సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆయన మాజీ అల్లుడు ధనుష్ (Dhanush) కీలక పాత్రను పోషించబోతున్నాడు అనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం నుంచి సూపర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు వీళ్లిద్దరు కాంబోను తెరపై చూస్తామా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా రూమర్ల ప్రకారం వారి కల నెరవేరే రోజు వచ్చినట్టుగా కనిపిస్తోంది.


తలైవా రజనీకాంత్ రీసెంట్ గా 'వేట్టయాన్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను 'వేట్టయాన్' పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాను తమిళ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అనే వివాదం కూడా ఈ సినిమా టాలీవుడ్ లో పెద్దగా ఆడకపోవడానికి ఒక కారణం. అంతే కాదు కలెక్షన్స్ పరంగా రజనీకాంత్ గత సినిమా 'జైలర్' మ్యాజిక్ ను ఈ సినిమా క్రియేట్ చేయలేకపోయింది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీ పై ఫోకస్ పెట్టబోతున్నారు.


లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' అనే సినిమాను రజనీకాంత్ కమిట్ అయిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అంచనాలను అమాంతం పెంచాయి. అయితే ఈ మూవీ పూర్తయ్యాక రజనీకాంత్ 'జైలర్' సీక్వెల్ చేయబోతున్నారు. ఈ సినిమాతోనే రజినీకాంత్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2'కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా 2025 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది.


Also Read'కంగువా' ఫస్ట్ హాఫ్​పై ప్రొడ్యూసర్ క్రేజీ కామెంట్స్, ‘బాహుబలి’ రికార్డులు బద్దలవుతాయా?



ఈ నేపథ్యంలోనే తాజాగా 'జైలర్ 2' సినిమాలో ధనుష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది తమిళ సినీ వర్గాల్లో. ఇదే కనుక జరిగితే ఈ మాజీ మామ అల్లుళ్లు ఇద్దరినీ బిగ్ స్క్రీన్ పై ఒక ఫ్రేమ్ లో వీక్షించడం అనేది అభిమానులకు మంచి ట్రీట్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు ఉంది నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.


కాగా మరోవైపు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పటికే తమ విడాకుల విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా, దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. మరోవైపు ధనుష్ రీసెంట్ గా 'రాయన్' అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రజనీకాంత్ ఇటీవలే అనారోగ్యానికి గురి కాగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్నాకే ఆయన 'కూలీ', 'జైలర్ 2' సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు.


Also Readమాకూ హార్ట్ ఉంది... రెస్పెక్ట్ ఇవ్వండి - ఫీమేల్ జర్నలిస్టుకు అనన్య నాగళ్ల ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్?