నందు ఎవరికీ చెప్పకుండా ఒక చోటకి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఎందుకు ఇలా జరుగుతుంది విధి నాతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది. కూతురు జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఉండిపోయాను. నేను చేసింది తప్పో ఒప్పో అర్థం కానీ అయోమయంలో ఉండిపోయాను. దివ్య నిన్ను ఇంత ప్రేమగా పెంచుకుంది ఆ రాక్షసికి బలి ఇవ్వడానికేనా? ఈ చేతులతో నిన్ను నరకానికి పంపించాను. తాళి కట్టే టైమ్ లో నీ కళ్ళలో కనిపించిన సంతోషం నా నోరు నొక్కేసింది బొమ్మలా చూస్తూ ఉండిపోయాను. కానీ ఇప్పుడు భయం వేస్తుంది దిగులుగా ఉంది. మీ అమ్మకి నా మొహం ఎలా చూపించాలి ఈ నిజం తులసికి తెలిస్తే తను తట్టుకోలేదు. ఈ బాధని నా గుండెల్లోనే దాచుకోవాలని కుమిలి కుమిలి ఏడుస్తాడు.


Also Read: వేద జీవితాన్ని నిలబెట్టిన విన్నీ, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న యష్- మాళవికని వెర్రిదాన్ని చేసిన అభిమన్యు


కొత్త పెళ్ళికూతురు రాజ్యలక్ష్మి ఇంట అడుగుపెడుతుంది. దివ్య ముందు రాజ్యలక్ష్మి మంచిదానిలా నటిస్తుంది. మీ అమ్మ నీ పెళ్ళికి ఒప్పుకోకపోయి ఉంటే ఏం చేసేవాడివని బసవయ్య విక్రమ్ ని అడుగుతాడు. గుమ్మం దగ్గర నుంచే దివ్యని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారని ప్రియ మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్న అవసరమా అని విక్రమ్ అంటాడు. దానికి విక్రమ్ తాతయ్య చురకలేస్తాడు. దీంతో రాజ్యలక్ష్మి నటన మొదలు పెట్టేస్తుంది. విక్రమ్ అంటే నాకు ప్రాణం తను ఏం అడిగినా కాదు అననని నీకు తెలుసు అలాంటిది దివ్యని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు వద్దని అంటానని ప్లేట్ ఫినాయిస్తుంది. ఫ్యామిలీ పరువు కూడా పక్కన పెట్టి ప్రియని కోడలిగా ఒప్పుకోవడం అత్తయ్య పెద్ద మనసని దివ్య అంటుంది. ఒకవేళ మీ అక్కయ్య పెళ్ళికి ఒప్పుకోకపోతే నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడినని విక్రమ్ తాతయ్య చెప్తాడు.


Also Read: మురారీకి నిజం చెప్పిన కృష్ణ - గౌతమ్ పెళ్లి నందినితో జరుగుతుందా?


రాజ్యలక్ష్మి హారతి ఇచ్చి దివ్యని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కొత్త దంపతులు ఒకరిపేరు మరొకరు చెప్పుకోవాలని అంటే దివ్య తన పుట్టింటి పేరే చెప్తుంది. రాజ్యలక్ష్మి పెళ్లి అయితే పుట్టింటి పేరు కాదు అత్తింటి పేరు వస్తుందని అంటుంది. అయిపోయింది కదా దివ్యని ఇబ్బంది పెట్టకని తల్లికి ఎదురుచెప్తాడు. ఆ మాటకి రాజ్యలక్ష్మి షాక్ అవుతుంది. సందు దొరికింది కదా అని బసవయ్య విక్రమ్ మీద ఎక్కిస్తాడు. తులసి ఇంట్లో కొత్త దంపతుల శోభనానికి ముహూర్తం పెట్టిస్తారు. అప్పుడే నందు దిగాలుగా ఇంటికి వస్తాడు. మొదటి రాత్రి జరిగితే భార్యాభర్తల బంధం గట్టి పడుతుంది తల్లి నుంచి రక్షించుకుంటాడని నందు మనసులో అనుకుంటాడు. నందు, తులసిని వెళ్ళి దివ్య వాళ్ళని తీసుకురమ్మని అనసూయ చెప్తుంది.