68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కాసేపటి క్రితమే కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2020లో వచ్చిన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది. ఈసారి దాదాపు నాలుగొందల సినిమాలు అవార్డుల కోసం పోటీ పడగా.. పదిహేను ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరీలో 'కలర్ ఫోటో' సినిమాకి అవార్డు దక్కింది. అలానే ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్(అల వైకుంఠపురములో) కి అవార్డు దక్కింది.
చిన్న సినిమాగా విడుదలైన 'నాట్యం' సినిమా రెండు అవార్డులను కొట్టేసింది. ఉత్తమ కొరియోగ్రఫీ (సంధ్యారాజు) ఉత్తమ మేకప్ విభాగాల్లో ఈ సినిమాకి అవార్డులు దక్కాయి. ఆ విధంగా టాలీవుడ్ కి ఈసారి నాలుగు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఎప్పటిలానే తమిళ, మలయాళ సినిమాలకు ఎక్కువ అవార్డులు దక్కాయి. సూర్య నటించిన తమిళ చిత్రం ‘సూరరై పొట్రు’(ఆకాశమే నీ హద్దురా) సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా సూర్యకి కూడా అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డుని అక్షయ్ కుమార్ తో కలిసి పంచుకోనున్నారు.
Also Read: జాతీయ పురస్కార విజేతలు - 'కలర్ ఫోటో' సినిమాకి నేషనల్ అవార్డు, లిస్ట్ లో తమన్ కూడా!
❤ జాతీయ ఉత్తమ చిత్రం - సూరారై పొట్రు
❤ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం - కలర్ ఫొటో
❤ జాతీయ ఉత్తమ నటులు - సూర్య, అజయ్ దేవగణ్
❤ జాతీయ ఉత్తమ నటి - అపర్ణ మురళి
❤ జాతీయ ఉత్తమ సంగీతం - అల వైకుంఠపురంలో (తమన్)
❤ జాతీయ ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ - సూరరై పొట్రు (జీవీ ప్రకాష్)
❤ జాతీయ ఉత్తమ స్టంట్స్- అయ్యప్పనుమ్ కోషియమ్
❤ జాతీయ ఉత్తమ దర్శకుడు - సచ్చిదనందన్ కేఆర్
❤ జాతీయ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - టీవీ రాంబాబు (నాట్యం)
❤ జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే - సూరారై పొట్రు
❤ ఉత్తమ డైలాగ్స్ - మండేలా
❤ ఉత్తమ సహాయ నటుడు - బిజు మీనన్
❤ ఉత్తమ కొరియోగ్రాఫర్ - నాట్యం, సంధ్యా రాజు
❤ ఉత్తమ మలయాళ చిత్రం - థింకలియా నిశ్చయమ్
❤ ఉత్తమ కన్నడ చిత్రం - డొల్లు
❤ ఉత్తమ తమిళ చిత్రం - శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్ (తమిళ్)
❤ ఉత్తమ హిందీ చిత్రం - తులసీదాస్ జూనియర్
❤ ఉత్తమ కుటుంబ కథా చిత్రం - కుంకుమార్చన్ (మరాఠి)
❤ ఉత్తమ ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయం ఎన్నుమ్ శిల పెంగల్లమ్) - తమిళం
❤ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - అనీస్ నాడోడి (కప్పేలా -మలయాళం)
❤ ఉత్తమ లిరిక్స్ - సైనా(హిందీ), మనోజ్ ముంతషిర్
❤ ఉత్తమ స్పెషల్ జ్యూరీ అవార్డ్ - అడ్మిటెడ్ (హిందీ, ఇంగ్లీష్)
❤ ఉత్తమ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం - ద సేవియర్, బ్రిగేడియర్ ప్రీతమ్ సింగ్ (పంజాబీ)
❤ ఉత్తమ ఎడిటింగ్ - అనాదీ అతలే (బార్డర్ ల్యాండ్స్)
❤ ఉత్తమ సినిమాటోగ్రఫీ - నిఖిల్ ఎస్ ప్రవీణ్ (శబ్దికున్ కలప్ప, మలయాళం)
❤ ఉత్తమ సంగీత దర్శకుడు - విశాల్ భరద్వాజ్ (1232 కి.మీ. - మరేంగే తో వహీన్ జాకర్)
❤ ఉత్తమ దర్శకుడు - ఆర్‌వీ రమణి (ఓ దట్స్ భాను- ఇంగ్లీష్, తమిళం, మలయాళం, హిందీ)
❤ మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ - మధ్యప్రదేశ్