కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీతో సోషల్ మీడియా షేక్ అయింది. సునామీలా పోస్టుల కెరటాలు హోరెత్తాయి. #amitshahwithntr అనే హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
అమిత్‌షా వచ్చే వరకు ఇలాంటి మీటింగ్ ఒకటి జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఆఖరి నిమిషం వరకు చాలా గోప్యంగా ఉంచారీ సంగతిని. ఎప్పుడైతే అమిత్‌షా స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయిందో అప్పుడు రివీల్ చేశారీ సంగతి. ఇక అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశం చాలా ఆసక్తిగా చూసిందీ భేటీవైపు.
భేటీ పదిహేను నిమిషాలే ఉంటుందని అనుకున్నారు. కానీ రాత్రి పది తర్వాత సమావేశమైన వీళ్లిద్దరూ డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నారు. తర్వాత కూడా సాగింది ఇద్దరి మధ్య మాటల ముచ్చట. అలా సుమారు 45 నిమిషాల పాటు జరిగిందీ సమావేశం.
పదిన్నరకు జూనియర్ ఎన్టీఆర్ శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌కు చేరుకున్నారు అమిత్‌షా. అక్కడకు పది నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేరుకున్నారు. అప్పటి నుంచి ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియాలో ట్విట్ల వర్షం మొదలైంది. అలా అర్థరాత్రి దాటినా కూడా ఆ జడివాన ఆగలేదు. ఈ ట్వీట్లలో ఎక్కువ ఉత్తరాది నుంచి ఉండటం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం.
ఎన్టీఆర్ నటన సంగతి తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు చాలా మందికి తెలుసు. కానీ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడులదైన తర్వాత లక్షల మంది ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయారు. కుమరంభీముడో పాటలో ఆయన చేసిన నటనకు కొందరు కంటతడి కూడా పెట్టుకున్నారు. అంతలా మెస్మరైజ్ చేశారు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌కు అక్కడ కూడా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు.
అదే అమిత్‌షాతో భేటీ సందర్భంగా సోషల్ మీడియాలో కనిపించింది. అందుకే #amitshahwithntr అనే హ్యాష్ ట్యాగ్ టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో ట్వీట్‌లు చేసినవాళ్లు సామాన్యులతోపాటు జర్నలిస్ట్‌లు, సినీ స్టార్స్, నేషల్ మీడియా ఉంది.
దీనిపై కొన్ని వారాల పాటు చర్చలు నడుస్తాయని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్‌తో బాక్సాఫీస్ కింగ్ భేటీ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు.
బండిపై యాంటీ కామెంట్స్
అమిత్‌షా, ఎన్టీఆర్ భేటీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ విడుదల సందర్భంగా బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తెరలు తగలబెడతామన్న వ్యక్తితోనే స్వాగతం చెప్పించుకున్నావంటూ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.