అత్యంత ప్రతిష్మాత్మకపై గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై ‘RRR’ సినిమా సత్తా చాటుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు.. నాటు..’పాట ఆస్కార్ కు ఎంట్రీగా భావించే ఈ అవార్డును అందుకుంది. ఆ పాటకు సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. ఈ కేటగిరిలో అవార్డును అందుకున్న గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ‘RRR’ ఘనత సాధించింది. అంతర్జాతీయ స్టేజ్‌పై ఈ అవార్డు ప్రకటించగానే ‘RRR’ టీమ్ ఆనందంలో మునిగిపోయింది.
అటు ఈ అవార్డును అందుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు చెప్తున్నారు.
ఇదో చారిత్రాత్మక విజయం- చిరంజీవి
‘నాటు.. నాటు..’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇదో చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. “బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు.. నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఎమ్‌ఎమ్ కీరవాణి గారికి అభినందనలు, హిస్టారిక్ అచీవ్ మెంట్ సాధించిన ‘RRR’ టీమ్, రాజమౌళికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘నాటు.. నాటు..’ పాటను చూసి ఇండియా గర్వపడుతుంది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
అద్భుతం, ఇండియన్ అభిమానుల తరఫున శుభాకాంక్షలు- ఏఆర్ రెహమాన్
అటు ఆస్కార్ విజేత, ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం ‘RRR’ టీమ్ కు అభినందనలు తెలిపారు. “ఇదో నమ్మశక్యం కాని అద్భతం.. భారతీయ అభిమానుల తరఫున కీరవాణి గారికి శుభాకాంక్షలు. రాజమౌళి గారికి, ‘RRR’ టీమ్ కు కంగ్రాట్స్” అని ట్వీట్ చేశారు.
Read Also: ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబోస్