ఇంట్లో వాళ్ళందరి మీద అభి అరిచి అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. ఇదంతా నా వల్లే వంట బాగా చేసి ఉంటే ఈ గొడవ వచ్చి ఉండేది కాదని అంకిత బాధపడుతుంది. తులసి మొదటి సారి ఫ్లైట్ ఎక్కినందుకు ఆనందపడుతూ ఫోటో తీయ్యమని సామ్రాట్ ని అడుగుతుంది. మీ మొబైల్ వద్దు నా దాంట్లో బాగా వస్తాయి నేను తీస్తాను అని తన ఫోన్ లో ఫోటోస్ తీస్తాడు. అది చూసి లాస్య చూశావా కింగ్ ప్లాన్ తన మొబైల్ లో ఫోటో తీస్తే రోజు చూసుకోవచ్చు అని ఐడియా అంటుంది. ఇక తులసి తెగ ఓవరాక్షన్ చేసేస్తుంది. చిన్న చిన్న ఆశలు తీర్చుకోవడంలో ఎంత ఆనందం ఉందో మిమ్మల్ని చూస్తుంటే నేను ఎంత పోగొట్టుకున్నానో తెలుస్తుంది. నేను కూడా మీకులగా మారిపోతాను అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఇక తులసి ఫ్లైట్ లో దిగిన ఫోటోస్ దివ్యకి పంపిస్తుంది, అవి చూసి అబ్బా భలే ఉన్నాయ్.. సూపర్ అంటూ తెగ పొగిడేస్తారు.
తులసి ఏం చేస్తుందా అని నందు తొంగి తొంగి వాళ్ళ వైపు చూస్తుంటే బత్తాయి బాలరాజు(జబర్దస్త్ నాగి) కదిలిస్తాడు. తులసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. విమానంలో కూర్చుంటే స్వర్గంలో కూర్చున్నట్టు ఉంది అని తెగ సంతోషపడుతుంది. బత్తాయి బాలరాజు మళ్ళీ సామ్రాట్ ని కదిలించి మాట్లాడుతూ మీరిద్దరు వైఫ్ అండ హజ్బెండ్ అని అనడంతో సామ్రాట్, తులసి షాక్ అయితే నందు కోపం కట్టలు తెంచుకుంటుంది. హైదరాబాద్ లో తిరగని ప్లేస్ అంటూ లేదు అందుకే సరికొత్త ఎంజాయ్ మెంట్ చెయ్యడానికి వైజాగ్ వెళ్తున్నారని అనేసరికి నందు కోపంగా ఇంకొక్క మాట నీ నోటి నుంచి వస్తే నాలిక కోస్తాను అని బాలరాజుకి వార్నింగ్ ఇస్తాడు. అది విని సామ్రాట్ షాక్ అవుతాడు. ఊరుకో నందు ఆతనేదో తెలియక మాట్లాడాడు అని సామ్రాట్ సర్ది చెప్తాడు. మీ గురించి తప్పు చెప్పానేమో కానీ నందు వాళ్ళ గురించి కరెక్ట్ గా చెప్తానని అనడంతో సామ్రాట్ సరే అంటాడు.
లాస్యని చూస్తూ ఆవిడ కచ్చితంగా ఆయనకి సెటప్ అయ్యి ఉంటదని అంటాడు. ఆ మాటకి సామ్రాట్, తులసి నవ్వుతారు. మళ్ళీ పప్పులో కాలేశాడు లాస్య నీ సెటప్ అంట అని సామ్రాట్ నవ్వుతూ అంటాడు. మీరేమో భార్య భర్తల్లాగా అన్యోన్యంగా ఉన్నారు, వాళ్లేమో ఎడ మొహం పెడ మొహంగా ఉన్నారు అందుకే అలా అనిపించదని బత్తాయి బాలరాజు అంటాడు. నందు కోపంగా వాడిని తినేసాలా చూస్తాడు. నీ పని ఫ్లైట్ దిగాక చెప్తా అని తిడతాడు. అంకిత బాధగా కూర్చుని ఉంటే ప్రేమ్ వస్తాడు. మనసు మార్చుకుని నీకోసం ఇంటికి వచ్చాను అని చెప్పిన వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని అభి గురించి తన బాధని ప్రేమ్ కి చెప్పుకుంటుంది. ఆ కోపం నీ మీద కాదు అమ్మ మీద ఆస్తి తనకి రాకుండా చేసిందని వాడి కోపమని ప్రేమ్ అంటాడు. పైగా వాడిని వదిలేసి నువ్వు అమ్మ దగ్గరకి వచ్చి ఉంటున్నావ్ అందుకే వాడు అమ్మ మీద కోపం పెంచుకుంటున్నాడని చెప్తాడు.
జరిగిన గొడవ పక్కన పెట్టి శ్రుతిని ఇంటికి తీసుకురా అని ప్రేమ్ కి చెప్తుంది. నేను కావాలంటే తానే వస్తుందని ప్రేమ్ కోపంగా అంటాడు. మీరు చాలా నష్టపోతున్నారు ప్రేమ్ ఇగోతో చిన్న గాయాన్ని పెద్దది చేస్తున్నారు, తప్పు చేస్తున్నావ్ అని అంకిత అంటే ఇదే మాట శ్రుతికి చెప్పొచ్చు కదా అంటాడు. ముందు నువ్వు అర్థం చేసుకో ఆ తర్వాత శ్రుతికి నువ్వు నచ్చజెప్పు. మీ అన్నయ్య చేసింది మామూలు తప్పులు కావు అయిన నేను మీ అన్నయ్యతో గొడవపడుతున్నాన్నే కానీ దూరం చేసుకోవడం లేదు నిన్ను కూడా అదే పని చేయమంటున్నాను, భార్యభర్తలు అన్నాక ప్రేమ, అభిమానం, అపార్థాలు కూడా ఉంటాయి. అవి ఏవైనా కానీ నాలుగు గోడల మధ్యే ఉండాలి. నాలుగు రోజుల్లో సమసి పోవాలి అంతేకానీ రావణకాష్టంలా రగులుతూ ఉండకూడదు అప్పుడు అది బంధం అనిపించుకోదు, అందుకే నేను మీ అన్నయ్య దగ్గర తగ్గి ఉంటున్నాను. శ్రుతి చేసింది తప్పు అనిపిస్తే తనని క్షమించు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమలాడి ఇంటికి తీసుకొచ్చేయ్ ప్లీజ్ ప్రేమ్ తనని ఇంటికి తీసుకుని రా, ఆంటీ వైజాగ్ నుంచి వచ్చేసరికి ఇది జరగాలి అని అంకిత చెప్తుంది.
కామెడీ కాకపోతే ఫ్లైట్ ఎగురుతుంటే తులసి తెగ సంబరపడుతుంటే.. సామ్రాట్ మాత్రం కళ్ళు మూసుకుని తెగ వణికిపోతూ ఉంటాడు అది చూసి తులసి తన చేత్తో సామ్రాట్ ని తడుతుంది. అది చూసి లాస్య నందు చూడు తన చెయ్యి ఎక్కడ ఉందో ఇప్పుడు మీద చెయ్యి వేసింది రేపో మాపో చేతిలో చెయ్యి వేస్తుందని చెప్తుంటే దణ్ణం పెట్టి ఇక ఆపు అని అంటాడు. అదంతా బాలరాజు చూసి నాకు అనుమానం వచ్చేసింది వీళ్ళు మొగుడు పెళ్ళాలు కాదు అని అనుకుంటాడు. అదే మాట సామ్రాట్ తో అంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి వాళ్ళ మీద మాత్రం నాకు అనుమానంగా ఉంది సార్ కచ్చితంగా వాళ్ళు సెటప్, కానీ మేడమ్ మీరు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని అంటాడు. ఊరుకోవయ్య సామి నా పరువు తీసేలా ఉన్నవాని సామ్రాట్ అనేసరికి నందు కోపంగా సీటులో నుంచి వెళ్లిపోతుంటే లాస్య కూడా తన వెనకాలే వెళ్తుంది.
ఏమైంది నందు సామ్రాట్ తింగరి వేషాలు చూడలేకపోతున్నావా, లేకపోతే తులసి ఓవరాక్షన్ చూడలేకపోతున్నావా ఇటువంటివి ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది గుండె బిగబట్టుకో. ఆ సామ్రాట్ పెద్ద బిజినెస్ మ్యాన్ అతను ఎన్నో సార్లు ఫ్లైట్ ఎక్కి ఉంటాడు అలాంటి వాడికి టేకాఫ్ భయం అంతా అతను కేస్తుంది యాక్షన్ అని చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుందని లాస్య అంటుంది.
తరువాయి భాగంలో..
విమానం కుదుపులకి లోనవుతుంది. ఫ్లైట్ లో చిన్న సాంకేతిక లోపం ఉందని విమానంలో ఎనౌన్స్ మెంట్ ఇస్తారు. నందు ఫ్లైట్ లో పని చేస్తున్న అమ్మాయి మీద అరుస్తాడు. మీరు అసలు మనిషేనా అని తులసి రంగంలోకి దిగి నందుని చెడామడా తిట్టేస్తుంది.
Also Read: సామ్రాట్ కౌగిట్లో తులసి, అది చూసి తలబాదుకుంటున్న నందు, లాస్యకు ఊహించని షాక్
Also Read: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద - కానీ అంతలోనే..