ఈ ఏడాది టాలీవుడ్లో పలువురు సెలబ్రిటీలు పెళ్లికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది అనే వార్త వైరల్ అవుతుంది. అయితే పెళ్లి కంటే ముందే ఈ బ్యూటీ కొత్త కాపురం కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు, హైదరాబాదీ అబ్బాయి విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఇప్పటిదాకా పెళ్లి గురించి ప్రస్తావనే లేదు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ ప్రేమాయణం గురించి ప్రకటించినప్పటి నుంచి... పెళ్లి గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఒకానొక సందర్భంలో పెళ్లి గురించి విజయ్ వర్మ కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ ఆ ప్రస్తావన ఎక్కడా వినిపించలేదు. కానీ తాజాగా మరోసారి ఈ జంట 2025లో పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇంకేముంది పెళ్లయితే కొత్త కాపురం పెట్టాల్సిందే కదా... కానీ అవన్నీ పెళ్లయిన తర్వాత చూసుకునే పనులు. అయితే ఈ జంట మాత్రం పెళ్లికి ముందే కొత్త కాపురం గురించి ఆలోచిస్తున్నాట్టుగా తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదు... మొదటి రోజే డిజాస్టర్ టాక్, షోస్ క్యాన్సిల్
సాధారణంగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ముంబైలోని బాంద్రాలో సీ ఫేసింగ్ అపార్ట్మెంట్లు కొనడం చూస్తూనే ఉన్నాము. అలాగే ఇప్పుడు తమన్నా కూడా కొత్త ఇంటి వేటలో పడ్డట్టుగా తెలుస్తోంది. బాంద్రాలో తమన్నా - విజయ్ వర్మలు ఒక సౌకర్యవంతమైన, విలాసవంతమైన అపార్ట్మెంట్ కోసం సెర్చింగ్ లో ఉన్నారని బీటౌన్ లో టాక్ నడుస్తోంది. పెళ్లి కాగానే కొత్త జంట ఆ కొత్త ఇంట్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నారట. ఇటు తమన్నా గాని, లేదా అటు విజయ్ వర్మ గాని ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. కానీ మరోవైపు అభిమానులు మాత్రం ఈ జంట పెళ్లి గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక విజయ్ వర్మ హైదరాబాద్ కు చెందిన అబ్బాయి. బాలీవుడ్ లో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
హైదరాబాద్లోనే పెరిగిన విజయ్ వర్మ పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో యాక్టింగ్ నేర్చుకున్నాడు. "గల్లి బాయ్" సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన విజయ్ వర్మ "మీర్జాపూర్", "ఐసి 814" వంటి సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు తమన్నా సౌత్ తో పాటు నార్త్ లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ఆమె ఇటీవలే హిట్ చిత్రం "స్త్రీ 2"లో మెరిసింది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రాజెక్టులో కలిసి పని చేశాక, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నిజానికి ఈ విషయాన్ని ముందు ప్రైవేట్ గానే ఉంచారు. కానీ సెలబ్రిటీల మధ్య ప్రేమాయణం ఎక్కువ కాలం దాగదు కదా. మొత్తానికి బయట పెట్టక తప్పలేదు. మరి ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కబోతుందో చూడాలి. తమన్నా - విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఆ గుడ్ కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.