ఐశ్వర్యా రజినీకాంత్ (Aishwarya Rajinikanth)తో ధనుష్ (Dhanush) విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తమ 18 ఏళ్ల వివాహా బంధానికి వాళ్లిద్దరూ 2022లో స్వస్తి పలికారు. వారి విడాకుల విషయాన్ని 2022లో ప్రకటించగా... 2024లో డివోర్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఇప్పుడు వారిద్దరూ విడి విడిగా ఉంటున్న సంగతి తమిళ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ అందరికీ తెలుసు. కానీ ఇద్దరి కొడుకుల కోసం మాత్రం ధనుష్, ఐశ్వర్య తల్లిదండ్రులు చేయాల్సిన, నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని మాత్రం పంచుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా ధనుష్ డేటింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
మృణాల్ ఠాకూర్ ప్రేమలో ధనుష్?
ధనుష్ డేటింగ్ చేస్తున్నాడంటూ అతగాడి లిస్ట్‌లోకి ఇంకో హీరోయిన్ పేరు చేరిపోయింది. ప్రస్తుతం నార్త్, సౌత్‌లో క్రేజీయెస్ట్ భామగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)కు మంచి డిమాండ్ ఏర్పడింది. 'సీతా రామం' మూవీతో సౌత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 'హాయ్ నాన్న' అంటూ మళ్లీ హిట్ కొట్టారు. ఇప్పుడు ఆమె చేతిలో పలు సౌత్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ ప్రాజెక్టుల్ని కూడా ఆమె లైనులో పెట్టేశారు. ఇటీవల అజయ్ దేవగణ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ రిలీజ్ అయ్యింది.
'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ రిజల్ట్ ఆశించినట్టు లేదు. కలెక్షన్స్ అంతగా రాలేదు. కానీ ఆ సినిమా ప్రమోషన్స్ క్రమంలో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో ధనుష్, మృణాల్ చెట్టా పట్టాలేసుకుని కనిపించారు. చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.
Also Read: విడాకులు తీసుకుంటున్న మరో హీరోయిన్? ఉన్నట్టుండి వస్తున్న లీక్స్ వెనుక కారణం ఏమిటి?
అయితే బీ టౌన్ నుంచి కూడా దాదాపు ఇదే సమాధానం వస్తోంది. అయితే వారి ప్రేమను మాత్రం ఇంకా నిర్దారించలేమని, వారు కూడా ఈ విషయాన్ని పబ్లిక్ లేదా మీడియాకు చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయలేదని అక్కడి మీడియా కోడై కూస్తోంది. మరి వీరిద్దరి రిలేషన్ మీద ఓపెన్ స్టేట్మెంట్ కానీ, ఖండించడం గానీ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అయితే తెలుగులో అడివి శేష్‌తో 'డెకాయిట్' అనే మూవీని చేస్తున్నారు. ఇక ధనుష్ అయితే అటు దర్శకుడు, నిర్మాత, హీరోగా అంటూ పలు ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించి ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: