మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather). మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'లూసిఫర్'కు రీమేక్. ఆ సినిమాను తెలుగులో డబ్ చేశారు. థియేటర్లలో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఎవరైనా మోహన్ లాల్ సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు.


తెలుగులో డబ్ అయిన సినిమాను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం ఏమిటి? ప్రశ్న నుంచి చిరంజీవికి ధీటైన ప్రతినాయకుడిగా సత్యదేవ్ సరిపోతాడా? ప్రశ్న వరకు ఎన్నో వినిపించాయి. 'గాడ్ ఫాదర్' దర్శకుడు మోహన్ రాజా అయితే... ''మళ్ళీ 'లూసిఫర్' చూసి రండి! ఆ సినిమా చూసిన వాళ్ళకు, చూడని వాళ్ళకు నా సినిమా నచ్చుతుంది. కొత్త స్క్రీన్ ప్లేతో, ఆ సినిమాలో ఒక పాయింట్ నుంచి కథను కొత్తగా చెప్పాం'' అని పేర్కొన్నారు. అమెరికాలో 'గాడ్ ఫాదర్' ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...  అక్కడ నుంచి సినిమాకు హిట్ టాక్ లభిస్తోంది.


స్క్రీన్ మీద మెగాస్టార్...
మ్యూజిక్‌తో తమన్!
'గాడ్ ఫాదర్' సినిమాకు ఆన్ స్క్రీన్ హీరో మెగాస్టార్ చిరంజీవి అయితే... ఆఫ్ స్క్రీన్ హీరో తమన్ అని చెబుతున్నారు. చిరంజీవి నటన, తమన్ సంగీతం సూపర్ అని అంటున్నారు. కథలో కోర్ పాయింట్ చెడగొట్టకుండా సినిమాలో మార్పులు బాగా చేశారనే మాట వినబడుతోంది. బాస్ ఈజ్ బ్యాక్ అని, మెగాస్టార్ మళ్ళీ హిట్ కొట్టారని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ప్రేక్షకులలో కొందరు కూడా బావుందని చెబుతున్నారు.


Also Read : ఎప్పటికీ పవన్‌కే మద్దతు, ఏపీని ఏలాలి - తమ్ముడికి బాసటగా చిరంజీవి !


నెగిటివ్ టాక్ కూడా... 
'గాడ్ ఫాదర్'కు హిట్ టాక్‌తో పాటు నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. అది యాంటీ ఫ్యాన్స్ చేస్తున్నారనేది మెగా ఫ్యాన్స్ ఆరోపణ. కొన్ని న్యూట్రల్ ట్విట్టర్ అకౌంట్స్ నుంచి కూడా సినిమా ఏవరేజ్ అని ట్వీట్లు పడుతున్నాయి. 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా మెగా అభిమానులకు సంతోషాన్ని ఇస్తుందనేది ఎక్కువ మంది చెప్పే మాట (Godfather Twitter Talk).


Also Read : ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోండి - ‘ఆదిపురుష్’ దర్శకుడిపై ‘కేజీఎఫ్’ నటి ఆగ్రహం


























































  
'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార (Nayanthara), సత్యదేవ్ (Satyadev), మురళీ శర్మ, స్టార్ యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj), 'బిగ్ బాస్' దివి, బ్రహ్మాజీ, సముద్రఖని తదితరులు నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు.


ఆల్రెడీ విడుదలైన 'నజభజ జజర' పాటకు స్పందన బావుంది. గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. 'థార్ మార్...' పాటకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే... సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు ఐటమ్ సాంగ్ 'బ్లాస్ట్ బేబీ' విడుదల చేశారు.