సామ్రాట్ తులసి గది డోర్ కొడతాడు. అది చాటుగా నందు, లాస్య చూస్తూ ఉంటారు. తులసి తలుపు తీసి లోపలికి రమ్మని పిలుస్తుంది. పర్వలేదండి మీటింగ్ పోస్ట్ అయ్యింది కదా బోర్ కొడుతుంది సరదాగా అలా బయట తిరుగుదామని అనుకున్నా మీరు కూడా వస్తారేమో అని అంటాడు. మికిష్టం అయితే రండి అని అడుగుతాడు. ఇంత ప్రేమగా కట్టుకున్న వాడు కూడా అడగడు తులసి ఎందుకు కాదని అంటుంది అని లాస్య కామెంట్రీ ఇస్తుంది. సరే వస్తాను అని తులసి అంటుంది. అర్థం అయ్యిందా మగాడు మగాడేనని.. ఇప్పుడు మన పని వాళ్ళని ఫాలో అవ్వడం. తులసి మీద సామ్రాట్ కి కోపం వచ్చేలా చేసి వాళ్ళ ఇద్దరినీ దూరం చెయ్యాలని లాస్య నందుకి చెప్తుంది. తులసి కోసం ఆటో తీసుకుని వస్తాడు సామ్రాట్. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని అడుగుతుంది కానీ సామ్రాట్ సర్ప్రైజ్ అండి ముందు మీరు ఆటో ఎక్కమని చెప్తాడు.


Also Read: అభిమన్యుతో ఎందుకు చేతులు కలిపారని నిలదీసిన కాంచన- అభి, మాళవిక చేతిలో యష్ బిజినెస్ సీక్రెట్స్


అంకిత ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రేమ్ కోపంగా ఇంట్లోకి వెళ్లబోతుంటే అంకిత ఆపుతుంది. శ్రుతిని కలిశావా ఏం చెప్పిందని అడుగుతుంది. ఎవజుతో నాకు శ్రుతికి మద్య ఉన్న బంధం శాశ్వతంగా తెగి పోయిందని ప్రేమ్ ఆవేశంగా చెప్పడంతో అంకిత షాక్ అవుతుంది. నీ మాట విని నా ఆత్మాభిమానాన్ని చంపుకుని శ్రుతితో బాధాన్ని నిలుపుకుందామని వెళ్ళాను నా అవసరం లేదని నా మీద నమ్మకం లేడని మొహం మీదే చెప్పేసిందని ప్రేమ్ అంటే ఏదో ఆవేశంతో అలా అని ఉంటుంది నేను మాట్లాడతాను నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ శ్రుతిని దూరం చేసుకోకు అని అంకిత నచ్చచెప్తుంది. దయచేసి నువ్వు శ్రుతి వైపు మాట్లాడి మమ్మల్ని బలవంతంగా కలపాలని అనుకోకు, ఆ మనిషిని నువ్వు బలవంతంగా లాక్కొచ్చిన తన మనసు అలా ఉండదు అంతకంటే ఎవరు బతుకు వాళ్ళు బతకడం ఉత్తమం అని ప్రేమ్ చెప్తాడు. ఆ మాటలకి అంకిత కోపంగా షటప్ ప్రేమ్.. ఆంటీ అంకుల్ కి విడాకులు ఇచ్చి ఎంత మథన పడుతుందో ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తుందో కళ్ళారా చూస్తున్నాం అన్ని తెలిసి కూడా నువ్వు అదే పని చేస్తావా ఇంకోసారి ఎవరు బతుకులు వాళ్ళు బతుకుదాం అనే మాట నీ నోటి నుంచి నేను వినకూడదు నువ్వు అనకూడదు అని అంకిత వార్నింగ్ ఇస్తుంది.


కాళ్ళు పట్టుకోడానికి కూడా రెడీ అయ్యి వెళ్ళాను వదిన కానీ తను వినలేదు ఇంక నేనేమీ చెయ్యను అంటే శ్రుతి బాధ్యలో ఉండి అలా మాట్లాడి ఉంటుంది. కాస్త టైం ఇవ్వు శ్రుతి మారుతుంది అని అంకిత అంటుంది. ‘నా మనసు చచ్చిపోయింది ఇంక ఎవరు ఏం చెప్పినా నేను వినను నన్ను ఇలా బతకనివ్వు’ అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. సామ్రాట్ తులసి కళ్ళు మూసి సముద్రపు ఒడ్డుకి తీసుకుని వస్తాడు. కళ్ళు తెరిచి అది చూసి తులసి చిన్న పిల్లలా సంతోషిస్తుంది. మొదటి సారి సముద్రాన్ని చూసినట్టుగా తెగ ఓవరాక్షన్ చేసేస్తుంది. వెంటనే పరంధామయ్యకి ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకుంటుంది. తులసి ఆనందం చూసి సామ్రాట్ మురిసిపోతాడు. సముద్రమంత సంతోషాన్ని మీ ముఖంలో చూడటం నాకు చాలా బాగుంది, ఉదయం గాల్లో ఎగిరారు ఇప్పుడు నీళ్ళలో ఎగరండి అని సామ్రాట్ తులసితో అంటాడు. సముద్రం అలలతో తులసి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. నందు, లాస్య తిట్టుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. మనం ఇలా వాళ్ళని వెతుక్కుంటూ ఉంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు లాస్య అని నందు అంటాడు. ఇసుకలో తులసి ఇల్లు కట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. సామ్రాట్ అది చూస్తూ మురిసిపోతాడు అప్పుడే తనకి ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడతాడు.


Also Read: దేవి ముందు ఆదిత్యని ఇరికించి పైశాచికానందం పొందిన మాధవ- రాధ, ఆదిత్యల ఆవేశం


కొంతమంది కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాళ్ళని ఆపి ఏమైందని సామ్రాట్ అడుగుతాడు. ఎవరో క ఆవిడ అలల్లో కొట్టుకునిపోయిందంట అని ఆ వ్యక్తి చెప్పడంతో సామ్రాట్ కంగారుగా తులసి కోసం వెతుకుతూ సముద్రంలోకి వెళ్లబోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వద్దు సార్ అంటూ సామ్రాట్ ని ఆపుతారు. తులసి తులసి అంటూ రోదిస్తాడు.


తరువాయి భాగంలో..


తులసి విషయంలో లిమిట్స్ లో ఉండమని నందు సామ్రాట్ కి వార్నింగ్ ఇస్తాడు. ఏ హక్కుతో నాకు వార్నింగ్ ఇస్తున్నావ్ అని సామ్రాట్ ప్రశ్నిస్తాడు. నేను తులాస్ మాజీ భర్తని ఆ విషయం తెలుసుకో అని నందు గట్టిగా అరుస్తాడు. ఆ మాటకి మొదట షాక్ అయిన సామ్రాట్ ఓ తులసిని ఏడిపించి బాధపెట్టి డైవర్స్ దాకా తీసుకెళ్లింది నువ్వేనా ఇడియట్ అని సామ్రాట్ నందు కాలర్ పట్టుకుంటాడు. నందు కూడా ఎవర్రా ఇడియట్ అని సామ్రాట్ కాలర్ పట్టుకుంటాడు.