాజ్ గ్రూప్ కి పెద్ద కాంట్రాక్ట్ వచ్చేలా చేశావ్ ఈ సక్సెస్ నీదేనని తండ్రి రాజ్ ని మెచ్చుకుంటాడు. అందరూ రాజ్ కి స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తారు. కావ్య మాత్రం పక్కన నిలబడి ఉంటుంది. నీ భార్యకి కూడా స్వీట్ తినిపించు. ఇదంతా కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెట్టిన వేళా విశేషమని ఇంద్రాదేవి, సీతారామయ్య అంటారు.


Also Read: కనురెప్పల కాలంలోనే కథ అంతా మారిపోయిందే- ఖుషిని దూరం చేసేందుకు అభిమన్యు కుట్ర


అపర్ణ మాత్రం కావ్యని దెప్పి పొడుస్తూనే ఉంటుంది. స్వప్నతో హడావుడిగా నిశ్చితార్థం చేసుకుని వచ్చి ఈ ఇంటికి చెడు జరిగేలా చేశారు. వాళ్ళ అక్క చేసిన తప్పుని ఈ అమ్మాయి సరిదిద్దింది. ప్రతిసారీ కోడలిని విమర్శించడం కరెక్ట్ కాదని శుభాష్ అపర్ణని తిడతాడు. కావ్య కూడా కంగ్రాట్స్ చెప్తుంది. శత్రువు అభినందించినా థాంక్స్ చెప్పడం సంస్కారం కాబట్టి థాంక్స్ అని రాజ్ అంటాడు. నువ్వు అడుగు పెట్టగానే మాకు శుభం జరిగిందని, అది సంతోషాన్ని ఇచ్చింది. నీకు నచ్చింది ఏదైనా ఉంటే చెప్పు చేస్తామని ఇంద్రాదేవి అడుగుతుంది. అటు పుట్టిల్లు, ఇటు అత్తిల్లు ఉన్నా ఒంటరిగా ఉన్నా, అడగమని మీరు అంటున్నారు. ఇవ్వొద్దని వాళ్ళు అంటున్నారు. భర్త నీడ అడగనా, అత్తగారి ఆదరణ అడిగేదా అని బాధపడుతుంది.


ఇంద్రాదేవి: నీ బాధ నాకు అర్థం అయ్యింది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే ఒక నిబంధనతో శాసించారు. కనీసం ఫోన్లో అయినా కావ్య తన పుట్టింట్లో వాళ్ళతో మాట్లాడే అవకాశం కల్పిద్దాం


సీతారామయ్య: ఈ ఇంట్లో ఎవరూ బాధ పడకూడదు నిన్ను పుట్టింటికి వెళ్లకూడదని మీ అత్త పెట్టింది, కానీ మా ఇంటి కోడలు సంతోషంగా ఉండాలి


స్వప్నని తప్పించడం కోసం కావ్య ఇలా ప్లాన్ చేసిందని పుట్టింట్లో తనని దాచిందని రాజ్ మనసులో అనుకుంటాడు.


అపర్ణ: ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి వాలడానికి వీల్లేదు. తను వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడితే మనం ఈ మాత్రం కూడా సంతోషంగా ఉండలేము


రాజ్: ఫోన్లో వద్దు నేరుగా నేనే ఆమెని వాళ్ళ పుట్టింటికి తీసుకుని వెళ్తాను అనేసరికి అపర్ణ షాక్ అవుతుంది. మిగతా వాళ్ళు సంతోషపడతారు. నేనే దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి తీసుకొస్తాను


అపర్ణ: ఆపు రాజ్ మతి పోయిందా నీకు ఏం మాట్లాడుతున్నావ్ ఎవరిని ఎవరింటికి తీసుకెళ్తాను అంటున్నావ్


రాజ్: నానమ్మ, తాతయ్య వరం ఇచ్చేశారు నువ్వు ఎందుకు బ్లెమ్ అవాలి


అపర్ణ: నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. నా కొడుక్కి మతిపోయింది


Also Read: ట్రయల్ రూమ్‌లో విక్రమ్, దివ్య సరసాలు - నందు, తులసిని చూసి రగిలిపోతున్న లాస్య


రుద్రాణి: మతిపోవడం ఏంటి ? మానవత్వం వెల్లివిరిసింది. వాళ్ళకి శోభనం జరిగిపోయింది గది గడి పెట్టి ఆపగలిగావా


శుభాష్: నీ భర్తగా నేను ఒప్పుకుంటాను, కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. భార్యాభర్తలు విడిపోతుంటే చూస్తూ ఉండమంటావా. నీ పంతం కోసం వాళ్ళని దూరంగా ఉండమంటావా


కావ్య: నేను వెళ్ళను అత్తయ్య భయంలో అర్థం ఉంది. నేను వెళ్తే మా వాళ్ళు సంతోషిస్తారు కానీ ఈ తల్లీకొడుకులు మధ్య అభిప్రాయభేదాలు వచ్చేలా ఉన్నాయి. మా ఆయనతో అసలు వెళ్ళను


రాజ్: నేను వస్తానని అనేసరికి ప్లేట్ మార్చావ్ మీ అక్కని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానని ఇలా చేస్తావా అని మనసులో అనుకుంటాడు. నేను మీ మాటకి విలువ ఇచ్చి తీసుకెళ్తానని అంటే నన్ను విలన్ ని చేశారని అంటాడు. ఇంద్రాదేవి కావ్యకి నచ్చజెప్పి వెళ్ళడానికి ఒప్పిస్తుంది. కావ్య వల్ల తన హక్కులు అన్నీ పోయాయని కోడలిగా, తల్లిగా ఒడిపోయానని అపర్ణ బాధపడుతుంది.