యష్ కి కాళ్ళు వచ్చేలా చేయడం కోసం వేద గుడిలో పూజలు చేస్తుంది. నా భర్త త్వరగా కోలుకోవాలి. ఏడేడు జన్మలకి మా బంధం ఇలాగే ఉండాలని చీటీ రాసి గుడిలో ముడుపు కడుతుంది. వేదని చూసి సులోచన కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇలాంటి కష్టం అల్లుడుకి వచ్చి ఉండకూడదు. కానీ నువ్వు ఎంత ఓపికగా నిబ్బరంగా నిలబడి సేవ చేసుకుంటున్నావని అంటుంది. నా భర్తని నేను కాకుండా ఇక ఎవరు కాపాడుకుంటారు. ఆయన పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. ఇంతకముందులా లేచి సంతోషంగా తిరుగుతారు. ఒక భార్యగా అది నా పూచీ. మళ్ళీ మామూలుగా అయ్యి స్టైల్ గా కారు ఎక్కి నన్ను క్లినిక్ కి తీసుకుని వెళ్తారని తల్లికి ధైర్యం చెప్తుంది.


Also Read: డబుల్ ట్విస్ట్, కృష్ణ మీద చేయి ఎత్తిన మురారీ- రెండు నిజాలు బట్టబయలు


మాలిని ఏడుస్తూ ఉంటే సులోచన వచ్చి పలకరిస్తుంది. ఈ యాక్సిడెంట్ ఏదో నాకు జరిగి ఉండవచ్చు కదా నా బిడ్డని అలా మంచం మీద చూడలేకపోతున్నానని మాలిని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఖుషి వచ్చి డాడీ బెడ్ మీద నుంచి ఎప్పుడు లేస్తారు, మనతో కలిసి డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు డిన్నర్ చేస్తారని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంది. వేద ప్రతిరోజూ గుడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటుంది. భర్తకి సేవలు చేసే పనిలో నిమగ్నమై ఉంటుంది. మాలిని యష్ ఎదురుగా కూర్చుని ఏడుస్తుంటే ఆయన బాగున్నారు ఇంకొన్ని రోజుల్లో లేచి కూర్చుంటారు. వీల్ చైర్లో కూర్చోబెడితే మూమెంట్ బాగుంటుందని మాలినికి ధైర్యం చెప్తుంది. యష్ ఆరోగ్యం మెరుగుపడింది అంటే అంతా నీ వల్లే భర్తలా కాకుండా బిడ్డ కోసం చేసినట్టు చూసుకున్నావని మెచ్చుకుంటుంది.


Also Read: మండపంలో తులసి, లాస్య గొడవ - చివరి నిమిషంలో పెళ్లి చేసుకోనని చెప్పిన దివ్య, రాజ్యలక్ష్మి షాక్


యష్ ని చిన్న పిల్లాడిలా చూసుకుంటుంది. కఠోరమైన పరీక్ష ఇది బాధలు భరించాలని సోదమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. మోకాళ్ళ మీద వేద గుడి మెట్లు ఎక్కుతుంది. నీ కోసం ఇంకొక గుండె కొట్టుకుంటుంది ఆ గుండె నీ భార్య. వేద వదిన తన గురించి ఖుషి గురించి ఆలోచించడం లేదు. కేవలం నీ గురించి ఆలోచిస్తూ గుడిలో తపస్సు చేస్తుంది. నీ భార్య నీకోసం చేసే త్యాగాన్ని చూస్తే అయినా నీ మనసు కరుగుతుంది ఏమోనని వసంత్ తనని గుడికి తీసుకుని వెళతాడు. వేద మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం యష్ చూస్తాడు. సోదమ్మ యష్ దగ్గరకి వస్తుంది. ఎంత అదృష్టవంతుడివి, ఎంత గొప్ప భార్యని పొందావు. ఒక పక్క డాక్టర్ గా సేవలు చేస్తుంది. మరోపక్క భార్యగా మొక్కులు మొక్కుతుందని సోదమ్మ అంటుంది. యష్ ప్రవర్తనకు చాలా బాధగా ఉందని చిత్ర వసంత్ తో అంటుంది. అక్కకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది తను ఎలా తట్టుకుంటుందని చిత్ర బాధపడుతుంది. యష్ ని మెల్లగా నడిచేలా ప్రాక్టీస్ చేయిస్తుంది. తన పక్కనే ఉంటూ ధైర్యం చెప్తూ నడిపిస్తుంది. ఎట్టకేలకు యష్ ని మామూలు మనిషిని చేస్తుంది.