కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా 'కంగువ' మూవీతో పాన్ ఇండియా ప్రయత్నం చేసి, చతికిలబడ్డ సంగతి తెలిసిందే. సూర్యతో పాటు తమిళ చిత్ర సీమ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పట్టుకుంది. ఇన్నేళ్ల నుంచి కోలీవుడ్ కలలు కన్న 1000 కోట్ల రికార్డును 'కంగువ' నెరవేరుస్తుందని ఆశ పడ్డారు. కానీ ఈ సినిమా ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమా టాక్ పక్కన పెడితే ఈ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చి, 2024లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. అక్కడితో 'కంగువ' కథ అయిపోలేదు, ఆ తర్వాత కూడా సూర్య బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై ఈ మూవీ రిజల్ట్ ఎఫెక్ట్ పడింది. సూర్య నెక్స్ట్ చేయాల్సిన 350 కోట్ల భారీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. 


పౌరాణిక ఇతిహాసం 'కర్ణ' అనే సినిమాను చేయాల్సి ఉంది సూర్య. కానీ తాజాగా "కంగువ" రిజల్ట్ ని చూశాక మేకర్స్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త ప్రకారం... 350 కోట్ల భారీ బడ్జెట్ తో చేయాల్సిన ఈ సినిమా బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయినట్టుగా సమాచారం. 'కంగువ' రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ బడ్జెట్ విషయంలో వెనకడుగు వేశారని అంటున్నారు. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించాల్సిన ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందాల్సి ఉంది. ఇక ఈ సినిమాతోనే సూర్య డైరెక్టుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమాలో సూర్యను టైటిల్ రోల్ కి అనుకోగా, మూవీలో ముఖ్యమైన పాత్ర ద్రౌపదిగా జాహ్నవి కపూర్ నటిస్తుందని భావించారు. కానీ ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయిందనే బజ్ బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ సినిమా ఆగిపోయిందా? లేదంటే త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందా ? అనే విషయంపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. 


Also Read: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు



ఇదిలా ఉండగా నవంబర్ 14న శివ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ "కంగువ" రిలీజ్ అయింది. ఈ భారీ బడ్జెట్ మూవీలో సూర్య హీరోగా నటిస్తే, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటాని వంటి నటీనటులు "కంగువ"తో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రిలీజ్ కి ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పారు. రీసెంట్ గా డైరెక్టర్ శివ అజిత్ కుమార్ తో తన నెక్స్ట్ మూవీ చేశాక, సీక్వెల్ ను పట్టాలెక్కిస్తామని, 2026లో ఆ సీక్వెల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఈ మూవీ రిజల్ట్ ని పక్కన పెట్టిన సూర్య తన 44వ సినిమాతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.


Read Also : Naga Chaitanya - Fake News Alert: అదంతా రూమరే... నాగచైతన్య - శోభిత ధూళిపాళ పెళ్లి గురించి జరుగుతున్న ఆ ప్రచారంలో నిజం లేదు