ధాన్యలక్ష్మి ఏడుస్తుంటే వచ్చి ఏమైందని కావ్య అడుగుతుంది. మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను, నీ తరఫున నేను రాజ్ ని నిలదీస్తే ఇది మా భార్యాభర్తల విషయం నువ్వు కల్పించుకోకు అన్నాడు. కళ్యాణ్ కంటే కూడా రాజ్ ని నేను ఎక్కువ ముద్దు చేసేవాడిని. కానీ వాడు ఇప్పుడు పెద్ద వాడు అయిపోయాడు కన్నతల్లిని కాదు కదా పరాయిదాన్ని అయిపోయాను కదా అని బాధపడుతుంది. ఆయనది చిన్న పిల్ల మనస్తత్వం కోపంలో అనేస్తారు అయినా అది మీ మీద కోపం కాదు నామీద కోపమని కావ్య నచ్చజెపుతుంది. నువ్వు చెప్పింది నిజమే రాజ్ ది చిన్నపిల్లల మనస్తత్వమే కానీ చిన్న పిల్లోడు కాదు కదా అనేసి వెళ్ళిపోతుంది. స్వప్న రెడీ అయి బయటకి వచ్చేసరికి కనకం ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి అమ్మని బురిడీ కొట్టించి బయటకి వెళ్లాలని స్వప్న ప్లాన్ వేస్తుంది.


Also Read: వేద పిచ్చిలో మునిగితేలుతున్న యష్- పెళ్లికి వచ్చిన ఆదిత్య, ఏం జరగబోతోంది!


బొమ్మలు శుభ్రం చేస్తుంటే ఈ పనులు నీకెందుకు నువ్వు వెళ్ళి వంట చేసుకోమని అంటుంది. దేని కోసం ఇదంతా చేస్తుంది నటిస్తుందా? లేదంటే మారిపోయిందా అని అనుమానపడుతుంది. ఎలాగైతే ఏమి కనకాన్ని ఇంట్లోకి పంపించేస్తుంది. తను లోపలికి వెళ్ళగానే స్వప్న మెల్లగా రాహుల్ ని కలిసేందుకు వెళ్ళిపోతుంది. కావ్య ఇంట్లో పూజ గది శుభ్రం చేసి దీపం పెడుతుంది. పూజ ఎవరు చేస్తున్నారా అని రాజ్ తో పాటు అందరూ కిందకు వస్తారు. అపర్ణ వచ్చి చూసేసరికి కావ్య దేవుడికి హారతి ఇస్తుంది. అది చూసి కోపంతో ఊగిపోతుంది. కావ్య హారతి తీసుకొచ్చినా తీసుకోకుండా అపర్ణ మొహం తిప్పేసుకుని ఇంటి తాళాలు కూడా ఇవ్వమని వెటకారంగా అంటుంది. స్వచ్చందంగా ఈ ఇంటి కోడలి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని చెప్తుంది.


అపర్ణ: పూజ గదిలో అత్తయ్య తర్వాత నేను తప్ప ఎవరూ రాలేదు. ఇలా ఎవరు పడితే వాళ్ళు అడుగుపెడితే ఎలా? ఈ పిల్ల ఎలా వచ్చింది. ఈ ధైర్యాన్ని ఎవరు నూరిపోస్తున్నారు


ఇంద్రాదేవి: నీకు వీలు కాలేదని నేను రమ్మని చెప్పాను


అపర్ణ: నేను ఒక నిర్ణయం తీసుకుంటే మీరు కూడా దానికి కట్టుబడి ఉండాలి కదా. మీరే నా మాటకి విలువ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు ఎలా విలువ ఇస్తారు. నా కొడుకు భార్యగా అంగీకరించలేదు అయినా తన గదికి పంపించారు. ఇప్పుడు ఎంతో పవిత్రంగా చూసుకునే పూజ గదిలోకి ఎందుకు పంపించారు ఏం అర్హత ఉందని పంపించారు


ధాన్యలక్ష్మి: రాజ్ తన మెడలో తాళి కట్టాడు. ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది ఎందుకు ఒప్పుకోవు. ప్రపంచానికి దుగ్గిరాల ఇంటి వారాసుడికి భార్యగా పరిచయం చేశారు. నువ్వు ఇలా మొండిగా ఉండబట్టే ఈ ఇంట్లో కావ్యకి విలువ లేకుండా పోయింది. నువ్వు ఇలా ఉండబట్టే కావ్యని ఇంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటకి పంపించేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఏంటి షరతులు ఇల్లంతా ఒకటే అది పూజ గది అయినా వంట గది అయినా. కోడలు ఉండాల్సిన చోటే ఉంది కొద్దిగా మానవత్వం చూపించమని కోపంగా వెళ్ళిపోతుంది


అపర్ణ: ఇలాంటి వాళ్ళకి చొరవ ఇస్తే ధాన్యలక్ష్మికి కూడ అలుసు అయిపోయాను ఇక నుంచి తనని పూజ గదిలోకి పంపించడానికి వీల్లేదు


Also Read: రాజ్యలక్ష్మిని వణికించేసిన దివ్య- నందుని ఇరికించేందుకు పక్కా స్కెచ్ సెట్ చేసిన లాస్య


డైనింగ్ టేబుల్ దగ్గర కావ్య ఉందని అపర్ణ కూర్చోవడానికి నిరాకరిస్తే ఇంద్రాదేవి సర్ది చెప్పి కూర్చోబెడుతుంది. రాజ్ వెళ్లబోతుంటే ధాన్యాలక్ష్మి కౌంటర్ వేసేసరికి వెళ్ళకుండా ఆగిపోతాడు. రేఖ కావాలని టిఫిన్ లో ఉప్పు ఎక్కువగా కలిపేస్తుంది. అందరూ తిని ఊసేస్తారు. ఏమైంది నీకు అనేవాళ్లకు ఇంకా అనే ఛాన్స్ ఇవ్వాలా అంటుంది. ఏమి తెలియనట్టు మళ్ళీ రుద్రాణి అందరినీ పస్తులు ఉంచావు కదా అనేస్తుంది. అన్నింటిలో తల దూర్చవద్దని రాజ్ తిట్టేసి వెళ్ళిపోతాడు.