సినిమా ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోలు చాలామందే ఉన్నారు. అలాంటి వారి లో హీరో నందు ఒకరు. నందు ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్'. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘జబర్దస్త్’ ఫేమ్ రష్మీ నటిస్తోంది. ఇటీవల సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ బానే ఉండటంతో ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్ళింది. ఈ సినిమాతో అయినా నందు మంచి హిట్ సాధించాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ లో నందు రష్మీ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు నందు మెడకు చుట్టుకుంది.
ట్రైలర్ చూసిన కొంతమంది ఫన్నీ గా కామెంట్స్ చేస్తుంటే, ఇంకొంత మంది నందు పై వెటకారంగా కామెంట్స్ పెడుతున్నారు. అది కూడా నందు భార్య గీతామాధురి ఈ ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది. ట్రైలర్ లో సీన్స్ చూసి నందుని ఏం అంటుంది అని ఊహించుకుంటూ ఫన్నీ గా మేమ్స్ తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంది కదా.. అదేనండీ "నువ్ అల్లుకుపోతా అన్నప్పుడే గ్రహించాల్సిందిరా ఐ డిడ్ ఏ మిస్టేక్" అనే డైలాగ్ ను ఈ సినిమాకు అన్వయిస్తూ.. ‘‘నువ్ రష్మీ తో సినిమా అన్నప్పుడే మేము గ్రహించాల్సిందిరా, నువ్ గుంటూరు టాకీస్ సీన్ ఎదో చేస్తావని ఐ డిడ్ ఏ మిస్టేక్’’ అంటూ ఫన్నీగా మీమ్ క్రియేట్ చేసి పోస్ట్ చేసారు.
ఇలాంటివి చాలానే ఉన్నాయి, దాచాం లోపల అని ఓ ఫంక్షన్ లో హీరో బాలయ్య అన్నట్టు. ఈ సినిమా మీద మేమ్స్ వస్తూనే ఉన్నాయి. అన్నిటి కాన్సెప్ట్ ఒక్కటే రష్మీ, నందు రొమాన్స్. ఇప్పుడే ఇలా ఉంటే సినిమాలో ఏం చేస్తారో అంటూ మేమ్స్ తో హీట్ పుట్టిస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నిన్న కాక మొన్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం పై కూడా పెద్ద హంగామా నే చేసి అటెన్షన్ క్రియేట్ చేసింది మూవీ టీమ్. ప్రమోషన్ కార్యక్రమానికి హీరోయిన్ రష్మీ రాను అని చెప్పిందని, ఆమె షూటింగ్ స్పాట్ కి వెళ్లి మరీ గొడవ పడ్డారు మూవీ టీమ్. తీరా చూస్తే అదంతా ప్రమోషన్స్ కోసమే అన్నట్లు తేలిపోయింది. దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెరిగిపోవడమే కాకుండా రోజురోజుకూ మీమ్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా వచ్చే నెల 4 వ తేదీన విడుదల కానుంది. విడుదలకు ఇన్ని రోజుల ముందే ఇన్ని కామెంట్స్ వస్తుంటే.. విడుదల అయ్యే లోపు సినిమా నుంచి ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో, ఇంకెన్ని మీమ్స్ క్రియేట్ అవుతాయో మరి. ఈ సినిమాతో అయినా హీరో నందుకు మంచి హిట్ అందుతుందో లేదో చూడాలి.
Also Read: జయమాలిని, జ్యోతిలక్ష్మి పాటలున్నాయని సినిమాలు ఆడలేదు - 'బొమ్మ బ్లాక్ బస్టర్' ట్రైలర్