పాపులర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'(Game of Thrones)లో లీడ్ రోల్ పోషించింది నటి ఎమీలియా క్లార్క్(Emilia Clarke). మదర్ ఆఫ్ డ్రాగన్ గా ఆమె పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సిరీస్ చూసిన చాలా మందికి ఆమె క్యారెక్టర్ ఫేవరెట్ అనే చెప్పాలి. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఎమీలియా. ఆ తరువాత 'స్టార్ వార్స్' అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించింది. ఇప్పుడు ఈమె నటించిన 'ది సీగల్'(The Seagull) అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఎమీలియా. ఇందులో భాగంగా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. తనకు బ్రెయిన్ అనూరిజం(Brain aneurysm) ఎటాక్ అయిందని.. దాని వలన బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోయి.. బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయని చెప్పింది. అది చాలా డేంజర్ అని.. ఈ వ్యాధి బయటపడగానే సర్జరీ చేయించుకున్నానని చెప్పింది.
2011లో మొదటి సర్జరీ అయిందని.. ఆ తరువాత 2013లో మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో ఎమర్జన్సీ ట్రీట్మెంట్ తీసుకోవాలని వచ్చిందని పేర్కొంది. దాని వలన మాట్లాడే విధానంలో మార్పొస్తుందని.. సరిగ్గా మాట్లాడలేరని చెప్పింది. అలానే ఈ సర్జరీ వలన బ్రెయిన్ లో సగ భాగం పని చేయదని తెలిపింది. ఇకపై తన బ్రెయిన్ ని పూర్తిగా ఉపయోగించలేనని కానీ స్పష్టంగా మాట్లాడగలగడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. చాలా కొద్దిమందికి మాత్రమే అది సాధ్యమని.. అందులో తను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది