తొలి చూపులోనే ప్రేమలో పడి, పెద్దలను ఒప్పటించి పెళ్లి చేసుకున్నారు టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సమంత. వీరిద్దరు కలిసి నటించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా సెట్‌లో ప్రేమలో పడ్డారు. చాలా కాలం లవ్ లో కొనసాగిన వీరిద్దరు, చివరకు 2017 లో వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు వీరి సంసార జీవితం సజావుగా కొనసాగింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు దాదాపు నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు.  2021లో  విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఇద్దరూ సినిమా పరిశ్రమలో బిజీ అయ్యారు.


నాగ చైతన్య రెండో పెళ్లి?


ఇక తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే అమ్మాయిని ఫిక్స్ చేశారని సమాచారం. ఓ  బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడట. అమ్మాయి కుటుంబానికి సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాట ముచ్చట కూడా పూర్తి అయినట్లు ఆ వార్తల సారాంశం. అయితే, దీనిపై అక్కినేటి కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇందులో వాస్తవం ఏమిటనేది కూడా తెలియాల్సి ఉంది.


శోభితతో ప్రేమాయణం అంటూ వార్తలు


ఇక సమంత విడాకుల తర్వాత నాగ చైతన్య  నటి శోభితతో ప్రేమలో పడినట్లు ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాతో పాటు మీడియాలో వీరి గురించి పలు రకాల వార్తలు వినిపించాయి.  ఈ డేటింగ్ వార్తలను శోభిత ధూళిపాళ కొట్టిపారేసింది.“ప్రస్తుతం నాకు మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి.   జీవితంలో ఎన్నో మంచి అనుభూతులను వదిలేసి ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే తీరికనాకు లేదు. నా గురించి వస్తున్న రూమర్స్ కు నాకు సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పని నేను శ్రద్ధతో చేసుకుంటూ వెళ్తాను” అని వెల్లడించింది.  గతంలో లండన్ లో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ ఫోటో వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరి రిలేషన్‌షిప్‌ గురించి బాగా ప్రచారం జరిగింది. గతంలోనూ రెండు మూడు సార్లు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. 


ఇక నాగ చైతన్య చివరిసారిగా ‘కస్టడీ’ మూవీలో కనిపించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని మత్స్యకారుల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  


Read Also: ‘జవాన్‘, ‘గదర్ 2‘ సిల్లీ మూవీస్ - నటుడు నానా పటేకర్ సంచలన వ్యాఖ్యలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial