జానకి గురించి ఊరి వాళ్ళ ముందు చాలా గొప్పగా చెప్తుంది జ్ఞానంబ. ఒక చిన్న మాట కోసం చదువు వదిలేశారు మీరు చాలా గ్రేట్ అని గీత కూడా పొగుడుతుంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నా కాపురాన్ని సరిచేసుకుంటానని చెప్తుంది. నీ వల్ల ఒక అమ్మాయి కాపురం నిలబడిందని జ్ఞానంబ సంతోషిస్తుంది. మీ చదువు కాగితాలు లేకపోతే మీ ఐపీఎస్ చదువు ఆగిపోతుంది.. కని అమ్మని అడిగి వాటిని తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలని రామా, జానకి ఆలోచిస్తుంటారు. ఈరోజు అకాడమీలో ఒరిజినల్ సర్టిఫికట్స్ సబ్మిట్ చేయకపోతే రేపటి నుంచి కోచింగ్ కి రానివ్వరని జానకి బాధపడుతుంది. త్వరలోనే మీ ఐపీఎస్ చదువు అయిపోతుందని ఆనందపడుతుంటే ఇలా జరిగిందేనటాని రామా అంటాడు. వీరిద్దరి మాటలు గోవిందరాజులు వింటాడు. ఒరేయ్ రాముడు ఇది నిజమా మాకెవ్వరికి తెలియకుండా జానకి చదువుకుంటుందా అని నిలదీస్తాడు. చదివిస్తున్నా నాన్న అని రామా చెప్పడంతో షాక్ అవుతాడు. 


Also Read: కన్నతండ్రి మీద పగతో రగిలిపోతున్న దేవి- గుండెలవిసేలా ఏడుస్తున్న రుక్మిణి, సత్య మీద అరిచిన ఆదిత్య


చదువుకున్న అమ్మాయితో పెళ్లి చెయ్యడం వల్ల తమ్ముడి ప్రాణాలు పోయాయని భయంతో ఉంది మీ అమ్మ.. అందుకే నీకంటే తక్కువ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చెయ్యాలని అనుకుంది. జానకి డిగ్రీ చదివిందని తెలిసిన రోజున మీ అమ్మ గుండె ఆగినంత పని అయ్యింది. ప్రతి క్షణం ని గురించి ఆలోచిస్తూ భయపడుతూ బతికింది. అప్పటికి మీ ఇద్దరి మధ్య శాశ్వత దూరం వస్తుందేమో అని భయపడ్డాం. దేవుడి దయ వల్ల జానకి మంచితనాన్ని అర్థం చేసుకుని మీ ఇద్దరు కలిసి బతికేందుకు ఒప్పుకుంది. అలాంటిది నువ్వే జనకిని చదిస్తున్నవాని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. పెళ్లి అనేది ఐపీఎస్ అవ్వాలనే తన చిన్న నటి కలని బలి తీసుకుంది. తన కన్న వాళ్ళ ఆత్మకి శాంతి లేకుండా చేసింది. తనకి ఎంతో ఇష్టమైన ఐపీఎస్ కల దూరమైతే తను బతకగలదా అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని రామా చెప్తాడు. ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఏ నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉందని అంటాడు. ఇందులో జానకి తప్పేం లేదు అమ్మకిచ్చిన మాట కోసం తన ఐపీఎస్ కలని వదిలేస్తానని చెప్పారు కానీ తన కలని వదిలేయద్యమంటే ఒక రకంగా ప్రాణం వదిలేయడమే అందుకే నేనే తనని బలవంతంగా ఒప్పించానని అంటాడు. జానకి చదువు కాగితాలు అమ్మ దగ్గర ఉండటం వల్ల తన కల కళ్ల ముందే ఆగిపోయేలా ఉంది నువ్వే ఎలాగైనా ఆ కాగితాలు ఇప్పించమని బతిమలాడతాడు. 


Also Read: అల్లాడిన పసిమనసు, ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఖుషి- వేద, యష్ కి వార్నింగ్ ఇచ్చిన మాళవిక


అందుకు గోవిందరాజులు సరే అంటాడు. మీ అమ్మకి విషయం చెప్పి ఎలాగోకల తీసుకొస్తానని అంటాడు. ఆ మాటకి ఇద్దరు సంతోషిస్తారు. జానకి చదువు కాగితాలు ఎలా ఆడగాలో అర్థం కావడం లేదని అనుకుంటాడు. జ్ఞానంబ దగ్గరకి వెళ్ళిన గోవిందరాజులు జానకి మనసులో చదువు అనే ఆలోచన లేదని నీకు నమ్మకం వచ్చింది కదా మరి తన చదువు కాగితాలు ఇంక నీ దగ్గర ఉంచుకున్నావ్ తిరిగి ఇచేయొచ్చు కదా అంటాడు. ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది జ్ఞానంబ. మీరు చెప్పింది నిజమే జానకి బాధపడుతుంది. తన చదువు కాగితాలు తనకే ఇచ్చేస్తానని అంటుంది. కానీ ఇప్పుడు కాదు జానకి నెల తప్పిందని శుభవార్త చెప్పిన తర్వాత ఇచ్చేస్తానని చెప్తుంది. గోవిందరాజులు సర్టిఫికెట్స్ తీసుకుని వస్తాడని జానకి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. జానకి నెల తప్పిన రోజు ఆ కాగితాలు ఇస్తానని చెప్పిందని చెప్పడంతో బాధపడతారు. ఒకవైపు టైం అవుతుంది అవి లేకపోతే తన చదువు ఆగిపోతుందని రామా ఫీల్ అవుతాడు. మీరేం కంగారు పడకండి ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికిందని అంటాడు. జ్ఞానంబ బీరువా తాళాలు తీసుకొచ్చి ఇస్తాడు. అదంతా మల్లిక దొంగచాటుగా చూస్తుంది.