తమిళ సినీ పరిశ్రమ టాలెంటెడ్ దర్శకుడిని కోల్పోయింది. రేడియో, సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమణ్ కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం తెల్లవారు జామున ఆయన  కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమణ్తం డ్రి సుబ్రహ్మణ్యం సైతం 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ఆయన తండ్రి ప్రోత్సాహంతోనే ఆయన కూడా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు.   


రమణన్‌ తొలినాళ్లలో రేడియో నాటకాలకు సంగీత దర్శకుడిగా పని చేసేవారు. వేలాది రేడియో కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా షార్ట్ ఫిలిమ్స్ చిత్రాలు రూపొందించారు. భక్తిరస డాక్యుమెంటరీలను తెరకెక్కించారు. భగవాన్‌ రమణమహర్షి, షిరిడి సాయిబాబా జీవిత విశేషాలతో డాక్యుమెంటరీలు రూపొందించారు. తమిళంలో ‘ఉరువంగళ్‌ మారలామ్‌’,  ‘విశ్వనాధన్‌ వేలైవేండుమ్‌’ అనే సినిమాలు ఈయన దర్శకత్వంలోనే  రూపొందాయి.  


1983లో మహేంద్రన్, సుహాసిని ప్రధాన పాత్రల్లో ‘ఉరువంగళ్‌ మారలామ్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో కమల్ హాసన్, రజనీ కాంత్ ఇద్దరూ గెస్ట్ రోల్స్ చేశారు. కొన్ని తమిళ సినిమాలకు సంగీతం కూడా అందించారు. .  తమిళ చిత్ర పరిశ్రమలో రమణన్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు దక్కించుకున్నారు. రమణ్ కు భామా అనే భార్య, సరస్వతి, లక్ష్మీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో లక్ష్మిని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ సోదరుడు రవి రాఘవేంద్ర వివాహం చేసుకున్నాడు.


రమణన్ కుమార్తె లక్ష్మీ కుమారుడే యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్. ఎస్వీ రమణన్‌ అనిరుధ్‌ కు తాత అవుతారు. అనిరుధ్ కూడా తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాలకు అనిరుద్ అద్భుతమైన సంగీతం అందించారు. తన తాత మరణించడంతో అనిరుద్ ఫ్యామిలీ శోకంలో మునిగిపోయింది. ఎస్వీ రమణన్‌ సోదరి ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మాసుబ్రమణ్యం. చైన్నైలోని రాజా అన్నామలైపురంలో నివసిస్తున్న రమణన్‌.. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సోమవారం చనిపోయారు.  ఆయన అంత్యక్రియలు బీసెంట్‌నగర్‌ శ్మశాన వాటికలో జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ రంగాలు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.


Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?



Also Read : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?