ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Balakrishna Son Mokshagna) చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. 'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ (Mokshagna First Movie)ను లాంచ్ చేసే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. అయితే ఇంకా ఈ సినిమా మొదలుకాక ముందే నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. మోక్షజ్ఞ సెకండ్ మూవీ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా టాక్ నడుస్తోంది. 


వెంకీ అట్లూరి దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ
Venky Atluri to direct Mokshagna: నందమూరి మోక్షజ్ఞ రెండవ సినిమా యువ దర్శకుడితో  ఫిక్స్ అయినట్టు టాక్. ఈ ఏడాది దీపావళి సందర్భంగా 'లక్కీ భాస్కర్' అనే సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి. మోక్షజ్ఞ నెక్స్ట్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కథ లాక్ అయ్యిందని, ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక మరోవైపు బాలయ్య ఇదే బ్యానర్ పై బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' అనే సినిమాను చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 14న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.


ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయానికి వస్తే... ఇప్పటిదాకా డైరెక్టర్ గా వెంకీ తెరకెక్కించిన సినిమాల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వెంకీ ఆ తరువాత మిస్టర్ మజ్ను, రంగ్ దే, సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలను తెరకెక్కించారు. మరి ఆయన మోక్షజ్ఞ కోసం ఎలాంటి కథను తీసుకురాబోతున్నారో చూడాలి. ప్రస్తుతనికైతే ఆయన 'లక్కీ భాస్కర్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు మోక్షజ్ఞ 'సింబా' సినిమాతో బిజీగా ఉన్నారు.


Also Read'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?



పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎస్ఎల్వి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజస్విని సంయుక్తంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. 'సింబా' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. రీసెంట్ గా ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన మోక్షజ్ఞ స్టైలిష్ పిక్ తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ తో నందమూరి ఫ్యాన్స్ కు మరో తీపి కబురు అందింది. 


Read Also : Vikrant Massey : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట