పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్ ఇప్పుడు మరింతగా పెరిగింది. ఆయన తెరపై కనిపించి చాలా కాలం అవుతున్నప్పటికీ మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఆయన నెక్స్ట్ మూవీ గురించి అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న "ఓజి", "హరిహర వీరమల్లు" లాంటి సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి ఏ మూవీ ముందుగా వస్తుంది? అనే విషయం ఉత్కంఠభరితంగా మారింది.  


ముందు రిలీజ్ అయ్యే మూవీకి జాక్ పాట్ 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడు ఆల్ టైం హైలో ఉంది. అభిమానులు ఆయన నుంచి ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా ఫుల్ జోష్ లో ఉన్నారు. పాలిటిక్స్ లో పవన్ సక్సెస్ కావడమే దీనికి కారణం. ఇలాంటి హై టైంలో రిలీజ్ అయ్యే ఆయన ఫస్ట్ మూవీ కచ్చితంగా నిర్మాతలకు జాక్ పాట్ లాంటిదే. మరి ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ ను ఎవరు కొట్టేయబోతున్నారు? అనే చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. అయితే నిర్మాతలేమో 'హరిహర వీరమల్లు' ముందు రిలీజ్ కాబోతోందని అంటున్నారని, కానీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం "ఓజి"నే ముందు రిలీజ్ కాబోతోందని అంటున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 


ఫస్ట్ విడుదల అయ్యే మూవీ ఇదే ?


ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే... ఆయన ముందుగా "హరిహర వీరమల్లు" మూవీని ఫినిష్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం డేట్స్ కూడా ఇచ్చేశారట. ఇంకా "ఓజీ" డేట్ పై క్లారిటీ రాలేదని సమాచారం. కాబట్టి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 'హరిహర వీరమల్లు' మూవీ ముందుగా రిలీజ్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్లో ఈ వీకెండ్ జాయిన్ కాబోతున్నారు. 


వీకెండ్ 'హరిహర వీరమల్లు' సెట్‌లోకి పవన్ 


సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్ 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ను రీస్టార్ట్ చేయబోతున్నారు. విజయవాడలో ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందులో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను షూటింగ్ చేయబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు జాయిన్ కానున్నారు. ఈ షెడ్యూల్ తో 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది.



రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేసిన టీమ్
'హరిహర వీరమల్లు' మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. అలాగే హరిహర వీరమల్లు' ప్రీమియర్స్ కు ప్రధాన మంత్రి మోడీ హాజరు కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అభిమానులంతా 'హరిహర వీరమల్లు' కంటే ఎక్కువగా 'ఓజి' మూవీ కోసమే ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల సంగతి పక్కన పెడితే... ఇప్పుడు ఆయనకు ఉన్న హై, అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఏ మూవీ రిలీజ్ అయితే ఆ నిర్మాతకు మాత్రం కాసుల పంట పండడం పక్కా. ఇక పవన్ కళ్యాణ్ ఈ రెండు సినిమాలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్' అనే మరో సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమాలు పూర్తయ్యాక మొదలు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్.


Read Also :  Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్