బ్యాంక్ మేనేజర్ తులసి ఇంటికి వస్తాడు. మీరు మ్యూజిక్ స్కూల్ కోసం బ్యాంక్ లోన్ తీసుకోవాలని అనుకున్నారు కదా దాని గురించి మాట్లాడదామని వచ్చామని వాళ్ళు చెప్తారు. మీకు కావాల్సిన లోన్ మేమిస్తామని చెప్తారు. ఈ మధ్య బ్యాంక్ అధికారులు ఇళ్ళకి వచ్చి మరీ లోన్లు ఇస్తున్నారా అని తులసి అడగడంతో అధికారులు ఇద్దరు మొహాలు మొహాలు చూసుకుంటారు. గవర్నమెంట్ ఆడవాళ్ళ ఉపాధి కోసం కొత్తగా స్కీమ్ తీసుకొచ్చింది దీనికి పెద్దగా షరతులు కూడా ఉండవని వాళ్ళు చెప్పడంతో తులసి అనుమానంగా చూస్తుంది. కొత్త స్కీమ్ గవర్నమెంట్ మొదలు పెట్టిందా లేక నాకోసం ఎవరైన పెద్ద మనిషి పంపాడా అని మొదలు పెట్టడా అని అడుగుతుంది. మిమ్మల్ని ఎవరు పంపారు ఎందుకు పంపించారనేది నాకు బాగా తెలుసు.. అర్హత లేకుండా నేను ఏది ఆశించను ఈ మాట ఆయనకి చెప్పండి అని వాళ్ళని పంపించేస్తుంది.
Also Read: ఆదిత్యపై సత్య అనుమానం, రుక్మిణి దగ్గరకి వచ్చి ఆరా- మాధవని వదిలిపెట్టేదె లేదంటున్న ఆదిత్య
సామ్రాట్ బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావని అప్పుడే అక్కడికి వచ్చిన సామ్రాట్ బాబాయ్ తనని అడుగుతాడు. ఎట్టి పరిస్థితులలోనూ బ్యాంక్ లోన్ శాంక్షన్ చెయ్యమని మేనేజర్ ని తులసి ఇంటికి పంపించానని చెప్తాడు. అప్పుడే సామ్రాట్ కి తులసి ఫోన్ చేయడంతో బ్యాంక్ మేనేజర్ అనుకుని పని పూర్తయ్యిందా లోన్ శాంక్షన్ చేశారా అని ఆత్రంగా అడుగుతాడు. పని అవ్వలేదు సార్ అని తులసి అనేసరికి తన గొంతు విని షాక్ అవుతాడు. నేను బ్యాంక్ వాళ్ళు చుట్టూ ప్రదక్షణాలు చేసినా నాకు లోన్ రాలేదు మరి వాళ్ళు ఇంటికి వచ్చి మరి లోన్ ఇస్తానంటే అనుమానం రాకుండా ఎలా ఉంటుందని అంటుంది. నాకు ఇలాంటివి నచ్చవు, ఎవరి సహాయం నాకు అవసరం లేదని చెప్పి కాసేపు క్లాస్ తీసుకుంటుంది. హనీ వచ్చి సంగీతం నేర్చుకోడానికి వెళ్తున్నా అని చెప్తుంది. సంగీతం ఎవరు నేర్పిస్తున్నారని సామ్రాట్ అడిగితే తులసి ఆంటీ అని చెప్తుంది. సరే నేను డ్రాప్ చేస్తాను అంటాడు.. హనీ వద్దు తాతయ్యతో వెళ్తాను నువ్వు తులసి ఆంటీ ఎప్పుడు కలిసినా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు వద్దు అని అంటుంది. ఇక హనీ తులసి దగ్గరకి వస్తుంది. మీ దగ్గర సంగీతం నేర్చుకుందామని వచ్చానని చెప్తుంది. మా నాన్న మీద కోపం నా మీద చూపించకండి నాకు సంగీతం నేర్పించండి ప్లీజ్ ఆంటీ అని బతిమలాడుతుంది. దీంతో తులసి సరే అని ఒప్పుకుంటుంది.
Also Read: జానకి గురించి నిజం తెలుసుకున్న గోవిందరాజులు- సర్టిఫికెట్స్ తెచ్చేందుకు ప్లాన్ వేసిన గోవిందరాజులు
ప్రేమ్ శృతి కోసం వెతుకుతూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇక తులసి అభికి ఫోన్ చేస్తుంది. గుర్తున్నాన నాన్న అని అభిని అడుగుతుంది. జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని సాయం చేశావ్ ఎలా మర్చిపోతాను అనేసరికి తులసి బాధపడుతుంది. ఇంకా ఈ అమ్మ మీద కోపం తగ్గలేదా అంటుంది. పండక్కి ఈ అమ్మ దగ్గరకి రమ్మని పిలవడానికి ఫోన్ చేశాను, ప్రేమ్ వాళ్ళని కూడా రమ్మని పిలిచాను అని చెప్తుంది. నేను రాను అని చెప్తాడు. నీ మనసు ఏం కోరుకుంటుంది అంకితతో కలిసి ఉండతామ లేదా మీ అత్తగారి ఇంట్లో ఉండటమ అంటే నాకు రెండు కావాలి మామ్ అని చెప్తాడు. అంకిత నీకోసం బాధపడుతుంది, దిగులుపడుతుంది. అంకిత కోసమైన పండక్కి ఇక్కడికి రా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు మీ జీవితానికి సంబందించి ఒక నిర్ణయం తీసుకోండి నేను మీ మధ్యలోకి రాను మీరిద్దరు కలిసి ఉండాలి ప్లీజ్ ఒక్కసారి ఇంటికి రా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంది. ఫోన్ చేసింది ఎవరు అని అభిని తన అత్తయ్య అడుగుతుంది. ఇంటికి రమ్మని పిలుస్తుంది నాకు వెళ్ళడం ఇష్టం లేదని అంటాడు. బ్యాగ్ సర్దుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళు అని అంటుంది. అది మొండిది దానితో ప్రేమగా వెళ్తేనే పని అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళు తన కోసం ఇంటికి వచ్చాడని నమ్ముతుంది, నమ్మకంగా అక్కడ ఉండి దాని మనసు మార్చు అని చెప్తుంది.
తరువాయి భాగంలో..
ఎస్ ఎస్ గ్రూప్ ఇచ్చిన ప్రకటన చూసి వస్తుంది. అక్కడ తులసి, లాస్యను చూసి షాక్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు విషయం ఏంటి అనేది నందుకి చెప్పాలని లాస్య అంటుంది. తులసి చేతిలోని ఫైల్ లాస్య లాక్కుంటుంది.