Balakrishna Craze: యా... యా... యా... జై బాలయ్య... విదేశీయులూ ఫిదా హోగయా! స్టెప్పులు వేశారయ్యా!

యా... యా... యా... జై బాలయ్య! - 'అఖండ'లో పాట ఇది. ఇప్పుడు ఎవరి నోట విన్నా 'జై బాలయ్య' అనేది వినబడుతోంది. ఈ పాటకు విదేశీయులూ ఫిదా అయ్యారు. చాలా హ్యాపీగా స్టెప్పులు వేశారు.

Continues below advertisement

నట సింహ నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'అఖండ' మేనియా నడుస్తోంది. అమెరికాలోని తెలుగు జనాలూ 'అఖండ' సినిమా విడుదల రోజున ర్యాలీలు చేశారు. పక్కా కమర్షియల్ ఫార్ములాతో బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. వసూళ్ల పరంగానూ సినిమా దూసుకు వెళుతోంది.
'అఖండ'లో 'యా... యా... యా... జై బాలయ్య' సాంగ్ ట్రెండ్ అవుతోంది. సినిమా చూసిన వాళ్లు, చూడని వాళ్లు థియేటర్ల దగ్గర ప్రేక్షకుల స్పందన చూసి 'జై బాలయ్య' అంటున్నారు. ఈ పాటకు విదేశీయులూ ఫిదా అయ్యారు. ఓ ఫారినర్ 'జై బాలయ్య' పాటకు స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఆ సాంగ్ వీడియో ట్రెండ్ అవుతోంది.

Continues below advertisement

'అఖండ'కు లభిస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ధైర్యం పరిశ్రమలో ఏర్పడింది. ధైర్యంగా సినిమాలను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. బాలకృష్ణను అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలని కోరుకుంటారో, దర్శకుడు బోయపాటి శ్రీను ఆ విధంగా చూపించారని ఆడియన్స్ అంటున్నారు. 'అఖండ'లో బాలకృష్ణ నటనతో పాటు యాక్షన్ దృశ్యాలకు, తమన్ సంగీతానికి మంచి పేరొచ్చింది. త్వరలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అటెండ్ కావచ్చని ఇండస్ట్రీ టాక్.
Also Read: ఐదు భాషల్లో... 'యశోద'గా సమంత... సైలెంట్‌గా సెట్స్ మీదకు సినిమా!
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్ 
Also Read: విల‌న్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola