ప్రియ పెళ్లి మండపానికి వచ్చి నందుని కలుస్తుంది. సంజయ్ ప్రియని చూసి వెతుకుతూ ఉంటాడు. దివ్య తన పెళ్లి చేసిందని అందుకని రాజ్యలక్ష్మి పగ పట్టిందని చెప్పేస్తుంది. ఈ పెళ్లి జరిగితే దివ్య మేడమ్ జీవితం సర్వనాశనం అయిపోతుందని ప్రియ చెప్పేసరికి నందు షాక్ అవుతాడు. ఈ పెళ్లి జరగకూడదు దివ్య మెడలో తాళి పడకూడదని వెంటనే వెళ్ళి పెళ్లి ఆపాలని పరుగులు తీస్తాడు. మండపంలో తాళి కట్టే టైమ్ అవుతుందని ఇంకా నందు రాలేదని తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. నందు వచ్చేసరికి విక్రమ్ దివ్య మెడలో తాళి కట్టేస్తాడు. అది చూసి నందు చాలా బాధపడతాడు. తులసి దివ్య జీవితం మనమే చేజేతులారా నాశనం చేశాం ఈ విషయం నీకు ఎలా చెప్పాలని మనసులోనే బాధపడతాడు. నందు కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి ఏమైందని తులసి అనుమానంగా అడుగుతుంది.
Also Read: రాజ్ ముందు కావ్యని చెడ్డదాన్ని చేసిన స్వప్న- భార్యని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోతాడా?
పెళ్లి చేసుకుని అది చిన్న పిల్లలా మురిసిపోతుంది దాని సంతోషం చూడమని అనసూయ వాళ్ళు నందుకి నచ్చజెప్పడానికి చూస్తారు. మీ మాట వినాలో మనసు చెప్పిన మాట వినాలో అర్థం కావడం లేదని బాధపడతాడు. సంతోషంగా పెళ్లి తంతు అంతా సంబరంగా జరుగుతుంది. తాళి కట్టకుండా వెళ్ళి రాజ్యలక్ష్మి పక్కన విక్రమ్ నిలబడినట్టు దివ్య తన జీవితం నాశనం అయిపోయిందని ఇక బతకడం వెస్ట్ అని కత్తితో పొడుచుకున్నట్టు నందు కల కంటాడు. దివ్య, విక్రమ్ ఆశీర్వాదం తీసుకోవడానికి నందు ముందు నిలబడతారు. మీ కూతుర్ని మీలాగా ప్రేమగా చూసుకుంటానా లేదా దిగులు పడుతున్నారా కచ్చితంగా చూసుకొను అనేసరికి అందరూ షాక్ అవుతారు. మీ కంటే ప్రేమగా చూసుకుంటానని అనేసరికి అందరూ సంతోషపడతాడు. మాటలతో చెప్పడం కాదు చేతిలో చేయి వేసి చెప్తే నమ్ముతానని అనేసరికి విక్రమ్ మాట ఇచ్చేందుకు సిద్ధపడుతుంటే అంటే అల్లుడు మీద నమ్మకం లేదా అని రాజ్యలక్ష్మి పుల్ల పెడుతుంది.
అప్పగింతలు మొదలవుతాయి. దివ్య మీరు కూడా మాతో రావచ్చు కదా అని చిన్న పిల్లలా ఏడుస్తుంది. నీతోనే వస్తున్నాం భౌతికంగా రాకపోయినా మా ప్రేమలు నీతోనే వస్తున్నాం. మీ నాన్న ప్రేమ మీ ఆయనలో కనిపిస్తుంది. ఈ తల్లి ప్రేమ మీ అత్తలో చూసుకో. తోడబుట్టిన వాళ్ళ ప్రేమ మరిదిలో చూసుకోమని తులసి అంటుంది. నందు మాత్రం నిజం తెలిసి కూతురి జీవితం నాశనం చేసినందుకు కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఆడవాళ్ళ జీవితం ఇంతే అంటూ కాసేపు వేదాంతం చెప్తుంది. దేవుడు వచ్చి ప్రేమ విషయంలో చినబాబుకి సలహాలు ఇచ్చేది తనేనని అంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళు కదా నీకు ఎప్పుడు మమ్మల్ని చూడాలని అనిపించినా కాల్ చెయ్యి రెక్కలు కట్టుకుని వాలిపోతానని తులసి అంటుంది. నందు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. నీ కూతురు వెళ్ళిపోతుంది ఏదో ఒకటి మాట్లాడు అని పరంధామయ్య అంటాడు.
Also Read: వావ్.. ఒక్క పాటలోనే యష్ ని నడిపించేసిన వేద- భార్య ప్రేమ తెలుసుకుని మనసు మార్చుకుంటాడా?
నందు ఏడుస్తుంటే నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా అని అంటుంది. దివ్య చేతిని రాజ్యలక్ష్మి చేతిలో పెట్టి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. పులి నోటికి మేకను అందించినట్టు దివ్యని అత్త చేతిలో పెడుతున్నాడని లాస్య లోలోపల సంబరపడిపోతుంది.