సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా గార్గి. కోర్టులో జరిగే ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కించిన సినిమా. ఓ అమ్మాయి తన తండ్రి కోసం న్యాయస్థానంలో ఎంతగా పోరాడిందో చూపించే మూవీ. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. సాయిపల్లవి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. ఏ ఓటీటీలో ఇంకా చిత్రయూనిట్ ప్రకటించనప్పటికీ సోనీలివ్ ఆ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుందని టాక్. త్వరలో సోనీలివ్ లో ఈ సినిమా ప్రసారం కాబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో సాయిపల్లవి నటించిన విరాటపర్వం స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం గార్గి థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాబట్టి ఆగస్టు నెలలో సోనీలివ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 


గార్గి సినిమా విడుదలకు ముందే ఆ సినిమా పోస్టర్ కు, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలయ్యాక కూడా మంచి స్పందనే వచ్చింది ప్రేక్షకుల నుంచి. ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ గా సాయిపల్లవి చక్కగా నటించింది. ఆమె తండ్రిని కాపాడుకునే ప్రయాణంలో ఎన్నో సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగే క్రమం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా చిన్నదే అయినా చాలా చక్కని సందేశం ఇచ్చింది.