సామ్రాట్ కి క్లయింట్ ఫోన్ చేస్తాడు. తులసి మేడమ్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంది మాకు చాలా బాగా నచ్చింది, ప్రాజెక్ట్ మనం కలిసి చేస్తున్నాం కంగ్రాట్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఏమైందని లాస్య అడిగితే తులసిగారి ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందట ఇంప్రెస్ అయ్యారట ప్రాజెక్ట్ కి ఒకే చెప్పారు అని సామ్రాట్ సంతోషంగా చెప్తాడు. తులసిగారితో అలా మాట్లాడి తప్పు చేశాము వెంటనే వెళ్ళి సారీ చెప్పాలి అని అందరూ వెళతారు. తులసి బాధగా వాళ్ళు అన్న మాటలు తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడే సామ్రాట్ వాళ్ళు వచ్చి డోర్ కొడతారు. మీరెంటో తెలిసి కూడా తొందరపడి మాట జారాను వాలాతో కలిసి మిమ్మల్ని బాధపెట్టాను. మీ ప్రజెంటేషన్‌తో మన కంపెనీకి మంచి పేరు తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ మనకే వచ్చింది కంగ్రాట్స్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా అని సామ్రాట్ అంటాడు.


సర్ మీరు సారీ చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పు అవదు కదా గీత దాటి ప్రవర్తించాను అర్హత లేని బాధ్యత తీసుకున్నాను. సిన్సియర్ గా మిమ్మల్ని నిద్ర లేపడానికి చాలా ప్రయత్నించాను. ఇంట్లో ఎవరు ఏ పని చేయకపోయినా నేనే చెయ్యడం నాకు అలవాటు అలాగే నేను మీటింగ్ కు వెళ్ళాను అని చెప్తుంది. మీరు చేసింది మంచి పనే మనకి ప్రాజెక్ట్ ఒకే అయ్యింది తులసి గారు అని సామ్రాట్ అంటాడు. ఒకే అయ్యింది కాబట్టి నా తులుపు కొట్టి సారీ చెప్పారు, ఒకవేళ ఒకే కాకపోతే ఏం చేసేవాళ్ళు మీటింగ్ కి వెళ్ళడం నా తప్పే అని తులసి అంటుంది. బాస్ అనేవాడు మనిషే తప్పులు చేస్తాడు ఇంకెప్పుడు మిమ్మల్ని వేలెత్తి చూపించనని మాట ఇస్తున్నా అని అంటాడు. ఇక నందు, లాస్యలని కూడా సారీ చెప్పమని చెప్తాడు. రోజు రోజుకి తులసి శివగామిలా మారుతుందని లాస్య మనసులో అనుకుంటుంది. ఇక నుంచి అంతా మీ ఇష్టం మీకు అనిపించింది చెయ్యండి తర్వాతే నాకు చెప్పండి రిజల్ట్ తో సంబంధం లేదు ప్రోజెక్ట్ మనకి వచ్చినందుకు మీకు పార్టీ ఇస్తున్నాను అని అంటాడు సామ్రాట్.


Also Read: మన పెళ్లి ఎప్పుడని అభిని నిలదీసిన మాళవిక- యష్ మీద పగ తీర్చుకోవడానికి అభికి దొరికిన అస్త్రం


పరంధామయ్య, ప్రేమ్, అభి అందరూ కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక్కసారిగా పరంధామయ్యకి గుండెల్లో నొప్పి వస్తుంది. రాత్రి కూడా ఇలాగే అయ్యింది అని అనసూయ చెప్తుంది. అందరూ కంగారూ పడుతూ ఉంటారు. నందు, సామ్రాట్ రాత్రి తాగిన చాలా హడావుడి చేసినట్టు అనిపిస్తుందని అనుకుంటూ ఇద్దరు తమ తమ గదుల్లో నుంచి బయటకి వస్తారు. రాత్రి ఏం జరిగిందో గుర్తుందా అని సామ్రాట్ అంటాడు. అవును మనం ఏం మాట్లాడుకున్నాం అని నందు అంటాడు.  తాగిన మత్తులో నేను తులసి మాజీ భర్తని అని సామ్రాట్ కి చెప్పి ఉంటానా అని నందు మనసులో టెన్షన్ పడతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా లాస్య వస్తుంది. మేము ఏం మాట్లాడుకున్నామో నీకు తెలుసా నఈ అడుగుతాడు నందు.


ప్రేమ్ తులసికి ఫోన్ చేసి తాతయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చింది ఇప్పుడు బాగానే ఉంది నువ్వేమి కంగారూ పడకు అని చెప్తాడు. నేను వెంటనే బయల్దేరి వస్తాను మీరందరూ తాతయ్య దగ్గరే ఉండండి అని చెప్తుంది. తులసి కంగారుగా సామ్రాట్ దగ్గరకి వచ్చి మా మావయ్య గారికి గుండెల్లో నొప్పి వచ్చిందంట నేను వెంటనే ఇంటికి వెళ్తాను అని చెప్తుంది. వచ్చిన పని అయిపోయింది కదా మేము కూడా వస్తామని అంటారు. తులసి, నందు, లాస్య ఇంటికి వచ్చేస్తుంది. మీకు బాగోలేదని తెలిసి ఎంత కంగారూ పడ్డానో తెలుసా అని తులసి అంటే నువ్వు ఇంత కంగారు పడతుంటే నా కొడుకు మాత్రం నన్ను పలకరించలేదని అంటాడు. ఇక అంకిత ఏంటి కనిపించలేదని అడుగుతుంది తులసి. మరి వంట ఎవరు చేశారు అంటే మీ అత్తయ్య చేసింది అందుకే నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం అని సరదాగా అంటాడు పరంధామయ్య. శ్రుతి కూడా ఇంటికి వస్తుంది.


Also Read:  రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి


తరువాయి భాగంలో..


తులసి సంతోషంగా ఇంటికి వస్తుంది. మేము కలలు కనే మ్యూజిక్ స్కూల్ కి భూమి పూజ జరగబోతుందని సంతోషంగా ఇన్విటేషన్ కార్డ్ ఇస్తుంది. అది చూసి అభి ఎగిరిపడతాడు. పక్కన సామ్రాట్ పేరు ఉంది అది తెలుస్తుందా ఆయన కంపెనీకి బాస్ నీ జీవితానికి కాదు అని కోపంగా ఆ కార్డ్ చింపేస్తాడు.