సినీ సెలెబ్రెటీలకు విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ప్రేమించి, పెళ్లి చేసుకుని ఏదో ఒక కారణంతో విడిపోతూనే ఉన్నారు. అప్పట్లో నాగచైతన్య - సమంతల విడాకుల వ్యవహారం ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ సంవత్సరాల తరబడి ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఎంతో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ నుంచి కొన్ని జంటలు విడిపోయిన విషయం తెలిసిందే. అటు కోలీవుడ్ లో కూడా ఈమధ్య తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్యతో విడిపోతున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.


ఇక రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. వీరి విడాకుల వార్తను మరవక ముందే ఇప్పుడు టాలీవుడ్లో మరో జంట విడిపోబోతున్నారట. ఈసారి హీరోనో లేక హీరోయినో కాదు ఓ స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నాడు? అనే వివరాల్లోకి వెళ్తే.. సినీ ఇండస్ట్రీలో మొదట్లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత దర్శకుడిగా మారాడుమ్ అరడజన్ సినిమాలు చేయకపోయినా తీసిన సినిమాలతో మంచి విజయాలు అందుకొని దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఈ ఏడాది కూడా ఓ హీరోతో సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ ఏడాది ఆ డైరెక్టర్ కి లైఫ్ లో చాలా ప్రత్యేకం. సినిమాతో సక్సెస్ అందుకొని అదే నెలలో పెళ్లికూడా చేసుకున్నాడు. అది పెద్దలు కుదిర్చిన వివాహం. అయినప్పటికీ కొద్ది రోజులుగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా ఈ ఏడాది మంచి హిట్ అందుకున్న ఆ డైరెక్టర్ కి ఇటీవల ఓ పెద్ద సినిమా ఓకే అయింది. అంతా సాఫీగా సాగిపోతుందని అనుకునే లోపే అతని లైఫ్ ఇప్పుడు అనుకోని మలుపు తిరిగింది.


పెళ్లయి ఆరు నెలలు కాకముందే ఆ జంట విడాకులకు అప్లై చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. గత నెల రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చి అది విడాకుల వరకు దారి తీసినట్లు చెబుతున్నారు. అయితే విడాకులకు అప్లై చేసుకున్నా అందుకు సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఎంత టైం పడుతుందో చెప్పలేం. అది పూర్తయిన తర్వాతే ఆ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద పూర్తిగా దృష్టిపెట్టే అవకాశం ఉందట. ఆ డైరెక్టర్ పేరు ప్రస్తుతానికి బయటకు రాకపోయినా చాలామందికి అతను ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఏదేమైనా ఇన్నాళ్లు హీరో, హీరోయిన్లు విడాకులు తీసుకుంటే ఇప్పుడు మాత్రం ఓ దర్శకుడు విడాకులు తీసుకోవడం టాలీవుడ్ లో బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.


Also Read : సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న బన్నీ, చరణ్ - కారణం అదేనా?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial