తమిళ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన పావని రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకున్నారు.‌ ఇది ఆమెకు రెండో పెళ్లి. తెలుగు సినిమాలలో కూడా పావని రెడ్డిని నటించడం వల్ల ఆమె మ్యారేజ్ న్యూస్ ఇక్కడ కూడా వైరల్ అయింది. పావని రెడ్డి కంటే ముందు మరో తమిళ బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ ప్రియాంక దేశ్ పాండే కూడా పెళ్లి చేసుకున్నారు. అది కూడా రెండో పెళ్లి. వాళ్ళిద్దరి కంటే కొన్ని రోజుల ముందు తెలుగులో ఒక బిగ్ బాస్ బ్యూటీ పెళ్లి చేసుకున్నారు.‌ ఆమెకు అది మూడో పెళ్లి అని టాక్. 

మొదటి రెండు పెళ్లిళ్లు దాచిన బిగ్ బాస్ బ్యూటీ!?హిందీలో, తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకు ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. కానీ తెలుగులో రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ‌ బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్లకు చెప్పకపోతే ఒక సంఖ్యలో సినిమాలు ఏమీ రావడం లేదు. 

సినిమాలు చేసి బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లి వచ్చిన వాళ్లకు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. బుల్లితెర వీక్షకులలో పాపులారిటీ పెరగడం తప్ప. దాంతో వాళ్లు మళ్లీ సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు లేదంటే టీవీ షోలు చేస్తున్నారు. తెలుగులో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేసిన ఒక తెలుగు అమ్మాయి బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసింది. షోలో ఆవిడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ‌ రన్ చేసిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.‌ సంచలన దర్శకుడితో సినిమా చేసిన ఆ అమ్మాయి, బిగ్ బాస్ ఇంటిలో ప్రేమ కథలను పక్కన పెట్టి... బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. 

ఆయనకు ఇది రెండో పెళ్లి... మొదటి భార్యకు డివోర్స్‌!బిగ్ బాస్ బ్యూటీ కావడంతో ఆవిడ పెళ్లికి మంచి కవరేజ్ వచ్చింది. ఆ అందాల భామ కూడా పెళ్లి హంగామాను లైవ్ ఇచ్చింది.‌ ఆ తర్వాత భర్తను రియాలిటీ షోలకు తీసుకు వచ్చింది.‌‌ పెళ్లి తర్వాత ఇద్దరూ సంతోషంగా ఉన్న మూమెంట్స్ చూసి అభిమానులు సైతం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే... ఆవిడ గురించి బాగా తెలిసిన జనాలు సైతం మూడో పెళ్లి తర్వాత సంతోషంగా ఉంటే చాలని అనుకుంటున్నారు.

Also Readమహేష్ బాబుకు ఈడి నోటీసులు... రియల్ ఎస్టేట్ కంపెనీ కేసులో విచారణకు... 6 కోట్లకు లెక్కలు చెప్పాలని...

అసలు విషయం ఏమిటంటే... ఆ‌ బిగ్ బాస్ బ్యూటీ ఇండస్ట్రీలో రాకముందు రెండు పెళ్లిళ్లు చేసుకుందని, మొదటి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే పెటాకులు అయ్యిందని, ఆ తరువాత రెండో పెళ్లి తర్వాత సంసార జీవితం కొన్నాళ్ళు సాఫీగా సాగిన నటన మీద ఆసక్తితో విడాకులు ఇచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిందని టాక్. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకుంది. అన్నట్టు ఆయనకు ఇదే రెండో పెళ్లి. మొదటి భార్యకు డివోర్స్‌ ఇచ్చినట్టు టాక్. మొత్తం మీద ఇద్దరు కలిసి ఇప్పుడు జీవితంలో సెటిల్ అయ్యారు.

Also Readరాశీ కాదు... హాటీ... రెడ్ స్విమ్‌సూట్‌లో సెక్సీగా బ్యూటిఫుల్ ఖన్నా, ఫోటోలు చూడండి