ఫైల్ తీసుకురమ్మని సామ్రాట్ నందుకి ఫోన్ చేసి చెప్తాడు. ఇది కదా మంకీ కావాల్సింది మనం తోక లాగా స్మరత వెనకాలే ఉంటే అతన్ని తులసి విషయంలో కంట్రోల్ చెయ్యొచ్చు నాకు కూడా టికెట్ బుక్ చెయ్యి నేను వస్తాను అనడంతో నందు సరే అంటాడు. తులసి, సామ్రాట్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకలేస్తుందని సామ్రాట్ అనడంతో పులిహోర తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తుంది. అది తీసుకుని తిండికి మొహం వాచిన వాడిలా గబగబా తినేస్తాడు మన హీరో. బాక్స్ ఖాళీ చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు మొత్తం నేనే తినేశానా అని బిక్కమొహం వేస్తాడు అది చూసి తులసి తెగ నవ్వుకుంటుంది.


అంకిత అభి షర్ట్ తీసుకుని నలిపేస్తుంది. నేను హాస్పిటల్ కి వెళ్ళాలి ఐరన్ చేసిన షర్ట్ ని ఇలా నలిపేసావ్ ఏంటి అని అభి కొప్పడతాడు. షర్ట్ నలిగిపోయినందుకే ఫీల్ అవుతున్నావ్ మరి ఇందాక ఆంటీని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావ్ ఇంట్లో వాళ్ళ మనసులో ఎంత నలిగిపోయాయో తెలుసా అని అంకిత అరుస్తుంది. నా మాటలు నెగటివ్ గా ఎందుకు తీసుకుంటున్నావని అభి అంటాడు. నెగటివ్ గా మాట్లాడి అలా ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతావెంటీ కన్న తల్లి గురించి మాట్లాడే పద్ధతి అదేనా అని తిడుతుంది. పేరంటానికి పిలవడానికి వచ్చిన వాళ్ళు అంతకంటే దారుణంగా మాట్లాడారు అని అభి అంటే తులసి ఆంటీ క్యారెక్టర్ గురించి తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడటం దారుణం, అసలు నువ్వు అత్తారింట్లోనే ఉండాల్సింది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని ఫీల్ అవుతున్నానని అంకిత అందంతో నేను నీకోసం వచ్చాను అంకిత అని అభి అంటాడు. నాకు అలా అనిపించడం లేదు ఇంట్లో గొడవలు పెట్టడానికే వచ్చినట్టుగా ఉంది, దయచేసి వెళ్లిపో ప్లీజ్ అని దణ్ణం పెడుతుంది. మంచిగా మాట్లాడి అంకితని తీసుకు వెళ్దామని వచ్చాను ఇప్పుడు కోపంగా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని అభి మనసులో అనుకుని కూల్ గా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. నువ్వు హార్ట్ అయితే సారీ అని చెప్తాడు. కానీ అంకిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


నందు, లాస్య కూడా ఎయిర్ పోర్ట్ కి వస్తారు. సామ్రాట్, తులసి నవ్వుకుంటూ ఉండటం చూసి లాస్య కామెంటరీ మొదలుపెడుతుంది. వీళ్ళ నవ్వు మీద కూడా జీఎస్టీ వేస్తే బోలెడు ఆదాయం వస్తుందని అంటుంది. తులసి వాళ్ళ దగ్గరకి వస్తారు. ఏంటి మేడమ్ అలా చూస్తున్నారు నందుని రమ్మంటే తోకలగా నేను కూడా వచ్చాను ఏంటా అని ఆలోచిస్తున్నారా అని లాస్య తులసితో అంటుంది. అలా ఏమి లాస్య నిజానికి నేను నందుని పొగడాలని అనుకుంటున్నాను. భార్య మీద ప్రేమ నటే ఇలా ఉండాలి, భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఇలా ఉండాలి చాలా మంది మొగుళ్ళు తమతో పాటు టూర్ కి తీసుకెళ్లాడానికి అసలు ఇష్టపడరు అని సామ్రాట్ అనగానే తులసి నందు వైపు ఒక లుక్ ఇచ్చుకుంటుంది. అలాంటి వాళ్ళని చూస్తే చెంప పగలకొట్టాలని అనిపిస్తుంది, యు ఆర్ వెరీ లక్కీ లాస్య అని మీరేమంటారు తులసి గారు అని సామ్రాట్ అడుగుతాడు.


ఆయన్ని పొగిడెంత మంచితనం నాలో లేదు, మంచి భర్త అని ఎవరు పొగడటం కాదు స్వతహాగా ఆయనకే అనిపించాలి. అప్పుడు ఆ సంతోషమే వేరు ఏమంటారు నందగోపాల్ గారు అని తులసి వెటకారంగా అంటుంది. ఫ్లైట్ లో తులసి, సామ్రాట్ మాటలు చూసి నందు, లాస్య తలబాదుకుంటారు. అప్పుడే జబర్దస్త్ నాగి ఎంట్రీ ఇస్తాడు. అందమైన అమ్మాయి పక్కన కూర్చుందమానే ఇది నా సీట్ అని నందుతో అంటాడు. ఎక్కువ మాట్లాడితే మొహం పగిలిపోతుందని నందు సీరియస్ అవుతాడు. తులసి ఫ్లైట్ ఎక్కినందుకు తెగ సంబరపడుతుంటే నందు అది చూసి రగిలిపోతూ ఉంటాడు. గురుడు ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్తాడు ఆవిడ చేతకాదు అంటే మనోడే పెట్టేస్తాడు అని లాస్య చెప్పేసరికి నందు అది జరిగినట్టుగా ఓ బొమ్మ వేసుకుని ఉలిక్కిపడి తలగోక్కుంటాడు. కానీ సామ్రాట్ మాత్రం తులసికి సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాల్వ్ తను పెట్టుకుని చూపిస్తాడు అది చూసి నందు ఊపిరి పీల్చుకుని లాస్య వైపు కోపంగా ఓ లుక్కేస్తాడు. మనం ఉన్నామని మొహమాట పడి ఉంటాడులె అని కవర్ చేస్తుంది.


ఇక ఇంట్లో అంకిత చేసిన వంటలు తినలేక అందరూ అవస్థలు పడుతూ ఉంటారు. పర్వలేదమ్మా ఒకరోజు కూర బాగోకపోతే ఏమి కాదులే ఫీల్ అవకు అని అందరూ సర్ది చెప్తారు. ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా జరిగిందని అంకిత బాధపడుతుంటే అందుకు కారణం నువ్వు కాదు మామ్ అని అభి అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఆంటీ చేసింది అని అంకిత అంటుంది. నీకు వంట అలవాటు తప్పింది ఆ విషయం మామ్ కి కూడా తెలుసు అలాంటప్పుడు పనులన్నీ నీ నెత్తిన వేసి టూర్ కి వెళ్లాల్సిన అవసరం ఏముందని అభి చిరాకుగా అంటాడు. ఏ మాత్రం అనుభవం లేని నీ మీద సంసార బాధ్యతలు వదిలేసి తను షికారుకు వెళ్ళడం అసలు నచ్చలేదని అరుస్తాడు. ఒక్కరోజుకు ఆ మాత్రం సర్దుకుపోలేవా అని అనసూయ అంటుంది. నువ్వు మీ అమ్మ గురించి అపార్థం చేసుకుంటున్నావని అనసూయ అంటే అంతా వాళ్ళ నాన్న పోలిక అని పరంధామయ్య అంటాడు. డాడ్ పోలిక వస్తే తప్పేమీ కాదు మీరందరూ కలిసి మా డాడ్ ని రాక్షసుడిని చేస్తున్నారు అని అభి కోపంగా అంటాడు. 


Also Read: ఖైలాష్ మీద కేసు విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన వేద - కానీ అంతలోనే..


తరువాయి భాగంలో..


తులసి విమనలో తెగ ఎంజాయ్ చేస్తుంటే మన హీరో సామ్రాట్ తనని ఫోటోస్ తీస్తూ మురిసిపోతాడు. అదంతా చూసిన జబర్దస్త్ నాగి మీరిద్దరు భార్యభర్తలు కదా.. ఎంజాయ్ చెయ్యడానికి వెళ్తున్నారు కదా అనేసరికి నందు ఆగ్రహంగా చూస్తుంటే సామ్రాట్, తులసి కూడా షాక్ అవుతారు. ఇంకో మాట నీ నోటి నుంచి వస్తే నీ నాలుక కోస్తా అని నందు నాగికి వార్నింగ్ ఇస్తాడు.


Also Read: నాన్నని తీసుకొస్తానని దేవికి మాట ఇచ్చిన ఆదిత్య- చంపేస్తానంటూ మాధవకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య