Sivakarthikeyan Amaran Trailer: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'అమరన్'. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ సామి డైరెక్టర్. ఈనెల 31న తెలుగు, తమిళ భాషలతో పాటు ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. శివ కార్తికేయన్ ఈ సినిమాలో మేజర్ ముకుంద వరదరాజన్ అనే ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. ఆయన భార్య ఇందూ రెబెక వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.


మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా సినిమా 


ట్రైలర్ లో ఉన్న ఒక్కో డైలాగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. దీపావళి కానుక రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ని హీరో నాని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. అమరుడైన మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే 2.20 నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ మొదట్లోనే మేజర్ ముకుందన్ తన కూతురితో కలిసి ఆడుకుంటున్న హ్యాపీ వీడియోను షేర్ చేశారు.


"ఈ కడలికి ఆ నింగికి మధ్య ఉన్న దూరమే నాకు తనకి..." అంటూ సాయి పల్లవి చెప్పిన ఎమోషనల్ డైలాగ్. "ఇది ఇండియన్ ఆర్మీ ఫేస్" అంటూ శివ కార్తికేయన్ తన నట విశ్వరూపం చూపించారు. అలాగే ముకుందన్ ఆర్మీలోకి ఎలా వచ్చారు? ఆయన పర్సనల్ లైఫ్ తో పాటు వైఫ్ తో ఎలా పరిచయమైంది ? అనే విషయాలను కూడా ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. ఇక ఆ తర్వాత ఆయన ఆయన మేజర్ గా మారి ఉగ్రవాదులను ఎలా మట్టుబెట్టారు, ఆ దాడుల్లో దేశం కోసం వీరోచితమైన పోరాటాలలో ఎలా పాల్గొన్నారు అనే సన్నివేశాలను ట్రైలర్ లో చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ట్రైలర్ శివ కార్తికేయన్ ముకుందన్ పాత్రలో నటించడం కాదు జీవించారు అన్పించేలా చేసింది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రాణం పోసింది. ఇక సై పల్లవి మరో హైలెట్. మొత్తానికి ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచింది. 






నిజానికి అమరన్‌పై మొదట్లో అంచనాలు తక్కువగా ఉండగా, సాయి పల్లవి క్యారెక్టర్ డెబ్యూ వీడియో విడుదలైనప్పటి నుండి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను ఒక్కో భాషలో ఒక్కో హీరో రిలీజ్ చేయడంతో పాటు ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని 'హే మిన్నెలే', 'వెన్నిలావు చరల్' అనే రెండు పాటలు విడుదలై అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. ఇక ఇందు పాడిన ర్యాప్ సాంగ్ కూడా మంచి ఆదరణ పొందగా, గత వారం చెన్నైలో మ్యూజిక్ లాంచ్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. మరి అక్టోబర్ 31న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.


Read Also : Prabhas Birthday: ప్రభాస్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే... రాజా సాబ్ కాస్ట్లీ గురూ