ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ అవైటింగ్ సినిమాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది 'పుష్ప 2'. ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా కనీసం టీజర్, ట్రైలర్ లేదా పాటలు పెద్దగా రిలీజ్ కాకుండానే 'పుష్ప 2' మేనియా ఊపేస్తోంది. ఇక ప్రమోషన్స్ చేస్తే ఆ ఫీవర్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ డేట్ దగ్గర నుంచి మొదలుకొని పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో 'పుష్ప 2' సినిమాలో ఐటమ్ సాంగ్ గురించిన చర్చ కూడా ఉంది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను అనుకుంటున్నారంటూ గత కొన్ని రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతుండగా... తాజాగా మరో కొత్త అప్డేట్ బయటకొచ్చింది. సదరు హీరోయిన్ ఆ పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది ? అనే వార్త వైరల్ అవుతుంది.


'పుష్ప 2' ఐటమ్ సాంగ్ లో శ్రద్ధ 
'పుష్ప 2' ఈ ఏడాది చాలామంది ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సినిమా 'స్త్రీ 2'తో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో అల్లు అర్జున్ తో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడబోతోంది అనేది తాజా రూమర్. ఫస్ట్ పార్ట్ లో సమంత 'ఊ అంటావా' అనే ఐటం సాంగ్ తో చేసిన మ్యాజిక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఇలా సినిమాలో మరో పవర్ ఫుల్ డాన్స్ నెంబర్ తో ప్రేక్షకులను అలరించబోతోంది శ్రద్ధా కపూర్ అంటూ టాక్ నడుస్తోంది. అయితే ముందుగా ఈ పాట కోసం దిశ పటాని, త్రిప్తి దిమ్రిలను తీసుకుంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారని వార్త వినిపిస్తోంది. 


శ్రద్ధ రెమ్యూనరేషన్
'స్త్రీ 2' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 'పుష్ప 2'లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న శ్రద్ధ కపూర్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ అందుకోబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. శ్రద్ధా కపూర్ 4 కోట్ల రూపాయల భారీ పారితోషికంతో ప్రత్యేక పాట కోసం సైన్ చేసిందని, నటి వ్యక్తిగత సిబ్బంది, ప్రయాణాలు, సౌకర్యాల కోసం నిర్మాతలకు అయ్యే ఖర్చుతో పాటు, శ్రద్ధా 4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ను ఇంటికి తీసుకువెళ్లబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ ఇది ఓ స్టార్ హీరోయిన్ ఒక సినిమాకు తీసుకునే పారితోషికం. 



ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్, శ్రీవల్లిగా రష్మిక మందన్న, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాసిల్, కేశవగా జగదీప్ ప్రతాప్ బండారి, మంగళం శ్రీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ భరద్వాజ్, ఎంపీ భూమిరెడ్డి సిదన్నజయప్ప నాయుడు, రావు రమేశ్‌జయప్ప నాయుడు జాలి రెడ్డిగా, మొల్లేటి మోహన్‌గా అజయ్, మొల్లేటి ద్రమరాజ్‌గా శ్రీతేజ్, చెన్నై మురుగన్‌గా మైమ్ గోపి, సబ్-ఇన్‌స్పెక్టర్ కుప్పరాజ్‌గా బ్రహ్మాజీ, పార్వతమ్మగా కల్పలత నటించారు. సీక్వెల్‌లో నటీనటులు తమ పాత్రలను రిపీట్ చేయనున్నారు. వీరితో పాటు జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 6 2024న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.



Read Also :Amaran Telugu Trailer: ఇదీ ఇండియన్ ఆర్మీ ఫేస్- ఆకట్టుకుంటున్న 'అమరన్' ట్రైలర్, గూస్ బంప్స్ తెప్పించే హైలెట్స్ ఇవే