Telugu Cinema News | ఈ ఏడాది దసరా కానుకగా చిన్న పెద్ద సినిమాలతో కలిపి దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రజనీకాంత్ హీరోగా నటించిన 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', అలియా భట్ 'జిగ్రా', 'మార్టిన్' అనే కన్నడ పాన్ ఇండియా మూవీ, సుహాస్ హీరోగా నటించిన 'జనక అయితే గనక' వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇన్ని సినిమాలు దసరా బరిలోకి దిగినప్పటికీ అందులో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు మాత్రం చాలా తక్కువ. అలాగే 'దేవర' సందడి దసరాకు కూడా కన్పించింది. ఇక ఇప్పుడు దసరా సంబరాలు ముగియడంతో అందరి కన్ను దీపావళిపైనే ఉంది. ఈ దీపావళికి పలు సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతుంటే, మరోవైపు మేకర్స్ వరుస అప్డేట్స్ తో పలువులు హీరోల ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి సిద్ధమవుతున్నారు. 


దీపావళి కానుకగా టాలీవుడ్ లో వరుస అప్డేట్ల టపాసులు 
ఇక ఈ లిస్ట్ లో అందరూ బడా హీరోలే ఉండడం విశేషం. దీపావళి కానుకగా టాలీవుడ్ లో వరుస అప్డేట్ల టపాసులు పేలబోతున్నాయి. ఈ అప్డేట్ల లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా నుంచి వరుస అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ బడా హీరోలు అందరి కొత్త సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ఏ సినిమా నుంచి, ఏ అప్డేట్, ఎప్పుడు రాబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. 


ఈ దీపావళికి మెగా అభిమానుల్లో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' సినిమా షూటింగ్ పూర్తి కాగా, సంక్రాంతికి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్లలో వేగం పెంచబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఎండింగ్ లో 'గేమ్ ఛేంజర్' నుంచి ఒక పాటను రిలీజ్ చేస్తూ దీపావళి సంబరాలను మొదలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత ఈ దీపావళి కానుకగా 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి టీజర్ రాబోతోంది. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా దీపావళి కానుక అందబోతోంది. 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఈ దీపావళికి ఒక పాటను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. 


బాలకృష్ణ, ప్రభాస్ సినిమాల దీపావళి ట్రీట్ 


ఇక ఈ ఇద్దరు హీరోల సినిమాల నుంచే కాకుండా మరో ఇద్దరు బడా హీరోలైన నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ సినిమాల నుంచి కూడా దీపావళి ట్రీట్ గా అప్డేట్స్ రాబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'ఎన్బికే 109' సినిమాకు సంబంధించిన టైటిల్ ను, టీజర్ ను దీపావళి రోజున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'రాజాసాబ్' సినిమా నుంచి కూడా డార్లింగ్ ఫ్యాన్స్ కు తీపి కబురు అందబోతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 23న ఈ సినిమా నుంచి ఈ వీడియో కంటెంట్ రాబోతుందని అంటున్నారు. అయితే ఈ అప్డేట్స్ అన్నింటిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, బాలయ్య అభిమానులకు పండగే పండగ.


Also Read: Jr NTR : 'దేవర'ను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు- అభిమానులకు హామీ ఇస్తూ తారక్ స్పెషల్ పోస్ట్ వైరల్