వేద మాలిని మాట్లాడిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. యష్ అమ్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నవా అని అడుగుతాడు. మీకెలా తెలుసని వేద అంటే మొత్తం విన్నాను అని చెప్తాడు. ‘‘నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? మొట్టమొదటి సారి అత్తయ్యగారు అంత రిక్వెస్ట్ గా అడిగినా ఒప్పుకోకుండా తప్పు చేశానా? కాంచన గురించి కూడా ఆలోచించకుండా నా ఆత్మాభిమానం కాపాడుకోడానికి నేను ఆలోచించడమే నేను చేసిన తప్పా?’’ అని వేద ఫీల్ అవుతుంది. అమ్మ మాటలకి కరిగిపోయి నువ్వు ఒప్పుకుని ఉంటే నేను చాలా ఫీల్ అయ్యేవాడిని, అమ్మ, కాంచన ఇద్దరూ పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచించారు కానీ జరిగిన ఘోరం గురించి ఆలోచించడం లేదు వాడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, వావి వరసలు తెలియని అటువంటి మృగం కొన్ని రోజులు జైల్లో ఉంటేనే మంచిదని యష్ అంటాడు. ఖుషికి తల్లిగా మీ ఇంటికి వచ్చాను అటువంటిది ఈరోజు ఒక తల్లి కోరికని తీర్చలేకపోతున్నాను, ఆడపడుచు బాధని ఆపలేకపోతున్నా ఆలోచిస్తుంటే నా మీద నాకే కోపం అసహ్యం కలిసి వస్తున్నాయని చాలా బాధపడుతుంది. నువ్వు అలా అనుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకోకు నువ్వు ఎవరికి అన్యాయం చెయ్యలేదు నీకు జరిగిన అన్యాయానికి చట్టపరంగా పోరాడావు అని యష్ ధైర్యం చెప్తాడు. కాసేపు తనని నవ్వించేందుకు ప్రయత్నిస్తాడు.


కాంచన కడుపుతో ఉన్న విషయం వేద తల్లికి తెలుస్తుంది. ఖైలాష్ గాడు ఎంత దుర్మార్గుడైన ఈ సమాయమలో భర్త తన పక్కన ఉండాలని ఏ ఆడదైనా ఆశపడుతుంది, కానీ కాంచనకి ఆ అదృష్టం లేదు పాపం సంతోషంగా ఉండాల్సిన సమయాలో ఈ కష్టం ఏంటో, ఈ ఆలోచనల్లో తల్లి కాబోతున్నదనే విషయం కూడా ఆస్వాదించలేదని సులోచన చాలా బాధపడుతుంది. వాడు జైల్లో ఉంటే ఇటు కాంచన శిక్ష అనుభవిస్తుందని అంటుంది. ఖుషి బాధగా కూర్చుని ఉంటుంది. ఏమైందని అడుగుతాడు. అమ్మ ఇంక రాలేదేంటి ఇంక లేట్ నా అని అడుగుతుంది. యష్ వేదకి ఫోన్ చేస్తాడు. ఇంకా రాలేదేంటి ఖుషి నీకోసం ఎదురు చూస్తుందని చెప్తాడు, ఎమర్జెన్సీ కేసు వచ్చింది లేట్ అవుతుందని చెప్తుంది. నువ్వు పడుకో అని చెప్తాడు కానీ ఖుషి మాత్రం మనంఏ హాస్పిటల్ కి వెళ్దాం పద అంటే వద్దని అంటాడు లేదు నాకు ఇప్పుడే అమ్మ కావాలి అని మారాం చేస్తుంటే యష్ తనని ఆడించి నవ్విస్తాడు.


తల్లి అయ్యానన్న ఆనందం కంటే మీరు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదని కాంచన గుండెలవిసేలా ఏడుస్తుంది. మీ మాట ధైర్యం నాకు ఇప్పుదెంతో అవసరం కానీ మన ఇంట్లో వాళ్ళు ఎప్పటికప్పుడు దూరం చేస్తున్నారు నా ఆశని కన్నీటి రూపంలో ఎన్ని సార్లు చూపించినా ఇంట్లో వాళ్ళి మిమ్మల్ని నిందిస్తున్నారే తప్ప మీకు మాత్రం న్యాయం చెయ్యడం లేదు. సాయం చేసే అవకాశం ఉన్నా ఒక చేతకాని వాడిలా ఒడిపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే మీకు ఈ కష్టాలు, క్షణం క్షణం ఏడుస్తూ బతకడం కంటే ఒక్కసారి చస్తాను, నా చావే అన్నింటికీ పరిష్కారం అని మాత్రలు మింగే సమయానికి వేద వచ్చి వాటిని కొడుతుంది.


ఏంటి వదినా ఏం చేస్తున్నారు. నన్ను చావనివ్వు, నాకు బతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది అని కాంచన ఏడుస్తుంది. చచ్చిపోవడం ఏంటి వదినా నీకేమైన పిచ్చి పట్టిందా అని వేద అంటే అవును నాకు పిచ్చె ఆ పిచ్చె నేను పెంచుకున్న నమ్మకం, ప్రేమ అంటుంటే మీరేమో కాదు మాయ మోసం అని అంటున్నారు. మిమ్మల్ని గెలిచి ఆయన్ని గెలిపించుకునే శక్తి లేదు అందుకే చచ్చిపోతాను అని ఏడుస్తుంది. వదినా మీతో పాటే ఇంకో ప్రాణం ఉందని మర్చిపోయారా పేగు పంచాల్సిన నువ్వే ప్రాణం తియ్యలని చూస్తున్నవా అని వేద అంటుంది. ఏం చేయను వేద పుట్టే వాళ్ళు రేపు నాన్న ఎక్కడ అంటే ఏం సమాధానం చెప్పాలి, ఆయన ఎప్పుడు బయటకి వస్తారని ఇంక ఎంత కాలం ఎదురు చూడాలి, చేస్తుంది పాపమే అయినా ఇదే నాకు పరిష్కారం అనిపించిందని కాంచన ఏడుస్తూ చెప్తుంది.


ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి పనులు చేయను అని మాట ఇవ్వమని వేద కాంచనని అడుగుతుంది. మాట ఇస్తాను మరి నా భర్తని తిరిగి తీసుకొస్తావా, నా సంతోషాన్ని తిరిగి మళ్ళీ నాకు ఇస్తావా నువ్వు తీసుకొస్తాను అంటేనే నేను మాట ఇస్తాను అని కాంచన అంటుంది. వేద మౌనంగా ఉండటంతో నువ్వు ఇవ్వవు నాకు తెలుసు నా చావు నేను చావొచ్చు అని కాంచన కోపంగా వెళ్ళిపోతుంది. వేద ఏం చెయ్యాలో అర్థం కాక తన తల్లి దగ్గరకి వస్తుంది. అమ్మా ఆత్మాభిమానం ఎక్కువా కుటుంబ గౌరవం ఎక్కువా అని అడుగుతుంది. ప్రతి అమ్మాయి జీవితంలో ఇలాంటి ప్రశ్న ఒకటి వస్తుంది, కానీ మనం ఎంచుకునే దారి అత్తింటి గౌరవం. ఒక ఆడపిల్ల పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్తే ఆ ఇంటి బాధ్యతలె ఎక్కువ అవుతాయి. కొత్త జీవితం కొత్త ప్రపంచం అన్ని కొత్తగానే అర్థం కాకుండా ఉంటాయి కాలమే అన్నింటినీ పరిచయం చేస్తుంది. కోడలు ఇంటిని చక్కబెట్టడమే కాదు ఇంట్లో వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి. ఒక్కోసారి మన స్వలాభం కన్నా సహాయం గొప్పగా మారుతుందని సులోచన చెప్తుంది. అంటే కాంచనఈ సహాయం చెయ్యమంటున్నవా అని వేద అడుగుతుంది. కోడలిగా నీ బాధ్యత నెరవేర్చమంటున్నాను అని చెప్తుంది.


Also Read: ఆత్మహత్య చేసుకోబోయిన కాంచన- ఖైలాష్ ని విడిపించమని చేతులు జోడించి అడిగిన మాలిని, కుదరదని చెప్పిన వేద


ఖైలాష్ విషయం ఒకసారి చెప్తే వద్దులే మళ్ళీ ఆయన వద్దంటే ఇబ్బంది అవుతుంది. అమ్మ చెప్పింది నిజం కోడలిగా మెట్టిన ఇల్లు సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడే వెళ్ళి కేసు విత్ డ్రా చేసుకుని ఖైలాష్ ని విడిపిస్తాను అని వేద మనసులో అనుకుంటుంది.


తరువాయి భాగంలో..


వేద యష్ కి సారీ చెప్తుంది. దేని గురించి మాట్లాడుతున్నావని యష్ అడగ్గా ఈరోజు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అని చెప్తుంది. ఎందుకు అని అడుగుతాడు ఖైలాష్ మీద పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవడానికి అనడంతో యష్ షాక్ అవుతాడు. అక్క నీతో మాట్లాడిందా ఎమోషనల్ గా మాట్లాడిందా అని యష్ కోపంగా అంటే ప్రాణాలు తీసుకుంటుందనే భయంతో వెళ్ళాను అని చెప్తుంది.


Also Read: కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో