కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) నటిస్తున్న తాజా చిత్రం 'విడాముయార్చి' (Vidamuyarchi). 2025 పొంగల్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టీజర్ కు మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో న్యాయపరమైన చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తోంది.
అజిత్ నటించిన 'విడాముయార్చి' మూవీ 'బ్రేక్ డౌన్' అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా నిర్మాతల నుంచి ''విడాముయార్చి' మేకర్స్ అధికారిక రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 'విడాముయార్చి' మేకర్స్ 127 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ 'బ్రేక్ డౌన్' మేకర్స్ నోటీసులు పంపించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా ఈ వార్తలపై 'విడాముయార్చి' చిత్ర నిర్మాతలు స్పందించలేదు. మరి నిజంగానే అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకుందా అనేది తెలియాల్సి ఉంది.
'బ్రేక్ డౌన్'కి 'విడాముయార్చి' రీమేక్ వార్తలు రావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటో తెలియాలంటే ముందుగా 'బ్రేక్ డౌన్' గురించి తెలుసుకోవాలి. కర్ట్ రస్సెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్. దీనికి జొనాథన్ మోస్టో దర్శకత్వం వహించారు. మసాచుసెట్స్ నుంచి శాన్ డియాగోకు క్రాస్ కంట్రీ డ్రైవింగ్ చేస్తున్న ఒక వ్యక్తి గురించి ఉంటుంది ఈ సినిమా స్టోరీ. అతను తన భార్యతో కలిసి ప్రయాణం మొదలు పెడతాడు. కానీ ఊహించని విధంగా మధ్యలోనే వారి కారు ఆగిపోవడంతో పాటు పలు ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఆ తర్వాత ఒక ట్రక్ డ్రైవర్ హీరోకి సహాయం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హీరో వాళ్లు తన వైఫ్ ని కిడ్నాప్ చేసినట్టు పసిగట్టడంతో అతన్ని మధ్యలోనే వదిలేస్తారు. మరి హీరో తన భార్యను కాపాడడానికి ఏం చేశాడు? కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నాడు? అన్నది ఈ మూవీ స్టోరీ.
Also Read: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'లక్కీ భాస్కర్' దర్శకుడితో మోక్షజ్ఞ సెకండ్ మూవీ?
అప్పట్లో ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీకి మంచి ఆదరణ లభించింది. కల్ట్ ఫాలోయింగ్ ఉన్న ఈ సినిమాకు ఇప్పటికి కూడా హాలీవుడ్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన 'విడాముయార్చి' టీజర్ లో కూడా అచ్చం ఇలాంటి విజువల్స్ ఉండడంతో... అది ఖచ్చితంగా 'బ్రేక్ డౌన్'కు రీమేక్ అనే రూమర్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 'బ్రేక్ డౌన్' మేకర్స్ అజిత్ టీంకు భారీ నష్ట పరిహారం కోరుతూ నోటీసులు పంపారు అనే వార్త బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా అజిత్ కుమార్ 2025లో 'గుడ్ బాడ్ అగ్లీ' అనే మరో సినిమాలో కూడా కనిపించబోతున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ కామెడీ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.