నందు, సామ్రాట్ వంటలు చేసేందుకు సిద్ధమవుతారు. లాస్య వెళ్ళి నందుకి హెల్ప్ చెయ్యడం చూసి హనీ ఇది చీటింగ్ అని అంటుంది. ఆ మాటకి తులసి ఆంటీని కావాలంటే మీ డాడీకి హెల్ప్ చెయ్యమని లక్కీ అంటాడు. సరే అని తులసి సామ్రాట్ కి హెల్ప్ చెయ్యడానికి వెళ్తుంది. అది చూసి నందు కోపంతో ఉడుక్కుంటూ ఉంటాడు. ఇలా కుకింగ్ కాంపిటీషన్లో పార్టీసిపేట్ చెయ్యడం ఫస్ట్ టైం బ్రో అని సామ్రాట్ అంటే నేను కుకింగ్ చెయ్యడం ఇదే ఫస్ట్ టైం నేను ఎవరికి చెప్పుకొను అని మనసులో అనుకుంటాడు. ఇక తులసి వంటలు రుచి చూడటానికి రెడీగా ఉన్నానని అనడంతో నందు మాత్రం నేను రెడీగా లేను అంటాడు.


‘‘అసలు వంట చేయాల్సింది మీ ఆడవాళ్ళు.. అది తిని ఎలా ఉందో చెప్పాల్సింది మేము.. ఏదో ముచ్చట పడ్డారు కదా అని వంట చేస్తే ఏదో తోపుల్లగా మీరు రుచి చూసి మాకు రేటింగ్ ఇవ్వడమెంటి?’’ అని నందు కోపంగా అంటాడు. వంట చెయ్యడం ఆడవాళ్ళ పని అయినప్పుడు మరి ఆడవాళ్ళతో ఎందుకు ఉద్యోగం చేయిస్తున్నారు అని తులసి ప్రశ్నిస్తుంది. ఆ మాటకి సామ్రాట్ కూడా వంత పాడతాడు. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని అంటాడు. ఈ విషయంలో కాసేపు నందు, తులసి మధ్య వాదన జరుగుతుంది. పార్టీ అయ్యేలోపు తులసి, నందు మధ్య గొడవ పెద్దది అయ్యేలాగా ఉందని అందరూ మనసుల్లో అనుకుంటారు.


ఇక సామ్రాట్, నందు చేసిన వంటలు రుచి చూసేందుకు అనసూయ, పరంధామయ్య కరెక్ట్ అని తులసి అంటుంది. ఆ మాటకి సామ్రాట్ కూడా సరే అంటాడు. ఇద్దరూ కలిసి వంటకాలని రుచి చూసి సామ్రాట్ విజేత అని చెప్తారు. ‘‘ఈ గెలుపు నాది కాదు తులసి గారు మీది మీరు నా పక్కన ఉండబట్టే ఎప్పుడూ కంటే వంటలు బాగా వచ్చాయి’’ అని సామ్రాట్ అంటాడు. అది విని కోపంగా నందు బయటకి వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావ్ అని లాస్య వెనకాలే వెళ్తుంది.


‘‘ఒక పక్క తులసి, మరో పక్క నువ్వు నా పరువు పోయేలా చేస్తున్నారు. నాకు వంట రాదని తెలిసి నన్ను ఇరికించావ్’’ అని తిడతాడు. ‘‘కావాలనే చేశాను పాతికేళ్లు కాపురం చేసిన తులసి నీకు వంట రాదని తెలిసి నీ వైపు వస్తుందని ప్లాన్ చేశాను. కానీ తులసి వెళ్ళి ఆ సామ్రాట్ వైపు నిలబడింది. బాస్ చేతిలో ఒడిపోతే మంచిదే నీమీద ఇప్పుడు సామ్రాట్ కి జాలి వస్తుందని లాస్య అంటుంది. ‘‘ఛాన్స్ దొరికింది కదా అని ఆ సామ్రాట్ తులసితో సరసాలు ఆడుతుంటే సిగ్గు లేకుండా చూస్తూ ఊరుకోమంటావా నన్ను. ఇరిటేట్ చెయ్యకు నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళి మీ బాస్ ని ఇంప్రెస్ చేసుకో లోపల జరుగుతున్న బాగోతాన్ని చూడలేను’’ అని అంటాడు.


మన కోసం బాస్ వెతుక్కుంటూ బయటకి వస్తాడు లోపలికి ఎందుకు రాలేదని అడుగుతాడు ఏం చెప్తావ్ అంటే రానివ్వు ఉన్నదే చెప్తాను తులసితో తన బిహేవియర్ బాగోలేదని నాకు నచ్చలేదని చెప్తాను అని నందు అంటాడు. అప్పుడే సామ్రాట్ నందు వాళ్ళ కోసం బయటకి వస్తాడు. నిజంగానే నువ్వు ఆ మాట అంటే నీకేం సంబంధం అని నిలదీస్తాడు. నువ్వు సైలెంట్ గా ఉండు నువ్వు సామ్రాట్ మీద గెలిచే విధంగా ఏదో ఒక విధంగా చేస్తాను రా అని నందుని లోపలికి తీసుకుని వెళ్తుంది. ఇక సామ్రాట్, దివ్య కలిసి చెస్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సామ్రాట్ గురించి హనీ, వాళ్ళ బాబాయ్ గొప్పలు చెప్తూ ఉంటారు. హ్యాండ్ రెజ్లింగ్ లో కూడా గెలిచాడా అని లాస్య అడుగుతుంది. ఆ ఆట మా వాడికి చిన్న పిల్లాడి ఆట అని సామ్రాట్ బాబాయ్ అంటాడు. సరైన వాడు పోటీలో తగిలి ఉండదు అని లాస్య వెటకారంగా అంటుంది. నేను జోక్ గా అన్నాను మీరు సీరియస్ గా తీసుకోకండి అని లాస్య కవర్ చేస్తుంది.


Also read: ఏకాంత వేళ మనసులో మాటలు బయటపెట్టిన వేద, యష్- ఖైలాష్ ని విడిపించేందుకు అభి ప్లాన్


సరైన వాడు అంటే ఎవరు బాస్ ఉన్నాడు కదా అని మొహమాట పడకు ఆ సరైన వాడి పేరు చెప్పు అనేసరికి లాస్య నందు అని అంటుంది. ఈ లాస్య మళ్ళీ నన్ను ఇరికిస్తుందని నందు తిట్టుకుంటాడు. అదేంటి నందు ఇప్పుడేమి పోటిలు పెట్టుకుందామని అనడం లేదు కదా అనేసరికి తులసి అవేమీ వద్దు ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది. సామ్రాట్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదని అంటాడు. కానీ లక్కీ మాత్రం హ్యాండ్ రెజ్లింగ్ లో పోటీ పడుతుంటే భలే సరదాగా ఉంటుందని అంటాడు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు భయపడుతున్నావని లాస్య అనుకుంటుంది అని సామ్రాట్ బాబాయ్ అంటాడు. లక్కీ కూడా హనీ మీ డాడీ భయపడుతున్నాడు చూడు అని హేళనగా మాట్లాడతాడు. తులసి ఆపేందుకు చూస్తుంటే సామ్రాట్ బాబాయ్ మాత్రం వదిలిపెట్టేదె లేదు ఈరోజు సరైన వ్యక్తి ఎవరో తెలిపోవాల్సిందే అని అంటాడు. ఇక నందు, సామ్రాట్ హ్యాండ్ రెజ్లింగ్ పోటీలకి దిగుతారు.


Also Read: జానకి షాకింగ్ నిర్ణయం - జానకి ఐపీఎస్ కలని జ్ఞానంబ నెరవేరుస్తుందా? మల్లిక మీద అరిచిన గోవిందరాజులు