చిరంజీవి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ‘గాడ్ ఫాదర్‌’ ట్రైలర్‌  విడుదల అయ్యింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ అదిరిపోయింది.

  ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో భాగంగా సినిమా యూనిట్ ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. చిరంజీవి యాక్షన్‌, అదిరిపోయే డైలాల్స్,  బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి. చిరంజీవి న్యూ లుక్ లో వారెవ్వా అనిపించారు. లూసీఫర్ సినిమాను పూర్తిగా మార్చి తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఈ సినిమాను రూపొందించారు. నయనతార, సల్మాన్‌ఖాన్‌, సత్యదేవ్‌, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్‌ కీలక పాత్రలు పోషించిన ‘గాడ్‌ ఫాదర్‌’ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.



మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరెక్కిన లేటెస్ట్ సినిమా 'గాడ్ ఫాదర్'. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.


అటు ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'గాడ్ ఫాదర్'.. 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందిందని చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెలిపారు. సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు అభినందించార‌ని, ఇక ప్రేక్ష‌కులు త‌మ ఆశీస్సులు అందించ‌ట‌మే మిగిలింద‌ని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు.


అటు 'గాడ్ ఫాదర్'లో క్లైమాక్స్ ఫైట్ / సీన్ సుమారు 15 నిమిషాలు ఉంటుందని తెలిసింది. అందులో చిరంజీవి, సల్మాన్... ఇద్దరూ కనిపిస్తారు. మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్'కి ఇది రీమేక్ అన్నది తెలిసిందే. అయితే, ఆ సినిమాతో పోలిస్తే... 'గాడ్ ఫాదర్'లో కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం. అందులో క్లైమాక్స్ ఫైట్ ఒకటి. 'లూసిఫర్'లో ఉన్నది ఉన్నట్లు తీయకుండా... కొత్తగా ట్రై చేశారట. కథలో ఆత్మ మిస్ కాకుండా ఆడియన్స్‌కు 'హై' ఇచ్చేలా డిజైన్ చేశారట. క్లైమాక్స్‌ను చిరు, సల్మాన్ ఇమేజ్‌కు తగ్గట్టు తీశారట. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే కాదు... 'లూసిఫర్' కథలోనూ కొన్ని మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' తెరకెక్కించారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారట. అదీ అసలు కథకు ఏమాత్రం అడ్డు పడకుండా చేశారట.


కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.