తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉంది. సీనియర్ హీరోలకు జంటగా కనిపించేందుకు యంగ్ హీరోయిన్లు నో చెబుతున్నారని కొన్నాళ్లుగా వినబడుతోంది. విచిత్రంగా యంగ్ హీరో అడివి శేష్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు అతని సినిమాల్లోకి అర్జంటుగా ఇద్దరు హీరోయిన్లు కావాలి.
మొన్న బనితా సందు... నిన్న శృతి హాసన్!
ప్రజెంట్ అడివి శేష్ రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. 'గూఢచారి' వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా 'జీ 2' (Goodachari 2 - G2 Movie) మొదలు పెట్టాడు. తన సినిమాలు 'క్షణం', 'గూఢచారి'కి డీవోపీగా వర్క్ చేసిన షానీల్ డియోని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ 'డకాయిట్' అని మరొక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు హీరోయిన్లు కావాలి.
'మేజర్' మూవీ హిందీలో సక్సెస్ అయ్యింది. నార్త్ ఆడియన్స్, సెలబ్రిటీలకు శేష్ తెలుసు. అతడి మూవీలో యాక్ట్ చెయ్యడానికి బనితా సందు ఎగ్జైట్ అయ్యింది. ఆ విషయం ఇంటర్వ్యూల్లో చెప్పింది. కట్ చేస్తే, 'గూఢచారి 2' నుంచి ఆవిడ వాకవుట్ చేసిందని టాక్. బాలీవుడ్ మూవీ 'అక్టోబర్'లో వరుణ్ ధావన్ జంటగా కనిపించింది బనితా సందు. ఆ మూవీతో ఆమె హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది. మొదటి సినిమాకు మంచి పేరు తెచ్చుకుంది. విక్కీ కౌశల్ 'సర్దార్ ఉధమ్'లో కూడా యాక్ట్ చేసింది. అడివి శేష్ మూవీ నుంచి ఆవిడ ఎందుకు ఎగ్జిట్ అయ్యిందనేది సస్పెన్స్.
'గూఢచారి 2' నుంచి బనితా సందు తప్పుకొన్న కొన్ని రోజులకు 'డకాయిట్' నుంచి శృతి హాసన్ కూడా తప్పుకొంది. ఆల్రెడీ ఆ న్యూస్ ఆడియన్స్ వరకు వచ్చింది. శేష్ సినిమా 'డకాయిట్'కు డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక శృతి హాసన్ నో చెప్పారని యూనిట్ మెంబర్స్ నుంచి లీక్స్ వస్తున్నాయి. కానీ, అసలు విషయం వేరని ఇండస్ట్రీలో గుసగుస. అందులో నిజమెంతో ఆ ఈశ్వరుడికి ఎరుక. ఏది ఏమైనా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు హీరోయిన్లు అడివి శేష్ సినిమాల నుంచి బయటకు వచ్చారు.
Also Read: ఫ్లాప్ దర్శకుడికి మరో అవకాశం ఇస్తున్న దిల్ రాజు - యంగ్ హీరోతో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్!
అడివి శేష్ సినిమాల్లో ఎందుకిలా జరుగుతోంది?
'గూఢచారి 2', 'డకాయిట్' షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మేజర్ పోర్షన్స్ కొన్ని షూట్ చేశారు. 'గూఢచారి 2' సెట్స్‌లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీకి గాయాలు కూడా అయ్యాయి. ప్రజెంట్ హీరోయిన్ అవసరం లేని సన్నివేశాలను, అడివి శేష్ ఇంకా మిగతా యాక్టర్లు ఉన్న సీన్లు తీస్తున్నారు. అవి కంప్లీట్ అయ్యాక హీరోయిన్ కావాలి. సేమ్ టు సేమ్ 'డకాయిట్'కి కూడా అంతే! అడివి శేష్ సినిమాల కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. కానీ, ఎవరు సెట్ కావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు హీరోయిన్లు ఎగ్జిట్ కావడంతో అసలు ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది? అడివి శేష్ సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది? అని మేనేజర్స్ సర్కిళ్లలో డిస్కషన్ జరుగుతోంది. శేష్ సినిమా అంటే కొంత మంది హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదని గుసగుస.
Also Read: ఎవరీ రియా? అసలు, ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?