Kakinada News : కాకినాడ జిల్లా తుని మార్కెట్ యార్డులో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. బజారుకి వచ్చిన జనాలను పరుగులు పెట్టించింది. వీధుల్లో పరిగెడుతూ జనాలు, వాహనాలపై దాడి చేసింది. ఎద్దు ఒక్కసారిగా జనాలపై విరుచుకుపడడంతో భయాందోళనకు గురై వారంతా పరుగులు తీశారు. ఎద్దు దాడిలో పది మందికి పైగా గాయాలు పాలయ్యారు. ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వైద్యం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఎద్దును బంధించేందుకు పశుసంవర్ధక, పురపాలక శాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పశు వైద్యులు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ఎద్దు దొరకడం లేదు.
బాలుడ్ని హత్య చేసిన ఎద్దు
దక్షిణ సూడాన్‌లో ఒక పొలం దగ్గర బండి లాగుతున్న ఎద్దు.. ఉన్నట్లుండి అక్కడే ఉన్న ఓ పన్నెండేళ్ల పిల్లాడిపై దాడి చేసింది. ఇటీవల జరిగిన ఈ ఘటనలో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి పోలీసులకు చేరింది. బాలుడి హత్య జరిగింది... ఓ ఎద్దు హత్య చేసింది.. అనే విషయాలను మాత్రమే వారు తీసుకున్నారు. వెంటనే వెళ్లి క్రైమ్ సీన్‌ను హ్యాండోవర్ చేసుకున్నారు. బాలుడ్ని పోస్టుమార్టానికి పంపేశారు. ఏమీ ఎరుగనట్లుగా పక్కనే మేత మేస్తున్న ఎద్దుకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు లాక్కుపోయారు. అక్కడ కట్టేశారు.
ఎద్దు అరెస్టు
ఆ ఎద్దును అరెస్టు చేసి రూంబేక్ సెంట్రల్ కౌంటీ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. పిల్లాడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లామని అది పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం కుటుంబానికి అప్పగించేశామని పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు హత్యా నేరం కింద ఆ అవును కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ప్రకటించారు. దక్షిణ సూడాన్ చట్టాల ప్రకారం హత్య ఎవరు చేసినా హత్యే. అందుకే బుల్ ఇప్పుడు జైలు శిక్షకు గురవబోతోంది. ఎద్దుకు ఓ మూడేళ్ల వరకూ శిక్ష పడవచ్చని భావిస్తున్నారు. ఎద్దుకు జైలు శిక్ష ముగిసిన తర్వాత.. దాన్ని బాధితుల కుటుంబానికి అప్పగిస్తారు. అక్కడ ఎద్దుకు బాగానే కడుపు నింపుతారు. అలాంటి ఇబ్బంది రాదు. తెలియక చేసినా త.. తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి.. ఎద్దుకూ జైలు శిక్ష తప్పడంలేదు.
Also Read : Nara Chandra Babu: ప్రజలంతా వైసీపీ ప్రభుత్వానికి తిరగబడాలి - చంద్రబాబు