Adivi Sesh : అడివి శేష్ హీరోగా నటించిన మూవీ ‘మేజర్(Major)’. దర్శకుడు శశి కిరణ్ తిక్క రూపొందించిన ఈ సినిమా 2008లో 26/11 దాడుల్లో అసువులు బాసిన మేజర్ సందీప్ కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది రిలీజైన మేజర్ లో నటించినందుకు గానూ భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్.. హీరో అడివి శేష్‌ను అభినందించారు. 


అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన 'మేజర్' సినిమా .. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఫస్ట్ వీకెండ్ లోపే ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. జూన్ 3, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని డైరెక్టర్ శశి కిరణ్ తిక్క ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. నార్త్ రీజియన్‌‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయినా.. ఈ తరహా కథలతో అక్కడ పలు వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలు రావడంతో ఈ సినిమా అక్కడ అంతగా వసూళ్లను రాబట్టలేకపోయింది.


సౌత్ ఏషియాలో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో నెంబర్ 1వ ప్లేస్‌లో కొనసాగిన 'మేజర్' సినిమా.. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. దీంతో ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందాన్ని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు  అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైన 'మేజర్' మూవీలో నటించినందుకు గానూ అడివి శేష్ కు ఎనలేని పేరు, ప్రఖ్యాతలు దక్కించుకున్నారు.


తాజాగా అడివి శేష్ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. హీరో అడివి శేష్ తనను కలవాల్సిందిగా భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నుండి ఆహ్వానం అందుకున్నాడు. ఆ తర్వాత 26/11 హీరో 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ను రూపొందించినందుకు శేష్‌ని కొవింద్ అభినందించారు. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు నటుడిని అభినందించి, ఆయన ఆశీర్వదించారు. ఇది అతిపెద్ద విజయమని, మేకర్స్‌కి గర్వకారణమైన క్షణమని ఈ సందర్భంగా అడవి శేష్ చెప్పారు.


పాన్ ఇండియా ఫిల్మ్ మేజర్ భారీ బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాను జీఎం ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఏ ప్లస్ ఎస్ (A+S) మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. 'మేజర్‌'లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు.


Also Read: కావ్య తరఫున అపర్ణని ఎదిరించిన ధాన్యలక్ష్మి- కనకానికి మస్కా కొట్టి స్వప్న జంప్