సోనీ ఐకానిక్ ‘గాడ్ ఆఫ్ వార్’ సిరీస్ లో ఎనిమిదో భాగాన్ని 2018లో విడుదల చేసింది. గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన లాస్ట్ గేమ్స్ సిరీస్ మాదిరిగా కాకుండా.. ‘గాడ్ ఆఫ్ వార్ 2018’ నార్స్ దేవతల ప్రపంచంలో జరుగుతుంది. క్రాటోస్ భార్య మరణించిన తర్వాత మిడ్‌గార్డ్ రాజ్యంలో ఈ గేమ్ కొనసాగుతుంది. క్రాటోస్, అతడి కుమారుడు అట్రియస్ ఇద్దరూ వివిధ ప్రాంతాలలో ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ గేమ్ నవంబర్ 9న ప్లేస్టేషన్‌లో విడుదల కాబోతుంది. ఇది 2018 గేమ్ సంఘటనల అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే కథ. నార్స్ ప్రపంచంలో తండ్రి, కొడుకుల ప్రయాణం గురించి ఇందులో ఉంటుంది.
‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ ప్లేస్టేషన్ 4లో అందుబాటులో ఉంటుందా?
గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ రూపొందుతున్న సమయంలో ప్లేస్టేషన్ 5 ఎక్స్ క్లూజివ్ టైటిల్ అని చాలామంది భావించారు. కానీ, ఈ సంవత్సరం ప్రారంభంలో ప్లేస్టేషన్ స్టూడియోస్ హెర్మెన్ హల్స్ట్ హెడ్‌తో Q&A సెషన్‌లో, టైటిల్ గతంలో మాదిరిగా ఉంటుందని వెల్లడించారు. రెండు వెర్షన్‌ల మధ్య ఏదైనా తేడా ఉందా? లేదా? అనే విషయాన్ని సోనీ ఇంకా వెల్లడించాలేదు. ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ వెబ్‌సైట్ ప్లేస్టేషన్ 4 డిజిటల్, డిస్క్ వెర్షన్‌లో ఉన్నవారు అదనపు ఖర్చుతో ప్లేస్టేషన్ 5 డిజిటల్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.
PC వెర్షన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది?
PCకి ప్లేస్టేషన్-ఎక్స్‌క్లూజివ్ టైటిల్‌లను తీసుకురావడంలో సోనీ ట్రాక్ రికార్డ్‌ను పరిశీలిస్తే, గాడ్ ఆఫ్ వార్ ఫ్రాంచైజీలోని తాజా విడతను PCకి అందించడానికి మరికొంత సమయం పట్టవచ్చు. గాడ్ ఆఫ్ వార్ 2018ని PCకి తీసుకురావడానికి సోనీ మూడు సంవత్సరాల సయయం తీసుకుంది.
‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ స్టోరీ ఏంటంటే?
క్రాటోస్ జోతున్‌హీమ్‌కు ప్రయాణం చేసి, ఫ్రెయా కొడుకు బల్దూర్‌ని చంపిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కథ జరుగుతుంది. ట్రైలర్ లో థోర్ క్రాటోస్ ఇంటిని సందర్శించిన అనంతరం జరిగే పరిణామాలను చూపించారు. అట్రియస్ ఇప్పుడు యుక్తవయస్సులో ఉన్నాడు. ఫ్రెయా, థోర్ కాకుండా, కొత్త, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడవలసి ఉంటుంది. వారి పక్కన మిమిర్ ఉంటుంది. ట్రైలర్‌లో అంగ్ర్‌బోడా అనే కొత్త పాత్రను పరిచయం చేశారు. అతడు వీరుడిగా పరిచయం చేశారు. ట్రైలర్ చివరలో థోర్ సవతి సోదరుడు, ఓడిన్ కొడుకు – టైర్ ను కూడా గమనించవచ్చు. ఓడిన్ జైలులో కనిపిస్తాడు. క్రాటోస్ తన బ్లేడ్ ఆఫ్ ఖోస్‌ను అలాగే ఉంచుకోగా.. ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ ట్రైలర్ కొంత వైమానిక వార్ ను చూపిస్తుంది. .
‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ ప్రీ ఆర్డర్ చేశారా?
‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ అనేక ఎడిషన్‌లు ఉన్నప్పటికీ, అత్యంత ఖరీదైన కలెక్టర్, జోత్నార్ ఎడిషన్‌లు ఇప్పటికే చాలా చోట్ల అమ్ముడయ్యాయి. అట్రియస్ రైసన్ స్నో ట్యూనిక్, క్రాటోస్ రైసన్ స్నో ట్యూనిక్ అనే గేమ్ కాస్మోటిక్స్ ముందస్తుగా అందుకోలగరు. మీరు స్టాండర్డ్ ఎడిషన్‌ను ముందస్తుగా ఆర్డర్ చేస్తే, బేస్ గేమ్, కాస్మెటిక్ వస్తువులను పొందుతారు. అలాగే, ప్లేస్టేషన్ 4 బండిల్‌ను కొనుగోలు చేసే వారు ప్లేస్టేషన్ 5 బండిల్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్’ డిజిటల్ డీలక్స్ ఎడిషన్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు కొన్ని అదనపు బోనస్‌లను పొందే అవకాశం ఉంటుంది. ఇవి స్టోరీలోని వివిధ పాయింట్‌లలో అన్‌లాక్ చేయబడతాయి. గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ కలెక్టర్ ఎడిషన్ డిజిటల్ డీలక్స్ ఎడిషన్‌లోని 16-అంగుళాల Mjolnir హామర్ రెప్లికా ప్రతిరూపం, 2-అంగుళాల వానిర్ ట్విన్స్ కార్వింగ్‌లు, డ్వార్వెన్ డైస్ సెట్, స్టీల్ బుక్‌కేస్‌తో పాటు అన్ని గూడీస్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
Read Also: నేనింకా చావలేదు - ఆ వార్తలపై స్పందిస్తూ ఏడ్చేసిన సమంత